Prabhas: నేషనల్ స్టార్ ప్రభాస్ మొదటిసారిగా శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే, ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రాబోతున్న ‘ఆదిపురుష్’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీ ఒకేసారి ఏకంగా 20,000 స్క్రీన్లలో రిలీజ్ కానుందట. దాదాపు రూ.400కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించాడు. సీత పాత్రలో కృతిసనన్, లంకేశుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు.

కాగా.. ఇది పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ సినిమా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పైగా ప్రభాస్ ‘ఆది పురుష్’ కోసం ఇండియాలో తొలిసారి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఈ సినిమాలో భారీ సెట్లు, భారీ క్రూ వగైరా వ్యవహారాలు లాంటివి లేకుండా మోషన్ కాప్చర్ విధానంలో నటీనటుల కదలికలు, హావభావాలు రికార్డుచేసి, వాటికి సాంకేతికత సాయంతో మిగిలిన హంగులను జోడిస్తారట.
Also Read: బ్యాడ్ లక్.. జగన్ నిర్ణయం రోజాకు మైనస్ కానుందా?
దీనివల్ల సినిమా చూడడానికి బాగా ఆసక్తికరంగా వుంటుందని, పైగా చాలా సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నారు మేకర్స్. ఏది ఏమైనా హాలీవుడ్ సినిమాల్లో ఇప్పటికే ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీని ఇండియన్ సినిమాలో పూర్తిగా వాడుకోవడం అంటే.. బహుశా ఇదే తొలిసారి అనుకుంటా. తన మార్కెట్ కి తగ్గట్లుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటూ ప్రభాస్ ముందుకు పోతున్నాడు.

అన్నట్టు నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ డైరెక్టర్ ‘ప్రశాంత్ నీల్’ దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా సినిమా “సలార్” సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.
[…] Also Read: ప్రభాస్ సినిమా పాన్ ఇండియా కాదు.. పాన్… […]