Hyundai Creta Facelift : 6 నెలల్లోనే లక్ష కార్లు అమ్ముడుపోయాయి.. ఏం క్రేజ్ అండీ బాబు.. ఇంతకీ ఈ కారుకు ఎందుకంత డిమాండ్ అంటే?

మార్కట్లో వినియోదారులు కోరుకుంటున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిప్ట్ అదిరిపోయాయని అంటున్నారు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. 160 బీహెచ్ పీ పవర్ తో, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 116 బీహెచ్ పీ పవర్ , 1. 5 లీటర్ డీజిల్ ఇంజిన్ అనే మూడు ఇంజిన్లు ఉన్నాయి. ఇందులో ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి.

Written By: Srinivas, Updated On : July 27, 2024 5:18 pm
Follow us on

Hyundai Creta Facelift :  దేశంలోని కార్ల ఉత్పత్తిలో హ్యుందాయ్ కంపెనీ టాప్ టెన్ లిస్టులో నిలుస్తోంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎన్నో మోడళ్లు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే గత ఏడాది నుంచి హ్యుందాయ్ నుంచి రిలీజ్ అయిన కొన్ని మోడళ్లు ఊహించని రీతిలో అమ్మకాలు జరుపుకుంటున్నాయి. వీటిలో ఎక్స్ టర్ తో పాటు క్రెటా ఉన్నాయి. క్రెటా పేరుతో వచ్చిన మోడల్ బాగా ఆదరణ పొందడంతో దీనిని ఫేస్ లిప్ట్ గా మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే ఇది మార్కెట్లోకి వచ్చిన ఆరు నెలల్లో లక్ష అమ్మకాలు జరుపుకుంది. దీంతో ఆటోమోబైల్ రంగంలోనే ఇది బెస్ట్ కారుగా నిలుస్తోంది. SUV వేరియంట్ లో రిలీజ్ అయిన క్రెటా ఫేస్ మిగతా కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన నివేదికల ప్రకారం రోజుకు 5500 యూనిట్లు అమ్ముడుపోతున్నాయి. హ్యుందాయ్ నుంచి ఇప్పటి వరకు హ్యాచ్ బ్యాక్ తో పాటు వివిధ వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఈ జనవరిలో రిలీజ్ అయిన క్రెటా ఫేస్ లిప్ట్ నెంబర్ వన్ గా నిలుస్తోంది. క్రెటా ఫేస్ లిప్ట్ అమ్మకాలు జోరందుకోవానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు కారు ధర హైలెట్ గా నిలుస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ఎస్ యూవీలను మించిపోయింది. దీంతో ఎస్ యూవీ కావాలనుకునేవారు క్రెటా ఫేస్ లిప్ట్ ను బుక్ చేసుకుంటున్నారు.

మార్కట్లో వినియోదారులు కోరుకుంటున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిప్ట్ అదిరిపోయాయని అంటున్నారు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. 160 బీహెచ్ పీ పవర్ తో, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 116 బీహెచ్ పీ పవర్ , 1. 5 లీటర్ డీజిల్ ఇంజిన్ అనే మూడు ఇంజిన్లు ఉన్నాయి. ఇందులో ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎల్ ఈడీ , డీఆర్ఎల్ కనెక్ట్ చేయబడిన కొత్త బంపర్ , గ్రిల్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంటీరియర్ లో 10.25 అంగుళాల స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయెల్ జోన్ ఉన్నాయి. ఇవే కాకుండా క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్ లెస్ ఛార్జింగ్ ఉన్నాయి. సేప్టీ వియంలో క్రెటా ఫేస్ లిప్ట్ బెస్ట్ అనిపించుకుంటోంది. ఇందులో రక్షణ కోసం 6 ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీ రియర్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లెవల్ 2 ఏడీఎస్ ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎక్కువగా కోరుకుంటున్న పనోరమిక్ సన్ రూఫ్ ఇందులో ఆకర్షిస్తుంది.

ఈ కారు ఎక్కువగా సేల్స్ కావడంలో ధర కూడా ఆకర్షిస్తోంది. సాధారణంగా ఎస్ యూవీ కారు రూ.14 లక్షలకు పైగా ఉంటుంది. కానీ క్రెటా పేస్ లిప్ట్ రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ ను రూ.20.15 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే కేవలం ఆరు నెలల్లో లక్ష యూనిట్లు అమ్మకాలు జరుపిన ఈ కారు వచ్చే ఆరు నెలల్లో మరెన్ని అమ్మకాలు జరుపుకుంటుందోనని అంటున్నారు. మిగతా కార్ల కంటే ఇది ధర తక్కువగా ఉండడంతో ఈ కారుపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడున్న మారుతి, టాటాలకు చెందిన ఎస్ యూవీలకు హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిప్ట్ గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. ఒకవేళ ఇదే ఊపుతో సేల్స్ ఉంటే మాత్రం క్రెటా ఫేస్ లిప్ట్ రికార్డు సృష్టించినట్లేనని అనవచ్చు.