https://oktelugu.com/

NeoCov Virus: వెలుగులోకి మరో కొత్త వైరస్.. డేంజర్ బెల్స్..!

NeoCov Virus: కరోనా మహమ్మరి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోక ముందే మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ కరోనా కంటే ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఈ వైరస్ సోకిన ప్రతీ ముగ్గురిలో ఒకరు మృత్యువాత పడటం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ వైరస్ పేరు చెబితేనే జనం వణికిపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కొనసాగుతున్న సమయంలోనే దక్షిణాఫ్రికాలో ‘నియో కోవ్‌’ అనే కొత్త రకం వైరస్‌ వెలుగులోకి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 28, 2022 / 02:29 PM IST
    Follow us on

    NeoCov Virus: కరోనా మహమ్మరి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోక ముందే మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ కరోనా కంటే ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఈ వైరస్ సోకిన ప్రతీ ముగ్గురిలో ఒకరు మృత్యువాత పడటం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ వైరస్ పేరు చెబితేనే జనం వణికిపోతున్నారు.

    NeoCov Virus

    కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కొనసాగుతున్న సమయంలోనే దక్షిణాఫ్రికాలో ‘నియో కోవ్‌’ అనే కొత్త రకం వైరస్‌ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతోపాటు మరణాల రేటు కూడా అధికంగానే ఉండే అవకాశముందని, ఈ వైరస్ ప్రపంచాన్ని వెంటాడేనే సూచనలు కనిపిస్తున్నాయని వ్యూహాన్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

    ఈ నియో కోవ్ వైరస్‌ను దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలోని గబ్బిలాల్లో గుర్తించారు. ఇది కూడా కరోనా రకానికి చెందిన వైరస్సేనని, దీనిపై చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు జరపగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్‌ ఓ కథనంలో పేర్కొంది.

    నియో కోవ్ ప్రస్తుతం జంతువుల నుంచి జంతువులకు మాత్రమే సోకుంతుందని పేర్కొంది. అయితే ఇది ఎలా రూపాంతరం చెందుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త వైరస్ పై వెక్టార్‌ వైరస్‌ స్టేట్‌ రీసర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ వైరాలజీ అండ్‌ బయోటెక్నాలజీ నిపుణులు తాాజాగా స్పందించారు.

    ‘నియో కోవ్‌’పై చైనీస్‌ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయన ఫలితాలు తమకు తెలుసని చెప్పారు. ప్రస్తుతం ఇది జంతువుల్లో మాత్రమే సోకుతుందన్నారు. అయితే ఇప్పుడే ఓ అంచనాకు రాలేమంటూ రష్యా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాగా ఇందులోని ఓ మ్యుటేషన్‌ అయిన నియో కోవ్ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వుహాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.

    ‘నియో కోవ్‌’ వైరస్‌కు గబ్బిలాల్లోని యాంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ ప్రభావవంతగా ఉంటుందని చెబుతున్నారు. ఇది మనుషుల్లోని ACE2ను ఏమార్చి శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం ఉందని సైంటిస్టులు గుర్తించారు. ఈ వైరస్ పై యాంటీబాడీలు, కొవిడ్‌ 19 వ్యాక్సిన్లు పని చేయకపోవచ్చని అంటున్నారు. ఈ వైరస్‌ ఒకవేళ మనుషులకు సోకితే ప్రతీ ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం తప్పదని హెచ్చరిస్తుండటం ఆందోళనను రేపుతోంది.

    Tags