Homeజాతీయ వార్తలుTelangana BJP Leaders: తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలివే..!

Telangana BJP Leaders: తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలివే..!

Telangana BJP Leaders: బీజేపీ తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్నదని పార్టీ కార్యచరణ, జోష్ చూస్తే అర్థమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ స్థానానికి పరిమితమైన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు లోకసభ స్థానాలు గెలిచింది. ఇక ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడి మార్పుతో పార్టీలో మరింత నూతన ఉత్తేజం వచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణలో రాజకీయ అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

Telangana BJP Leaders
Telangana BJP Leaders

వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే విషయమై బీజేపీ నేతలు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందరూ ఎంపీ ధర్మపురి అర్వింద్ తాను.. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అలా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ధర్మపురి అర్వింద్ కు మధ్య టఫ్ పోటీ ఉండబోతున్నది. అలా తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే స్థానాన్ని ఎంపీ అర్వింద్ బహిరంగంగానే ప్రకటిచారు. ఆర్మూర్ నియోజకవర్గంలో తన కాన్వాయ్ పైన టీఆర్ఎస్ నేతల దాడి నేపథ్యంలో అర్వింద్ ఈ ప్రకటన చేశారు.

Also Read: Land Price In Telangana: తెలంగాణ‌లో భూముల ధరలకు రెక్కలు.. రిజిస్ట్రేషన్ కోసం పోటీ..!

ఇకపోతే ధర్మపురి అర్వింద్ మాదిరిగానే తెలంగాణ బీజేపీలోని ముఖ్య నేతలు ఇప్పటి నుంచే అసెంబ్లీ స్థానాలపైన ఫోకస్ పెడుతున్నారని సమాచారం. బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గతంలో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిపాయారు. డిపాజిట్ కూడా కోల్పోయారు. కానీ, పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా గెలుపొందడమే కాదు. ఆ తర్వాత కాలంలో ఏకంగా ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవడా అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్.

ఇకపోతే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్ రెడ్డి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆసిఫాబాద్ స్థానం నుంచి బరిలో ఉంటారని టాక్. ఇకపోతే వీరితో పాటు బీజేపీ తెలంగాణ ముఖ్య నాయకులు అందరూ ఇప్పటి నుంచే అసెంబ్లీ స్థానం ఎంచుకుని గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: బీజేపీపై దాడులు.. ఈ చిన్న లాజిక్ ను టీఆర్ఎస్ ఎందుకు మిస్ అవుతోంది?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version