Homeఅంతర్జాతీయంHormuz Strait Closed Iran: మిడిల్ ఈస్ట్ యుద్ధం: హార్ముజ్ జల సంధి మూసివేత.. సౌదీ...

Hormuz Strait Closed Iran: మిడిల్ ఈస్ట్ యుద్ధం: హార్ముజ్ జల సంధి మూసివేత.. సౌదీ కొత్త ప్లాన్ ఏంటంటే?

Hormuz Strait Closed Iran: మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జల సంధి ని మూసివేసింది.. దీంతో చమురు రవాణా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఇరాన్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడానికి దోహదం చేస్తోంది.

Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే

గల్ఫ్ దేశాలు తమ చమురును ప్రపంచ దేశాలకు రవాణా చేయడానికి హార్ముజ్ జల సంధిని ఉపయోగించుకుంటాయి. ఇందులో సౌదీ అరేబియా కూడా ఉంటుంది. ఈ జల సంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో.. తమ వద్ద ఉత్పత్తి అయిన చమురును విక్రయించుకోవడంలో గల్ఫ్ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇందులో సౌదీ అరేబియా కూడా ఉంది. సౌదీ అరేబియాకు ప్రధాన ఆదాయం చమురు విక్రయం ద్వారా వస్తూ ఉంటుంది. అయితే సౌదీ అరేబియా ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

హార్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ సరఫరా చేయడానికి సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాల పై దృష్టి సారించింది. ఎర్ర సముద్ర తీరంలోని యాంబు టెర్మినల్ నుంచి క్రుడ్ ఆయిల్ ను ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పర్షియన్ గల్ఫ్ ఫీల్డ్స్ లోని అభి కైక్ నుంచి పైపుల ద్వారా ఫ్రూట్ ఆయిల్ ను యాంబు కు తరలించనుంది. అక్కడినుంచి చెయ్యొద్దు సూయాజ్ కెనాల్ మార్గంలో ఓడల ద్వారా యూరప్ వైపు తరలిస్తుంది.. బాబ్ అల్ మందెబ్ జల సంధి ద్వారా హిందూ మహా సముద్రం వైపు తరలించనుంది. తద్వారా క్రూడ్ ఆయిల్ ను ఇతర దేశాలకు సరఫరా చేయనుంది. ఇలా సరఫరా చేయడం కాస్త ఇబ్బందిగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌదీ అరేబియాకు ఇంతకు మించిన మార్గం మరొకటి లేదు.

హార్ముజ్ జల సంధి చమురు రవాణాకు అత్యంత ముఖ్యమైనది. ఈ జల సంధి పై ఇరాన్ కు చాలావరకు హక్కులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా.. ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ జలసంది మీద ఎటువంటి రవాణా జరగకుండా ఇరాన్ మూసివేసింది. దీంతో ప్రపంచ దేశాలలో క్రూడ్ ఆయిల్ డిమాండ్ పెరిగిపోయింది. మరోవైపు క్రూడ్ ఆయిల్ ను విక్రయించకపోతే సౌదీ అరేబియాకు ఇబ్బంది తప్పదు. ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లే సౌదీ అరేబియా ఇలా ప్రత్యామ్నయం ద్వారా క్రూడ్ ఆయిల్ ను విక్రయించడానికి రంగం సిద్ధం చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular