Social Media Ban Nepal: నేటి ప్రపంచాన్ని సోషల్ మీడియానే ఊపేస్తోంది. ప్రపంచ గమనాన్ని సోషల్ మీడియా శాసిస్తోంది. ప్రపంచ వ్యాపారాన్ని సోషల్ మీడియానే నడిపిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పీల్చే శ్వాస నుంచి.. రాత్రిపూట నిద్రించే సమయం వరకు ప్రతి దానిని సోషల్ మీడియానే శాసిస్తోంది. సోషల్ మీడియా ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులను ప్రపంచం చవి చూసినప్పటికీ సోషల్ మీడియా ప్రభావం మాత్రం తగ్గదు. అది మరింత పెరుగుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. నేటి కాలంలో సోషల్ మీడియా పై ఆంక్షలు కనుక విధిస్తే అది పెను ప్రభావాన్ని చూపిస్తుంది. అది ఇప్పుడు నేపాల్ దేశానికి అనుభవంలోకి వచ్చింది.
Also Read: పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లో అమెరికా యుద్ధ విమానం.. ఏం జరగబోతోంది!
నేపాల్ దేశంలో సోషల్ మీడియా పై నిషేధాన్ని విధించారు. దీంతో అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్ల మీదికి వచ్చారు. దీంతో ఆందోళనలను చెదరగొట్టడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఫలితంగా అక్కడ 19 మంది చనిపోయారు. 300 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత అక్కడ రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఘటనకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంశాఖ మంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. నేపాల్ ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి రాజీనామా లేఖను ఆయనకు అందించారు.. ముఖ్యంగా నిరసనలో యువత అధికంగా పాల్గొంటున్న నేపథ్యంలో.. అక్కడి ప్రభుత్వం పలు సామాజిక మాధ్యమాలకు సంబంధించిన యాప్స్ పై అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియా పై ప్రభుత్వం అర్థం పర్ధం లేని ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రజల తీవ్ర ఆగ్రహంతో నేపాల్ పార్లమెంటు వద్దకు దూసుకొచ్చారు. ఇలా దూసుకొస్తున్న క్రమంలో భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఫలితంగా పోలీసులు కాల్పులు జరిపారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వేలమంది వీధుల్లోకి రావడంతో నేపాల్ రాజధాని మొత్తం కిక్కిరిసిపోయింది. పోలీసులు కొన్ని ప్రాంతాలను నిషేధిత జోన్లుగా ప్రకటించారు. వాటిని కూడా అక్కడి ప్రజలు లెక్కచేయలేదు. దీంతో ఆందోళనలను అదుపు చేయడానికి పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ఉపయోగించాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో మొత్తం 19 మంది చనిపోయారు. అందులో 12 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం నేపాల్ రాజధాని నగరంలోని బుట్వాన్, బైరహావన్ ప్రాంతాలలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. నిరసనలు, సమావేశాలపై నిషేధం విధించారు.