China Myanmar Conflict: తన అవసరాలు తీరాక చైనా వదిలేస్తుంది.. మయన్మార్ ఓ ఉదాహరణ

ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోల్చి, ఆమెను, ప్రభుత్వంలోని అధికారులను జైలుకు పంపించిన తర్వాత.. అక్కడి సైన్యానికి చైనా మద్దతు పలికింది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 2, 2023 12:20 pm

China Myanmar Conflict

Follow us on

China Myanmar Conflict: అందితే జుట్టు. లేకుంటే కాళ్లు. చైనా మొదటి నుంచి అనుసరిస్తున్న వ్యూహం ఇదే. అందుకే ఆ దేశంతో ఇతర దేశాలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాయి. కేవలం వ్యాపారం కోణంలో మాత్రమే దానితో స్నేహాన్ని కొనసాగిస్తుంటాయి. చైనాలో ఉన్నది కమ్యూనిస్టు పార్టీ కాబట్టి.. కేవలం పెట్టుబడి, వచ్చిన లాభం అనే కోణంలో మాత్రమే పని చేస్తూ ఉంటుంది కాబట్టి.. తన పొరుగు దేశాలను గోకుతూ ఉంటుంది.. ఓ శ్రీలంక, పాకిస్తాన్, టిబెట్, భారత్, భూటాన్, నేపాల్.. ఇలా దాని బాధిత దేశాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో మయన్మార్ చేరింది. చైనా చేసిన అవసరార్థ రాజకీయం వల్ల ఆ దేశం ఇప్పుడు అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.

తిరుగుబాటు మొదలైంది

ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోల్చి, ఆమెను, ప్రభుత్వంలోని అధికారులను జైలుకు పంపించిన తర్వాత.. అక్కడి సైన్యానికి చైనా మద్దతు పలికింది. ఎలాగూ సరిహద్దు దేశం కాబట్టి తన అవసరాలు చూసుకున్నాకా ఆర్థిక సహాయం చేయడం మొదలుపెట్టింది. ఇక చైనా అండ చూసుకొని మయన్మార్ సైన్యం కూడా రెచ్చిపోవడం ప్రారంభించింది. పాలన పేరుతో అనేక రకాల అకృత్యాలకు పాల్పడడం మొదలుపెట్టింది. దీంతో సహజంగానే అక్కడి సైనిక ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం ఏర్పడింది. అయితే కోవిడ్ తర్వాత చైనా ఆర్థిక పరిస్థితి అంతకంతకూ పతనమవుతుండడంతో మయన్మార్ విషయంలో పొదుపు చర్యలు ప్రారంభించడం మొదలుపెట్టింది. ప్రతి ఏటా తాను మంజూరు చేస్తున్న ఆర్థిక సహాయం లో కోతలు విధించడం షురూ చేసింది. ప్రస్తుతానికైతే ఆ సహాయం కూడా పూర్తిగా నిలిపివేసింది. దీంతో మయన్మార్ దేశంలో సంక్షోభం ప్రారంభమైంది. ప్రజలు సైనికాధికారులపై తిరుగుబాటు ప్రారంభించారు.

నాలుగు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు

తిరుగుబాటుదారులు దేశంలోని నాలుగు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. సైన్యం మాదకద్రవ్యాలు అమ్మి సొమ్ము చేసుకుంటుండడంతో ఇది సహజంగానే ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. తిరుగుబాటుదారులు ప్రజలలో ఉన్న ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని సైన్యం పైకి పంపించడంలో సఫలీకృతులయ్యారు. చైనా ఇస్తున్న డబ్బులు ఆగిపోవడంతో సహజంగానే సైన్యానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తడం మొదలైంది. ఆయుధ సామాగ్రి కూడా సరిగా లేకపోవడంతో తిరుగుబాటుదారులకు తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే తిరుగుబాటుదారులు నాలుగు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. త్వరలో దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని వారు చెబుతున్నారు. మరోవైపు ఆర్థిక సహాయం గురించి మయన్మార్ సైనిక ప్రభుత్వం చైనా దేశాన్ని పలుమార్లు సంప్రదించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే అప్పట్లో టిబెట్ దేశంతో జరిగిన గొడవ నేపథ్యంలో మయన్మార్ అండ చైనాకు కావాల్సి వచ్చింది. పైగా సరిహద్దు దేశం కావడంతో తన సైనిక పటాలాలు ఉండేందుకు అనువుగా మయన్మార్ ప్రాంతాన్ని మలుచుకుంది.. ఆ తర్వాత డిబేట్ తన ఆధీనంలోకి రావడంతో మయన్మార్ దేశం తో సంబంధాలను మెల్లిమెల్లిగా తగ్గించుకోవడం మొదలుపెట్టింది. తన ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రం గానే ఉండడంతో మాయన్మార్ ను పూర్తిగా దూరం పెట్టింది. చైనా వాడుకుని వదిలేయడంతో మయన్మార్లో అంతర్గత సంక్షోభం ముదిరి తారస్థాయికి చేరింది. ప్రస్తుతం ఆ దేశంలో తిరుగుబాటుదారులు సైన్యం మధ్య గొడవలు జరుగుతున్నాయి.