https://oktelugu.com/

New Year Gifts: రొటీన్‌గా కాకుండా యూనిక్‌గా.. ఇలా న్యూ ఇయర్ గిఫ్ట్‌లు ఇవ్వండి

న్యూ ఇయర్ రోజు మనకి ఇష్టమైన వారికి ఏవైనా చిన్న గిఫ్ట్‌లు ఇస్తే వారు సంతోష పడతారు. అయితే రొటీన్‌గా కాకుండా కొత్తగా బహుమతులు ఇవ్వాలి. ఖరీదైన బహుమతులే ఇవ్వాలని కొందరు అనుకుంటారు. కానీ అవే ఇవ్వాలని రూల్ లేదు. మీరు ఇచ్చే గిఫ్ట్‌లో ప్రేమ కనిపించాలి. అంతే కానీ ఖరీదు కనిపించకూడదు. అయితే ఈ న్యూ ఇయర్‌కి ఎలాంటి కొత్త ఐడియాస్‌తో గిఫ్ట్‌లు ఇవ్వాలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 31, 2024 / 09:57 PM IST

    New Year 2025(4)

    Follow us on

    New Year Gifts: అందరూ కూడా ఎంతగానో ఎదురు చూసే న్యూ ఇయర్ ఇంకొన్ని గంటల్లో రాబోతుంది. న్యూ ఇయర్ రోజు ఎంజాయ్ చేయాలని చాలా మంది కోరుకుంటారు. పార్టీలు, డ్యాన్స్‌లు ఇలా ఏదో విధంగా ఆనందంగా జరుపుకుంటారు. అయితే డ్యాన్స్‌లు, పార్టీలు అనేవి ఇప్పటి ట్రెండ్. కానీ ఒకప్పుడు న్యూ ఇయర్ అంటే గ్రీటింగ్ కార్డు, చాక్లెట్లు ఇచ్చుకునేవారు. ఇప్పుడు అలా ఇచ్చుకునే వారు లేరు. ఎవరి ఎంజాయ్‌మెంట్‌లో వారు ఉంటున్నారు. న్యూ ఇయర్ రోజు మనకి ఇష్టమైన వారికి ఏవైనా చిన్న గిఫ్ట్‌లు ఇస్తే వారు సంతోష పడతారు. అయితే రొటీన్‌గా కాకుండా కొత్తగా బహుమతులు ఇవ్వాలి. ఖరీదైన బహుమతులే ఇవ్వాలని కొందరు అనుకుంటారు. కానీ అవే ఇవ్వాలని రూల్ లేదు. మీరు ఇచ్చే గిఫ్ట్‌లో ప్రేమ కనిపించాలి. అంతే కానీ ఖరీదు కనిపించకూడదు. అయితే ఈ న్యూ ఇయర్‌కి ఎలాంటి కొత్త ఐడియాస్‌తో గిఫ్ట్‌లు ఇవ్వాలో చూద్దాం.

    మీకు ఇష్టమైన వ్యక్తులకు గిఫ్ట్‌లు ఇవ్వాలంటే ఫొటోస్‌తో మీరే ఒక ఫ్రేమ్‌ను తయారు చేయండి. యూట్యూబ్‌లో చూసి మీరే స్వయంగా తయారు చేయండి. అప్పుడు మీరు ఇచ్చే గిఫ్ట్‌కి విలువ ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇవన్నీ కూడా లభ్యమవుతాయి. మీరు పర్సన్ బట్టి గిఫ్ట్ ఇవ్వాలి. అమ్మాయిలు అయితే వారికి ఇష్టమైన విధంగా గిఫ్ట్ తయారు చేసి ఇవ్వాలి. అదే అబ్బాయిలు అయితే వారు నచ్చే విధంగా చేయాలి. అబ్బాయిలకు షర్ట్‌లు, కాఫీ మగ్ వంటివి ఇవ్వాలి. అదే అమ్మాయిలకు అయితే రింగులు, మేకప్ సెట్, దుస్తులు వంటివి ఇస్తే వారు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే గృహాలంకరణను సంబంధించినవి ఇవ్వచ్చు. అమ్మాయిలు ఎక్కువగా గదిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఫ్యాషన్‌గా అలంకరించుకోవడానికి ఇష్టపడతారు. మీరు ఇచ్చే గిఫ్ట్ ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలి.

    వీటితో పాటు మంచి పుస్తకాలు ఇవ్వచ్చు. అంటే మీరు ఇచ్చిన పుస్తకం చదివితే వారికి ఉపయోగపడేలా ఉండాలి. ఆ పుస్తకం వల్ల వారి జీవితం మలుపు తిరగాలి. అప్పుడే మీరు ఇచ్చే గిఫ్ట్‌కి ఒక విలువ ఉంటుంది. మీ దగ్గర డబ్బులు ఉంటే మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవ్వచ్చు. అలాగే వారికి ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లడం, ఇష్టమైన పదార్థాలు కొనివ్వడం వంటివి అన్ని కూడా చేయవచ్చు. మీరు ఇచ్చే గిఫ్ట్ కంటే ఇలా వారికి ఇష్టమైనవి చేయడం వల్ల మీ ప్రేమ తెలుస్తుంది. వారికి మీరు ఎంత గౌరవం ఇస్తున్నారో అనే విషయం కూడా వారికి అర్థం అవుతుంది. కాబట్టి మీరు ఇచ్చే గిఫ్ట్‌లు అన్ని కూడా కొనుగోలు చేయకుండా మీరే స్వయంగా చేయాలి. ఇలా చేస్తే ఆ గిఫ్ట్ ఇవ్వడానికి మీరు ఎంత కష్టపడ్డారో.. అందులో మీ ఎఫోర్ట్స్ కనిపిస్తాయి.