https://oktelugu.com/

New Zealand: ఎయిర్ పోర్ట్‌లో కొత్త రూల్.. 3 నిమిషాల కంటే ఎక్కువ కౌగిలించుకుంటే?

చాలా మంది చదువుకి లేదా ఉద్యోగానికి విదేశాలకు వెళ్తుంటారు. తల్లిదండ్రులు, స్నేహితులు వారిని ఎయిర్‌పోర్ట్‌ వరకు వెళ్లి వీడ్కోలు ఇస్తుంటారు. ఇలాంటి సమయాల్లో వారిని చివరిగా కౌగిలించుకుంటారు. ఈ సమయాల్లో ఎవరూ కూడా కౌగిలించుకోవద్దని చెప్పరు. కానీ ఓ ఎయిర్‌పోర్ట్‌లో మాత్రం ఎక్కువ సమయం కౌగిలించుకోకూడదట.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 23, 2024 / 05:38 AM IST

    FotoJet (42)

    Follow us on

    New Zealand: ప్రతి ఒక్కరికి కూడా తమ బాధను తీర్చే ఒక వ్యక్తి ఉండాలని కోరుకుంటారు. కాస్త చిన్న బాధ కలిగిన కూడా ఇష్టమైన వ్యక్తిని కౌగలించుకుంటారు. ఇలా కౌగిలించుకుంటే మనస్సులో బాధ అంతా తీరిపోతుందని భావిస్తారు. ముఖ్యంగా మనకి ఇష్టమైన వ్యక్తులు ఇంటి నుంచి చదువుకి లేదా ఉద్యోగానికి దూరంగా వెళ్తుంటారు. ఇలాంటి సమయాల్లో వారిని మిస్ అవుతూ.. హగ్ చేసుకుంటారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే వారిని ఎక్కువగా హగ్ చేసుకుంటారు. ఈ రోజుల్లో చాలా మంది చదువుకి లేదా ఉద్యోగానికి విదేశాలకు వెళ్తుంటారు. తల్లిదండ్రులు, స్నేహితులు వారిని ఎయిర్‌పోర్ట్‌ వరకు వెళ్లి వీడ్కోలు ఇస్తుంటారు. ఇలాంటి సమయాల్లో వారిని చివరిగా కౌగిలించుకుంటారు. ఈ సమయాల్లో ఎవరూ కూడా కౌగిలించుకోవద్దని చెప్పరు. కానీ ఓ ఎయిర్‌పోర్ట్‌లో మాత్రం ఎక్కువ సమయం కౌగిలించుకోకూడదట. ఇంతకీ ఆ ఎయిర్‌పోర్ట్ ఎక్కడుంది? ఎందుకు కౌగలించుకోకూడదో మరి చూద్దాం.

     

    న్యూజిలాండ్‌లోని డ్యునెడిల్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి రోజూ కొన్ని లక్షల మంది ప్రయాణాలు చేస్తుంటారు. విదేశాలకు వెళ్లేవారికి వీడ్కోలు చెప్పడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎయిర్‌పోర్టుకు వెళ్తుంటారు. ఇలా వెళ్లేటప్పుడు వారిపై ఉన్న ప్రేమను కౌగిలింత ద్వారా చూపిస్తారు. అయితే ఈ ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కువ సమయం కౌగిలించుకోకూడదు. ఎందుకంటే వీడ్కోలు పలకడానికి వచ్చిన వారు ఎక్కువ సమయం కౌగిలించుకోవడం వల్ల ఎయిర్‌పోర్ట్ రద్దీగా ఉంటుందట. దీనివల్ల కొందరు ప్రయాణికులకు ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఆటంకం కలుగుతుందని ఎయిర్‌పోర్ట్ భావించి.. కేవలం మూడు నిమిషాలు మాత్రమే హగ్ చేసుకోవాలని రూల్ పెట్టింది. తమకి ఇష్టమైన వారిని మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం హగ్ చేసుకోవద్దని బోర్డ్ కూడా పెట్టింది. దీనివల్ల ఆ ప్రదేశంలో కేవలం మూడు నిమిషాలు మాత్రమే ఇష్టమైన వారిని కౌగిలించుకోవాలి. అంతకంటే ఎక్కువ సమయం కౌగిలించుకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపింది.

     

    ఈ బోర్డు చూసిన అయిన సరే వీడ్కోలు పలకడానికి వచ్చిన వారు ఎక్కువ సమయం కౌగిలించుకోరని భావించి.. హెచ్చరికలు జారీ చేసింది. ఇలా తక్కువ సమయం కౌగలించుకోవడం వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది ఉండదని, కాస్త ఎయిర్‌పోర్ట్ వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడ్కోలు పలకడానికి హగ్ చాలా ముఖ్యం. అలాంటి హగ్ కేవలం మూడు నిమిషాలు మాత్రమే ఇవ్వడమేంటని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇది మంచి పద్ధతని అంటున్నారు. ఎందుకంటే కొందరు ప్రేమికులు ఇలా గంటల తరబడి హగ్‌లు చేసుకోవడం వల్ల చూసే వాళ్లకు ఇబ్బందిగా ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా చివరిగా వీడ్కోలు సమయంలో కేవలం మూడు నిమిషాలు మాత్రమే హగ్ చేసుకోవాలంటే ఎవరికైనా కష్టమనే చెప్పవచ్చు. మరి ఇలా హగ్ చేసుకోవడానికి మూడు నిమిషాల సమయం సరైనదేనా? కాదా? దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.