Bigg Boss Telugu8 : బిగ్ బాస్ సీజన్ 8 మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ సరికొత్త సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అందుకే ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలో లేని విధంగా ముగ్గురు టాప్ హీరోయిన్స్ ని రంగంలోకి దించనున్నారట.
ఓ ముగ్గురు హీరోయిన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నారని టాక్. ఇప్పటికే కొందరు క్రేజీ సెలెబ్రెటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు మరో ముగ్గురు ప్రముఖ నటీమణుల పేర్లు బయటకు వచ్చాయి. వారెవరంటే … బ్లాక్ బస్టర్ మూవీ ‘ నువ్వే కావాలి ‘ ఫేమ్ రిచా ఒకరు అట. అలాగే ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ గా ఉన్న సింహాద్రి హీరోయిన్ అంకిత మరొకరు అట. అలాగే పరుగు మూవీ ఫేమ్ పూనమ్ బజ్వా సైతం ఎనిమిదవ సీజన్ లో కనిపించే అవకాశం ఉందట.
రిచా, కొన్నాళ్ళు టాలీవుడ్ లో సత్తా చాటారు. వరుస ఆఫర్స్ అందుకున్నారు. అయితే వీరికి మంచి ఆఫర్స్ దక్కినా లాంగ్ టర్మ్ కెరీర్ కొనసాగించలేకపోయారు. పూనమ్ బజ్వా పరుగు చిత్రంలో ప్రకాష్ రాజ్ కూతురు పాత్ర చేసింది. పరుగు విజయం సాధించినా.. పూనమ్ బజ్వా సెకండ్ హీరోయిన్ కావడంతో ఫేమ్ దక్కలేదు. ఈ మధ్య పూనమ్ బజ్వా గ్లామరస్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. గ్లామర్ డాల్ గా అవతరించింది. పూనమ్, అంకిత, రిచా బిగ్ బాస్ సీజన్ 8కి ప్రత్యేక ఆకర్షణగా కావడం ఖాయం అంటున్నారు.
అలాగే గర్ల్ ఫ్రెండ్, సిక్స్టీన్, సొంతం వంటి హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన రోహిత్ కూడా వచ్చే ఛాన్స్ ఉందట. యంగ్ హీరోగా ఒక మోస్తరు ఫేమ్ తెచ్చుకున్న రోహిత్ మెల్లగా ఫేమ్ కోల్పోయాడు. ఆయన సిల్వర్ స్క్రీన్ పై కనిపించి కొంత కాలం అవుతుంది. ఈయన కంటెస్టెంట్ గా వచ్చేందుకు పచ్చజెండా ఊపారట.
ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అడుగడుగునా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో షో సూపర్ హిట్ అయ్యేలా చేశారు. సీజన్ 6 అతి తక్కువ గణాంకాలను నమోదు చేయడంతో సీజన్ 7 పై శ్రద్ధ వహించారు. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ అంటూ షో ని రక్తి కట్టించారు. ఈసారి కూడా ఓ సరికొత్త పంథా తో సీజన్ 8 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.
కంటెస్టెంట్స్ ని రెండు టీములు గా విభజించి కొంతమందిని ఒక చోట మరి కొంతమందిని మరో చోట ఉంచి టాస్కులు నిర్వహిస్తారట. తమ స్నేహితులు అవతలి టీం లో ఉన్నట్లయితే టాస్క్ లు గెలిచి వారిని స్వాప్ చేసుకోవచ్చట. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎంటర్టైన్మెంట్ డబల్ చేయనున్నారట. ఇక ఈ ఎనిమిదవ సీజన్ సెప్టెంబర్ 8 నుంచి స్టార్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
Web Title: These three tollywood star heroines contesting in bigg boss telugu 8
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com