Nicolas Maduro Arrest: మదురో ది అక్రమ అరెస్టే. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇదే విషయాన్ని అమెరికా కూడా ఒప్పుకుంది. మదురో ను అరెస్టు చేసినంత మాత్రాన అమెరికా పంతం నెగ్గినట్టు కాదు. అతని అరెస్టును.. అరెస్టు చేయడానికి దోహదం చేసిన పరిస్థితులను.. ప్రపంచం ముందు బలంగా చెప్పగలగాలి. అలా చెబితేనే అమెరికా పంతం నెగ్గుతుంది. ప్రపంచం మీద పెత్తనం మరింత పెరుగుతుంది.
మదురో ను అరెస్ట్ చేసిన తర్వాత.. అతనికి వ్యతిరేకంగా అభియోగాలను మరింత బలంగా అమెరికా నిరూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని అమెరికా న్యాయ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ట్రంప్ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మదురో కు వ్యతిరేకంగా అభియోగాలు నమోదు అవుతాయని.. అవి అంతే బలంగా నిరూపితం అవుతాయని వారు చెబుతున్నారు. ఇంతకీ మదురో విషయంలో అమెరికా నిరూపించే అభియోగాలు బలంగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. దానికి ప్రధాన కారణం అమెరికా రూపొందించిన విధానాలే.
ఎక్స్ ట్రాడి షన్ అనేది నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఒక దేశం నుంచి మరొక దేశానికి అప్పగించే చట్టపరమైన విధానం. ఈ చట్టం ప్రకారం ఒక దేశం సైనిక చర్య చేపట్టి.. ఇంకో దేశాధినేతను పట్టుకోవడం అంతర్జాతీయంగా విరుద్ధం. అయితే ఇది అమెరికాకు వర్తించదని వెనిజులా ఘటన ద్వారా ప్రపంచానికి తెలిసిపోయింది. మదురో అరెస్టును అమెరికా తన దేశానికి సంబంధించిన భద్రత చర్య అని పేర్కొంది. ఇదే విషయంపై ఫెడరల్ కోర్టులో ట్రంప్ సర్కారు బలమైన వాదనలు వినిపించడానికి అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ చట్టం ప్రకారం ఇది ఆ దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన ఉల్లంఘన. అది అక్రమ అరెస్టు అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
మదురో అరెస్టును అమెరికా గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ.. యూరోపియన్ యూనియన్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చాథమ్ హౌస్(UK Think Tank) ఇటువంటి విధానాలకు అంతర్జాతీయ చట్టంలో ఎటువంటి న్యాయబద్ధతలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకున్న సైనిక చర్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందికి వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. యు ఎన్ చార్టర్ ను పరిశీలనలోకి తీసుకుంటే.. ఒక దేశం పై మరొక దేశం సైనిక చర్య తీసుకోవాలంటే ఖచ్చితంగా భద్రత మండలి అనుమతి అవసరం. కానీ ట్రంప్ సర్కార్ అటువంటి అనుమతులు తీసుకోలేదు. పైగా వెనిజులా అధ్యక్షుడిని బంధించింది. దీనిపై ట్రంప్ వివరణ ఆసక్తికరంగా మారింది. మదురో అరెస్టుపై అమెరికా పార్లమెంట్ లో కూడా భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయి. వెనిజులా ప్రాంతంలోని పడవలపై దాడులు చేయడాన్ని డెమోక్రాట్లు, ట్రంపు సొంత పార్టీలోని రిపబ్లికన్లు కూడా తప్పు పట్టారు. రిపబ్లికన్ల కు తెలియకుండా.. అమెరికా పార్లమెంట్ అనుమతి కూడా లేకుండా వెనిజులా మీద దాడి చేయడం, ఆ దేశ అధ్యక్షుడిని బంధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా పార్లమెంట్ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఆపరేషన్ వ్యవహారం కోర్టు పరిధి దాకా వెళితే.. ఆ తదుపరి పరిణామాలు వేరే విధంగా ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు అంతర్జాతీయ న్యాయస్థానం ఇటువంటి వ్యవహారాలలో నేరుగా జోక్యం చేసుకోలేదు. ఒకవేళ వెనిజులా లేదా ఇతర దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేస్తే మాత్రం విచారణ జరిగే అవకాశం ఉంది.