Telangana Journalist Suicide: స్వేచ్ఛ ధైర్యవంతురాలు. సమస్యలను ఎదిరించి గత దశాబ్దంన్నరగా వివిధ మీడియా సంస్థలలో పనిచేస్తున్న పాత్రికేయురాలు. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడిన మహిళ పాత్రికేయురాలు. అటువంటి స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడటాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
స్వేచ్ఛ పూర్ణచందరరావు తో సహజీవనం చేయడమే ఈ సమస్యలకు కారణమని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు..” అతడు నాతో క్లోజ్ గానే ఉండేవాడు. అతడిని చూస్తే నాకు రాంగ్ అనిపించేది. చాలా సందర్భాల్లో అమ్మ అతడితో డిబేట్ చేసింది. అనేకసార్లు నేను అతడు కరెక్ట్ కాదని చెప్పేదాన్ని. అయినప్పటికీ అమ్మ వినిపించుకునేది కాదు. పైగా అతడికే సపోర్ట్ చేసేది. అది నాకు నచ్చేది కాదు. అతడు ప్రతిరోజు మా ఇంటికి వచ్చేవాడని” స్వేచ్ఛ కూతురు పేర్కొంది.
Also Read: కన్నీళ్లు తెప్పిస్తున్న స్వేచ్ఛ కూతురు మాటలు
అతడి ముఖం కూడా నేను చూడలేదు. కానీ నా కూతురు చెబుతుంటే విన్నాను.. అతనితో గొడవలు జరిగినప్పుడు నా కూతురు నాతో చెప్పేది. ఆ తర్వాత మేమిద్దరం కలిసి పోయామని అనేది. కానీ ఈసారి మాత్రం ఎందుకనో అతడితో ఉండలేనని చెప్పేసింది. నువ్వు కూడా అతనితో మాట్లాడకు అని నాతో అంది. కలిసి ఉండాలని చెప్పకు అని కూడా అన్నది. నా కూతురు అలా అనేసరికి నాక్కూడా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పోతారని అనుకున్నాను. కానీ ఇంతటి నిర్ణయం తీసుకుంటుందని కలలో కూడా ఊహించలేదని” స్వేచ్ఛ తండ్రి వెల్లడించాడు.
విడాకుల విషయంలోనే స్వేచ్ఛకు, పూర్ణచందర రావుకు గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు పూర్ణచంద్రరావు హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే అదే విషయాన్ని స్వేచ్ఛ గుర్తు చేయడంతో పూర్ణచంద్రరావు ఆగ్రహానికి గురయ్యావాడని.. ఆమెతో వాగ్వాదానికి దిగేవాడని బంధువులు చెప్తున్నారు. అదే అనేక సందర్భాల్లో ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ కలిసిపోయారని.. ఈసారి మాత్రం వాగ్వాదం తారా స్థాయిలో జరిగిందని.. అందువల్లే ఈ దారుణం చోటుచేసుకుందని స్వేచ్ఛ సన్నిహితులు అంటున్నారు.
Also Read: న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఎందుకు చనిపోయింది? కారణాలు అవేనా?
అయితే ఇటీవల స్వేచ్ఛ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో తన పేరు పక్కన పూర్ణచంద్రరావు పేరు జత చేసింది. అంతేకాకుండా తన సోషల్ మీడియా ఖాతాలో అతనితో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.. ఇటీవల వారిద్దరూ ఓ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వారిద్దరు ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను స్వేచ్ఛ తన సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసింది. ఇది పూర్ణచంద్రరావుకు కోపం తెప్పించినట్టుంది. ఈ విషయంలోనే ఇద్దరికీ వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది..” నా కూతురు ఎలాంటి సమస్య అయినా ఎదుర్కొంటుంది. ఏ విషయమైనా సరే డీల్ చేయగలుగుతుంది. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం మమ్మల్ని ఆవేదనకు గురిచేస్తున్నదని” స్వేచ్ఛ తల్లి వాపోయింది. “నా కూతురు ఇలా చేసుకోవడం బాధ కలిగిస్తోంది.. ఎంతోమందికి ధైర్యం చెప్పిన ఆమె ఇలా విగత జీవిగా మారిపోవడం కన్నీరు తెప్పిస్తోందని” స్వేచ్ఛ తల్లి తన ఆవేదన వ్యక్తం చేసింది.
View this post on Instagram