Drone Battalion: భారత సైనిక శక్తి ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచ దేశాలకు అర్థమైంది. 1969, 1972లో జరిగిన యుద్ధాల సమయంలోనూ భారత సైన్యం సత్తాచాటింది. 1972 పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించడంతపాటు బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం వచ్చేలా చేసింది. ఇక తాజా ఆపరేషన్ సిందూర్.. మన సైని శక్తిని ప్రపంచంలో మేటిగా నిలిపింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైన్యం భవిష్యత్ యుద్ధ అవసరాలను దృష్టిలో ఉంచుకొని డ్రోన్ బెటాలియన్‌లను ఏర్పాటు చేయడం ద్వారా తన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఈ చర్య ఆధునిక యుద్ధ వ్యూహాలలో డ్రోన్‌ల ప్రాముఖ్యతను సూచిస్తుంది.
Also Read: అత్యంత ఎత్తులో కాశ్మీర్ లో ఎయిర్ ఫీల్డ్.. ఇక చైనాకు దబిడ దిబిడే..
డ్రోన్ బెటాలియన్‌ల ఏర్పాటు..
భారత సైన్యం తన ఆర్టిలరీ, ఇన్‌ఫాంట్రీ, ఆర్మర్డ్ డివిజన్‌లలో డ్రోన్ యూనిట్‌లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ యూనిట్‌లు పూర్తిగా డ్రోన్ కార్యకలాపాల కోసం అంకితం చేయబడతాయి, ఇవి నిఘా, దాడి, లాజిస్టిక్ సపోర్ట్‌ను అందిస్తాయి. ‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 30 లైట్ కమాండో బెటాలియన్‌లతో కూడిన రుద్రా బ్రిగేడ్‌ను ప్రకటించారు, ఇందులో డ్రోన్‌లు ముఖ్యమైన భాగంగా ఉంటాయి. ఈ బ్రిగేడ్‌లో 25–100 మంది సాంకేతిక నిపుణులు డ్రోన్ ఆపరేషన్‌లను నిర్వహిస్తారు.
నిఘా నుంచి దాడి వరకు..
డ్రోన్‌లు ఆధునిక యుద్ధంలో గేమ్–ఛేంజర్‌గా మారాయి. భారత సైన్యం రెండు రకాల డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. శత్రు స్థానాలను గుర్తించి, రహస్య సమాచారాన్ని సేకరిస్తాయి. ఇవి లక్ష్యాలను గుర్తించి, దాడి డ్రోన్‌లకు సమాచారం అందిస్తాయి. ఒకే డ్రోన్ లేదా సమూహంగా లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేస్తాయి. ఇవి ట్యాంకుల వంటి ఖరీదైన యుద్ధ పరికరాలను చవకగా ధ్వంసం చేయగలవు.
డ్రోన్‌ల ఆర్థిక ప్రయోజనం..
రక్షణ విశ్లేషకుడు రాహుల్ బేదీ ప్రకారం, డ్రోన్‌లు ఇతర యుద్ధ పరికరాలతో పోలిస్తే చవకగా లభిస్తాయి, కానీ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయి. వందల కోట్ల విలువైన ట్యాంకులను కొన్ని లక్షల రూపాయల విలువైన డ్రోన్‌లతో ధ్వంసం చేయవచ్చు. యుక్రెయిన్–రష్యా, అజర్‌బైజాన్, మధ్యప్రాచ్య యుద్ధాలలో డ్రోన్‌లు తమ సామర్థ్యాన్ని నిరూపించాయి, ఇది భారత సైన్యం డ్రోన్ బెటాలియన్‌లపై దృష్టి సారించడానికి కారణం. భారత్ 1990ల చివరి నుంచి డ్రోన్‌లను కొనుగోలు చేస్తోంది, ఇందులో ఇజ్రాయెల్ నుంచి హార్పీ, హెరోప్, హెరోన్ శ్రేణి డ్రోన్‌లు, అమెరికా నుంచి 31 డ్రోన్‌లు (3.5 బిలియన్ డాలర్ల విలువ) ఉన్నాయి. అదే సమయంలో, భారత్ స్వదేశీ డ్రోన్‌లను అభివృద్ధి చేస్తోంది, ఇవి లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఎత్తైన ప్రాంతాలలో సైనిక సామగ్రి రవాణాకు ఉపయోగపడుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా, చైనా డ్రోన్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్నాయి, భారత్ కూడా ఈ రంగంలో వేగంగా ముందుకు సాగుతోంది.
Also Read: అమెరికాలో రెండోసారి పాక్ ఆర్మీ చీఫ్ టూర్.. అసలేంటి కథ?
ఆధునిక యుద్ధాలు మానవ రహిత యంత్రాల వైపు మళ్లుతున్నాయి. రాహుల్ బేదీ ప్రకారం, గతంలో జరిగిన కాంటాక్ట్ వార్‌ఫేర్ (పదాతి దళ యుద్ధాలు) స్థానంలో డ్రోన్‌లు, పైలట్ రహిత ఫైటర్ జెట్‌లు తీసుకుంటున్నాయి. ఈ యంత్రాలు మానవ తప్పిదాలను తగ్గించి, కచ్చితమైన దాడులను అందిస్తాయి. భవిష్యత్ యుద్ధాలలో మానవ సైనికుల అవసరం తగ్గి, యంత్రాల పాత్ర పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.