Mongolia’s measles spike: రోజుకు కొన్ని కొత్త వ్యాధులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఒక్కో దేశం ఒక్కో వ్యాధితో ఇబ్బంది పడుతుంది. కొన్ని దారుణాలను చూపిస్తున్నాయి. గతంలో కరోనా చూపించిన విధ్వంసం మామూలుగా లేదు. దాని భయం నుంచి ప్రజలు ఇప్పటికీ కూడా కోలుకోలేదు. అయితే ఇప్పుడు మరో దేశం కరోనాను మించి భయపెడుతుంది. మరి ఆ దేశం ఏంటి? ఎక్కడ? ఏం జరుగుతుందో ఓ సారి తెలుసుకుందాం.
మంగోలియాలో మీజిల్స్ వ్యాప్తి పెరుగుతోంది. NCCD ప్రకారం, గత 24 గంటల్లో 232 కొత్త మీజిల్స్ కేసులు నమోదు అయ్యాయట. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10,065కి చేరుకుంది. మొత్తం రికవరీల సంఖ్య 8,405కి చేరుకుంది. అదే సమయంలో, మరో 260 మంది రోగులు కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,405కి చేరుకుంది. కొత్త కేసుల్లో ఎక్కువ మంది మీజిల్స్ వ్యాక్సిన్‌ను ఒకే డోసు తీసుకున్న పాఠశాలకు వెళ్లే పిల్లలేనని NCCD తెలిపింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఈ తీవ్రమైన వ్యాధి నుంచి తమ పిల్లలను రక్షించుకోవడానికి వారి పిల్లలకు మీజిల్స్ వ్యాక్సిన్ రెండు డోసులను పొందేలా చూసుకోవాలని NCCD కుటుంబాలకు విజ్ఞప్తి చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, మీజిల్స్ అనేది ఒక అంటువ్యాధి. వైరల్ వ్యాధి. ఇది శ్వాస తీసుకోవడం, దగ్గు లేదా తుమ్మడం వల్ల సులభంగా వ్యాపిస్తుంది. ఇది మరణానికి కూడా కారణమవుతుంది. ఇక దీని లక్షణాల గురించి తెలుసుకుంటే.. తట్టు వ్యాధి ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. కానీ టీకాలు వేయని లేదా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న ఎవరికైనా ఈ వ్యాధి రావచ్చు. దీని లక్షణాలు అధిక జ్వరం, దగ్గు, ముక్కు కారటం, శరీరం అంతటా దద్దుర్లు వంటివి వస్తాయి.
WHO ప్రకారం, మీజిల్స్‌ను నివారించడానికి, దాని వ్యాప్తిని ఆపడానికి టీకాలు వేయడం అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఇది సురక్షితమైనది మాత్రమే కాదు. వైరస్‌తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. అయితే దాదాపు 1,07,500 మంది మీజిల్స్‌తో మరణించారు. 1963లో మీజిల్స్ వ్యాక్సిన్ ప్రవేశపెట్టారు. ఇక ఈ వ్యాక్సిన్ కంటే ముందే రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కూడా భారీ అంటు వ్యాధులు వచ్చాయి. దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రతి సంవత్సరం దాదాపు 2.6 మిలియన్ల మంది మరణించారు. సురక్షితమైన, సరసమైన వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అయినా సరే 2023లో, దాదాపు 1,07,500 మంది మీజిల్స్‌తో మరణించారు. వీరిలో ఎక్కువ మంది ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారు.
మంగోలియాలో ఆరోగ్య సౌకర్యాలు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మీజిల్స్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధికి టీకాలు వేయని పిల్లలు, గర్భిణీ స్త్రీలు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని NCCD హెచ్చరించింది. టీకా ప్రచారాలను వేగంగా వ్యాప్తి చేయాలని నిపుణులు సూచించారు. మరి ఈ వ్యాధి ఇప్పటికీ అయితే మన వరకు రాలేదు కాబట్టి కాస్త ఊపిరిపీల్చుకోవచ్చు.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.