Munir US Visit: శత్రువులో పోరాడాలంటే.. గట్స్ ఉండాలి.. ఓడించగలనన్మ నమ్మకం ఉండాలి. తెలివి, బుద్ధిబలం కూడా ముఖ్యం. కానీ శరీరాకృతి పెద్దగా ఉందని ఎగిరి పడితే.. వాపు చూసుకుని బలుపని భ్రమ పడితే మిడిసి పడితే ఎదురు దెబ్బ తప్పదు. భారత్ విషయంలో శత్రువు పాకిస్తానైనా.. అమెరికా అయినా.. చైనా అయినా ఒక్కటే. భారత్ ఒంటరిగానే పోరాడుతుంది. కానీ, మన దాయాని పాకిస్తాన్ మాత్రం అమెరికా అండ చూసుకుని ఎగిరెగిరి పడుతోంది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇటీవల అమెరికాలో చేసిన వ్యాఖ్యలు భారత్–పాక్ సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతలను రేకెత్తించాయి. సింధూ నదిపై భారత్ డ్యామ్ నిర్మిస్తే దానిని మిస్సైళ్లతో ధ్వంసం చేస్తామన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
Also Read: డ్రోన్ బెటాలియన్.. భారత ఆర్మీ మరింత పవర్‌ఫుల్!
సింధూ నది ఒప్పందం ఇదీ..
సింధూ నది నీటి ఒప్పందం 1960లో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒక కీలక ఒప్పందం. దీనిని ప్రపంచ బ్యాంక్ సమన్వయం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం, సింధూ నది వ్యవస్థలోని ఆరు నదుల నీటిని రెండు దేశాల మధ్య పంచుకుంటారు. భారత్‌కు బియాస్, రవి, సట్లెజ్ నదులు, పాకిస్తాన్‌కు సింధూ, జీలం, చినాబ్ నదులపై నియంత్రణ ఉంటుంది. అయితే, భారత్ పహల్గాం ఉద్రదాడి తర్వాత సిందూ ఒప్పందాన్ని పక్కన పెట్టింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టులు చేపట్టింది. డ్యామ్‌లు నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో మునీర్ భారత్ డ్యామ్‌ల నిర్మాణం ద్వారా పాకిస్తాన్ నీటి వాటాను తగ్గిస్తుందని ఆరోపించారు.
ఆసిమ్ మునీర్ హెచ్చరికలు..
మునీర్ వ్యాఖ్యలు రెండు కోణాల్లో చూడవచ్చు. మొదటిది, ఇవి పాకిస్తాన్ దేశీయ రాజకీయాల కోసం చేసిన ప్రకటనలు కావచ్చు. పాకిస్తాన్‌లో సైన్యం రాజకీయంగా బలమైన స్థానంలో ఉంది, భారత్‌పై బెదిరింపులు జాతీయవాద భావనలను రేకెత్తించడానికి ఉపయోగపడతాయి. రెండోది ఇవి సైనిక శక్తిని ప్రదర్శించే ప్రయత్నంగా ఉండవచ్చు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మళ్లీ అణ్వాయుధ సామర్థ్యం గురించి ప్రస్తావించడం ఇందులో భాగంగానే కనిపిస్తోంది. అయితే, ఈ బెదిరింపులు అమలు చేయడం అంత సులభం కాదు. అణ్వాయుధాలు యుద్ధ నిరోధకాలుగా పనిచేస్తాయి, కానీ వాటిని ఉపయోగించడం అంతర్జాతీయంగా తీవ్ర పరిణామాలను తెచ్చిపెడుతుంది. మునీర్ వ్యాఖ్యలు భారత్‌తో సంబంధాలను మరింత దిగజార్చే రాజకీయ ఎత్తుగడగా ఉంది. కానీ ఇవి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కూడా పనిచేయవచ్చు.
Also Read: అత్యంత ఎత్తులో కాశ్మీర్ లో ఎయిర్ ఫీల్డ్.. ఇక చైనాకు దబిడ దిబిడే..
స్పందించని భారత్..
మునీర్ వ్యాఖ్యలపై భారత్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు, కానీ భారత్ దౌత్యపరమైన దృఢత్వంతో స్పందించాల్సిన అవసరం ఉంది. సింధూ నది ఒప్పందం ప్రకారం భారత్ తన వాటాకు సంబంధించిన హక్కులను ఉపయోగించుకుంటోంది. జమ్మూ కాశ్మీర్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టులు ఈ ఒప్పందం నిబంధనలకు లోబడే ఉన్నాయి. భారత్ ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజంలో స్పష్టం చేయాలి. పాకిస్తాన్ బెదిరింపులను దౌత్యపరంగా ఎదుర్కోవాలి. భారత్‌లోని కొందరు నిపుణులు మునీర్ వ్యాఖ్యలను ‘దిగజారిన దేశం నుంచి వచ్చిన బెదిరింపులు‘గా అభివర్ణించారు, కానీ ఈ ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చవచ్చు. భారత్ తన జలవిద్యుత్ ప్రాజెక్టులను కొనసాగిస్తూనే, అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ బెదిరింపులను ఖండించేలా చర్యలు తీసుకోవాలి. అయితే మునీర్ వ్యాఖ్యలపై సగటు భారతీయులు మండిపడుతున్నారు. మన భూభాగంలో మన జలాలను మనం వినియోగించుకుంటే పాకిస్తాన్‌కు నోప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని, హోల్డ్‌లో మాత్రమే ఉందని పాకిస్తాన్‌కు గుర్తు చేస్తున్నారు.