https://oktelugu.com/

Turmeric: ఈ పదార్థాల్లో కల్తీ జరిగిందా.. ఈ చిట్కాలతో గుర్తించేద్దామా!

అందరూ వంటల్లో ఎక్కువగా ఉపయోగించే పసుపు, కూరగాయల్లో కూడా కల్తీ జరుగుతోంది. వీటిని గుర్తించలేక కల్తీ పదార్థాలనే తింటున్నారు. వీటిని అధికంగా తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మరి కొన్ని పదార్థాల్లో కల్తీని గుర్తించడం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 22, 2024 9:15 pm
    Turmeric

    Turmeric

    Follow us on

    Turmeric: దేశంలో రోజురోజుకి కల్తీ పెరిగిపోతుంది. మనం తినే ఫుడ్ నుంచి వాడే వస్తువుల వరకు అన్నింట్లో కల్తీ జరుగుతోంది. ఇలాంటి కల్తీ పదార్థాలను తినడం వల్ల చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్నతనంలోనే పిల్లలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. పూర్వకాలంలో వయస్సు పెరిగిన ఆరోగ్యంగా, బలంగా ఉండేవారు. కానీ ఈ రోజుల్లో చిన్నపిల్లలు, వయస్సులో ఉన్నవారు కూడా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీనికి ముఖ్యకారణం నకిలీ పదార్థాలను తినడమే. అందరూ వంటల్లో ఎక్కువగా ఉపయోగించే పసుపు, కూరగాయల్లో కూడా కల్తీ జరుగుతోంది. వీటిని గుర్తించలేక కల్తీ పదార్థాలనే తింటున్నారు. వీటిని అధికంగా తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మరి కొన్ని పదార్థాల్లో కల్తీని గుర్తించడం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    నిత్యం ఎక్కువగా ఉపయోగించే పదార్థాల్లో పసుపు, టీ, కాఫీ ఉంటాయి. టీ, కాఫీ కొందరు వాడితే మరికొందరు వాడరు. కానీ పసుపు మాత్రం తప్పకుండా అందరూ వాడుతారు. ఈ రోజుల్లో ఈ పసుపు కూడా కల్తీ అవుతోంది. పూర్వం రోజుల్లో పసుపును ఇంట్లోనే తయారు చేసుకునేవారు. కానీ ప్రస్తుతం అందరూ మార్కెట్లోనే కొంటున్నారు. ఈ పసుపులో కల్తీ జరిగిందో లేదో తెలియాలంటే.. టేబుల్ స్పూన్ పసుపును గ్లాసు నీటిలో వేయాలి. పసుపు కిందికి చేరితే పసుపులో కల్తీ జరగలేదని గుర్తించవచ్చు. అదే పసుపులోని రంగు పైకి తేలితే పసుపు కల్తీ జరిగిందని భావించవచ్చు. అదే టీ, కాఫీలో కల్తీ జరిగిందని గుర్తించాలంటే.. వీటిని ఒక తడి పేపర్‌పై వేయాలి. పేపర్‌పై వేరే రంగు కనిపిస్తే కల్తీ అనుకోవాలి. టీ, కాఫీ పొడిని కూడా పసుపులా గ్లాసు నీటిలో వేసిన గుర్తించవచ్చని నిపుణులు అంటున్నారు.

    నిత్యం మనం వాడే కూరగాయల్లో కూడా కల్తీ జరుగుతోంది. ఇందులో కూడా కల్తీ జరిగిందనిపిస్తే కూరగాయలను కొద్దిగా తడి కాటన్‌తో రుద్దాలి. ఆ కాటన్‌కి రంగు అంటితే అవి కల్తీ అయినట్లే. చాలా మంది ఈ మధ్య కాలంలో యాపిల్ పండ్లకి ఇలా రంగులు వేసి అమ్ముతున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకుని కొనాలి. అలాగే మాంసం కలర్‌ఫుల్‌గా షైనీగా ఉంటే కల్తీ జరిగిందని అనుకోవాలి. అవి గట్టిగా లేదా రబ్బరులా ఉంటే మాత్రం వాటిని రసాయనాలతో కలిపి తయారు చేశారని అనుకోవాలి. ఎందుకంటే లాభాల కోసం కోళ్లకు ఇంజెక్షన్లు వేస్తున్నారు. వీటివల్ల మాంసం రుచి మారిపోవడంతో పాటు అనారోగ్య సమస్యల బారిన కూడా పడతారు. ఇవే కాకుండా అరటి పండ్లు, దానిమ్మ ఇలా ఒకటేంటి ప్రతీ వస్తువుల్లో కల్తీ జరుగుతోంది. కాబట్టి ఏ వస్తువులు అయిన కొనే ముందు కాస్త జాగ్రత్తగా చూసుకుని కొనండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోగలరు.