Instaram Reels : ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చాక.. ఇంటర్నెట్ చౌకగా మారిత తర్వాత ఫోన్ వినియోగం ఒక వ్యసనంగా మారింది. ఉదయం నిద్రలేచింది. మొదలు.. రాత్రి బెడ్‌పై నిద్ర పోయే వరకూ ఫోన్ లేండా ఉండలేని పరిస్థితి నెలకొంది. కొందరైతే ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయామని భావిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏడాది పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ ఫోన్‌కు ఎడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా రోజులో 10 నుంచి 12 గంటలు సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. ఇక పిల్లలకు అయితే గతంలో చందమామను, రోడ్డుపై తిరిగే వాహనాలు, పక్షులు, జంతువులను చూపించి ఆన్నం తినిపించే వారు. నేడు ఫోన్ ఇచ్చేసి వీడియోలు చూస్తూ అన్నం తినండి అని ప్రోత్సహిస్తున్నారు. దీంతో కొన్ని రోజులకు ఫోన్ లేకుండా అన్నం తినమని పిల్లలు మారాం చేస్తున్నారు. ఫోన్ అడిక్షన్ చాలా ప్రమాదకరమని వైద్యులు, ఆరోగ్య నిపుణులు, మానిసిక నిపులణులు చెబుతున్నా.. ఫోన్ నియంత్రణ మాత్రం జరగడం లేదు. ఇక యూత్, మహిళలు, గృహిణులుతోపాటు వివిధ వృత్తుల్లో ఉన్నవారు రీల్స్ అప్‌లోడ్ చేస్తున్నారు. గతంలో ఓ ఆస్పత్రిలో నర్సులు రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి పట్టుపడ్డారు. మున్సిపల్ ఆఫీస్‌లో కూడా ఉద్యోగులు రీల్స్ చేస్తూ దొరికిపోయారు. అంటే రీల్స్ పిచ్చి ఎంత పీక్స్ వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
బిజినెస్ పెంచుకోవడానికి..
సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ఇటీవల చాలా మంది వ్యాపారులు తమ వ్యాపారం గురించి కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఖర్చు లేకుండా ప్రకటనలు పోస్టు చేస్తున్నారు. ఇందుకోసం కూడా రీల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ట్యాబ్స్, ఫోన్స్, కంప్యూటర్స్, బట్టల షాపుల వాళ్లు ఎక్కువగా సోషల మీడియాలో తమ వ్యాపారం గురించి రీల్స్ చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక కొందరు సోషల్ మీడియా ఇన్లూ్ఫయెన్సర్లను ఉపయోగించుకుని ప్రచారం చేసుకుంటున్నారు. టీవీలో, పేపర్లలో ప్రకటనలు ఇచ్చినదానికన్నా ఎక్కువగా ప్రచారం జరుగుతుండడంతో చాలా మంది సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు.
తల్లిదండ్రులకు కన్నీళ్లు..
ఇక యువత రీల్స్‌మోజులో పడి తల్లిదండ్రులకు కనీళ్లు మిగులుస్తున్నారు. కొందరు కుంటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. మరికొందరు ఎక్కడ రీల్స్ చేస్తున్నాం.. ఎలా చేస్తున్నాం అని ఆలోచించకుండా లైక్స్ వస్తే చాలు.. వైరల్ అయితే చాలు అన్నట్లుగా సాహజాలు చేస్తున్నారు. ఫాలోవర్లు పెరిగితే డబ్బు సంపాదించొచ్చని, రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చని భావిస్తున్నారు. ఇలా కారణం ఏదైనా సోషల్ మీడియా మోజులో చేస్తున్న రీల్స్ కొత్త నేరాలకు, దుష్పరిణామాలకు దారితీస్తున్నాయి. తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి.
ఇదీ ఒక వ్యసనమే..
మద్యం, గ్యాంబ్లింగ్ తరహాలో సోషల్ మీడియా ఫాలోఅవడం, రీల్స్ చేయడం ఊడా ఒక వ్యసనమే అంటున్నారు మానసిక నిపుణులు. నిరంతరం ఏదో ఒక రూపంలో అందరిలో ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో ఇది వ్యసనంగా మారుతోందని పేర్కొంటున్నారు. లైక్‌లు, షేర్లు, వైరల్ మోజులో పడి తాము ఏం చేస్తున్నాం.. ఎలా చేస్తున్నాం.. ఎంత ప్రమాదకరంగా చేస్తున్నాం.. అన్న విషయాలు కూడా మర్చిపోతున్నారని పేర్కొంటున్నారు. కొందరైతే ఆయుధాలు పట్టుకుని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటే కొందు అశ్లీతను ప్రోత్సహిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా అసాంఘిక కార్యకలాపాలకూ వేదికవుతోంది.
15 నుంచి 25 ఏళ్ల లోపువారే..
ఇక సోషల్ మీడియాలో అన్ని వయసులవారు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నప్పటికీ చాలా మంది ఎక్కువగా రీల్స్ చేస్తున్నవారిలో 15 నుంచి 25 ఏళ్లలోపువారే ఎక్కువగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. బైకులపై స్టంట్లు, రైలు వెనక నుంచి ఫీట్లు, కొండలు, గుట్టలు, నదులు, వాటర్ ఫాల్స్‌పై రీల్స్ చేస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఇక మహిళలు చేస్తున్న రీల్స్ కాపురాలను కూలుస్తున్నాయి. యువతులు చేస్తున్న రీల్స్ సోషల్ మీడియాలో వేధింపులకు కారణమవుతున్నాయి. దంపతులను విడదీస్తున్నాయి. కాపురాలు కూలుస్తున్నాయి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Many young people are dying while making instagram reels in india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com