Homeఅంతర్జాతీయంNicolas Maduro And Trump: మదురో అపహరణ.. ప్రత్యక్ష సాక్షిగా ట్రంప్.. మైండ్ బ్లాంక్ అయ్యే...

Nicolas Maduro And Trump: మదురో అపహరణ.. ప్రత్యక్ష సాక్షిగా ట్రంప్.. మైండ్ బ్లాంక్ అయ్యే వీడియో

Nicolas Maduro And Trump: ఇటీవల అమెరికా దేశానికి చెందిన డెల్టా ఫోర్స్ కమాండోల బృందం వెనిజులా మీద దాడి చేసింది. ఆ దేశ అధ్యక్షుడు మదురో ను సతీ సమేతంగా అమెరికా తీసుకెళ్లింది. న్యూయార్క్ జైల్లో వేసింది. ఈ వ్యవహారం ప్రపంచం వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. అమెరికా కంపెనీలు వెనిజులా ప్రాంతంలో చమురు వ్యాపారం చేస్తాయని ట్రంప్ ప్రకటించాడు.

మదురో అపహరణ.. దానికి ముందు జరిగిన పరిణామాలపై రకరకాల కథనాలు అనేక మీడియా సంస్థలలో ప్రసారమయ్యాయి. అయితే చాలా వరకు మీడియా సంస్థలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రసారం చేయడంలో విఫలమయ్యాయి. సోషల్ మీడియా వల్ల ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. అది కాస్త అమెరికా అసలు తత్వాన్ని బయటపెడుతోంది. సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న ఆ వీడియోలో దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు ఉన్నాయి.

మదురో ను అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ కమాండోల బృందం అపహరిస్తున్నప్పుడు ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి చోటుచేసుకుంది. ఆ ఆపరేషన్ మొత్తాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గరుండి వీక్షించారు. ఈ వీడియోను ఇన్ని రోజుల తర్వాత కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెరికాకు సంబంధించిన హెలికాప్టర్లు వెనిజులా దేశం పైకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత మదురో నివాసముండే ప్రాంతానికి చేరుకున్నాయి. దానికంటే ముందు ఆ ప్రాంతంలో కరెంటు పోయింది.. ఇదంతా కూడా ట్రంప్ వీక్షిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఆపరేషన్ విజయవంతంగా కొనసాగింది. చివరికి విజయం సాధించామని ట్రంప్ సంకేతాలు చూపించారని వెస్ట్రన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

“మదురో కోసం అమెరికా భారీ స్కెచ్ వేసింది. అదంతా కూడా ట్రంప్ పర్యవేక్షణలో సాగింది. చివరికి మదురో ను అమెరికా సైనికులు అపహరించారు. ఆ తర్వాత న్యూయార్క్ జైలుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ విచరణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. అమెరికా మదురో కు వ్యతిరేకంగా వాదనలు వినిపించడానికి సిద్ధమవుతోంది. దీనిపై మదురో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular