Bigg Boss 9 Telugu First Day: ‘బిగ్ బాస్ 9’ (Bigg Boss 9 Telugu) మొన్నటి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా ఘనంగా మొదలైంది. నిన్న మొదటి ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ అయ్యింది. మొదటి ఎపిసోడ్ లో ప్రతీ సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా నామినేషన్స్ పెడుతారని అంతా ఊహించారు. కానీ అలాంటిదేమి చెయ్యలేదు. ముందు కంటెస్టెంట్స్ కి ఒకరిని ఒకరు నామినేట్ చేసుకునేందుకు పాయింట్స్ దొరికేలా బిగ్ బాస్ బోలెడన్ని సందర్భాలను క్రియేట్ చేశాడు. ముందు కంటెస్టెంట్స్ దగ్గర నుండి ఆహరం మొత్తం లాగేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, మాస్క్ మ్యాన్ హడావిడి బాగా హైలైట్ అయ్యింది. ఇక ఇమ్మానుయేల్ తనకి ఇచ్చిన హౌస్ క్లీనింగ్ డ్యూటీ ని అద్భుతంగా చేశాడు. ప్రతీ రోజు ఉదయం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ని నిద్ర లేపుతూ బిగ్ బాస్ ఒక పాట వేస్తాడు. కంటెస్టెంట్స్ అందరూ నిద్ర లేచి గార్డెన్ దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేస్తారు.
Also Read: పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లో అమెరికా యుద్ధ విమానం.. ఏం జరగబోతోంది!
ఇది ప్రతీ సీజన్ లో ఉన్నదే. కానీ నిన్న మాత్రం పాట వేసేటప్పుడు బిగ్ బాస్ టీం నుండి కొంతమంది వచ్చి కంటెస్టెంట్స్ తో పాటు డ్యాన్స్ వేసి చమ్కీలను గార్డెన్ వుత్తం చల్లేసి వెళ్ళిపోతారు. బిగ్ బాస్ సాయంత్రం హౌస్ మేట్స్ అందరికీ ఇష్టమైన భోజనం పెట్టి, అది పూర్తి అయ్యాక ఇమ్మానుయేల్ కి గార్డెన్ మొత్తం శుభ్రం చెయ్యాలి, ఎంత సమయం పడుతుంది అని ఇమ్మానుయేల్ ని అడగ్గా, దానికి ఆయన ఫన్నీ గా సమాధానం చెప్తూ, ఒక్క రోజు సమయం పడుతుంది బిగ్ బాస్, ఈ పని చేస్తూ నాకు సిక్స్ ప్యాక్ కూడా వచ్చేయొచ్చు అని అంటాడు. ఎంత సమయం పడుతుందో మీ మానిటర్(మాస్క్ మ్యాన్) ని అడిగి చెప్పండి అని బిగ్ బాస్ అడుగుతాడు. ఆ సమయం లో మాస్క్ మ్యాన్ మరియు ఇమ్మానుయేల్ కి ఒక ఫన్నీ సంభాషణ జరుగుతుంది.
అప్పుడు మాస్క్ మ్యాన్ ని ఇమ్మానుయేల్ ‘గుండు అంకుల్’ అని పిలుస్తాడు. ఆ సమయం లో మాస్క్ మ్యాన్ కూడా సరదాగానే తీసుకుంటాడు, నవ్వుతాడు కూడా. అంతా బాగానే ఉంది అని అనుకుంటున్న సమయం లో ఇమ్మానుయేల్ ‘కాస్త చూసుకొని చెప్పు బ్రదర్'(మానిటరింగ్ టైం గురించి) అని అడగ్గా, దానికి మాస్క్ మ్యాన్ మీరు కూడా చూసుకొని మాట్లాడాలి బ్రదర్, ఎవరు గుండు, ఎవరు అంకుల్?, అని అంటాడు. నేను అలా అన్నందుకు మీ దగ్గరకు వచ్చి, మిమ్మల్ని పట్టుకొని మరీ క్షమాపణలు చెప్పాను, అప్పుడు మీరు తీసుకున్నారు, ఇప్పుడెందుకు అరుస్తున్నారు? అని అడగ్గా, అప్పుడు నాకు స్ట్రైక్ అవ్వలేదు, ఇప్పుడు స్ట్రైక్ అయ్యింది, మీ కోసం నేను మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు, అలాంటి నన్ను వెక్కిరిస్తారా అంటూ మాస్క్ మ్యాన్ దీనిని సాగదీస్తూ చేసిన ఓవర్ యాక్షన్ మామూలుది కాదు. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా అంత అతి చేయడం మంచిది కాదు, మాస్క్ మ్యాన్ ఏది చేసిన కెమెరా కోసమే చేస్తున్నట్టుగా అనిపించింది. మరోపక్క ఇమ్మానుయేల్ రోజంతా గొడ్డు చాకిరి చేసి,మరో పక్క ఫన్ ని అందిస్తూ, ఆ ఫన్ ని తీసుకోలేకపోయింది మాస్క్ మ్యాన్ వంటి వారికి పదే పదే క్షాపణలు చెప్తూ హీరో ఆఫ్ ది ఎపిసోడ్ గా నిలిచాడు.