spot_img
Homeఅంతర్జాతీయంMauritius Indian tourists cheated: భారతీయులను కరివేపాకులా తీసేశారు..3.5 లక్షల తీసుకొని ముద్ద కూడా పెట్టలేదు!

Mauritius Indian tourists cheated: భారతీయులను కరివేపాకులా తీసేశారు..3.5 లక్షల తీసుకొని ముద్ద కూడా పెట్టలేదు!

Mauritius Indian tourists cheated: మనం ఏదైనా హోటల్ వెళితే.. అక్కడి నిర్వాహకులు గ్రాండ్ వెల్కమ్ చెబుతారు. మనకు ఏది ఇష్టమో కనుక్కొని.. అది టేబుల్ ముందుకు తెచ్చి పెడతారు. ఒకవేళ మనం రూమ్ బుక్ చేసుకుంటే.. మనం చెల్లించిన రుసుము ఆధారంగా సౌకర్యాలు కల్పిస్తారు. ఇక విదేశాలలో అయితే మనం చెల్లించిన డబ్బు ఆధారంగా సౌకర్యాలు లభిస్తాయి. తినే తిండి నుంచి.. తాగే నీరు వరకు.. ప్రతి దాంట్లో మనం కోరుకున్న విధంగా హోటల్ నిర్వాహకులు సర్వ్ చేస్తూ ఉంటారు.

విదేశాలలో భారతీయులకు మంచి సత్కారాలు లభిస్తాయి. హోటల్ నిర్వాహకులు అద్భుతమైన హాస్పిటాలిటీ అందిస్తారు. కానీ ప్రకృతి ఒడిలో ఆస్వాదించాలని.. అద్భుతమైన రుచులను ఆరగించాలని మారిషస్ వెళ్లిన భారతీయ కుటుంబానికి దారుణమైన అనుభవం ఎదురయింది. వారికి అడుగడుగున జాతి వివక్ష ఎదురు కావడంతో నరకం చూశారు.

ఆ యువకుడికి కొత్త ఉద్యోగం వచ్చింది. తనకు ఉద్యోగం రావడానికి ప్రధాన కారణమైన తల్లిదండ్రులకు గొప్ప కానుక ఇవ్వాలని అతడు భావించాడు. దానికి తగ్గట్టుగా తన తల్లిదండ్రులను మారిషస్ తీసుకెళ్లాడు. అక్కడ పంచతార రిసార్ట్ లో ఒక రూమ్ బుక్ చేశాడు. తన తల్లిదండ్రులకు అద్భుతమైన విందు ఇవ్వాలని భావించాడు. అయితే అతడికి ప్రతిక్షణం ఇబ్బంది ఎదురైంది. ఈస్టర్ పండుగ రోజు టేబుల్ బుక్ చేస్తే.. ఖాళీ లేవని చెప్పారు. 15 నిమిషాలలో సమాచారం ఇస్తామని చెప్పి.. గంటలు గడిచినా కూడా ఎటువంటి సమాధానం చెప్పలేదు. చివరికి ఆ యువకుడి తల్లిదండ్రులు ఆకలితో ఇబ్బంది పడ్డారు. గత్యంతరం లేక హౌస్ కీపింగ్ సిబ్బందికి వద్దకు వెళ్లారు. దీంతో హౌస్ కీపింగ్ సిబ్బంది ఈస్టర్ పండుగ సందర్భంగా హోటల్ నిర్వాహకులు ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేశారని. అక్కడికి వెళ్లాలని సూచించారు.

ఈస్టర్ పండగ సందర్భంగా ఏర్పాటుచేసిన విందు వద్దకు వారు వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయాయని హోటల్ నిర్వాహకులు సమాధానం చెప్పారు. అదే సమయంలో ఒక శ్వేత జాతీయుడు అక్కడికి రాగానే… అతడికి వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ వడ్డించారు.. 3.5 లక్షలు చెల్లించినప్పటికీ తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వకపోగా.. తినే తిండి విషయంలో కూడా వివక్ష చూపించడంతో ఆ యువకుడు తన బాధను మొత్తం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇదే విషయాన్ని హోటల్ నిర్వాహకుల వద్దకు అతడు తీసుకెళ్తే.. వారు నిర్లక్ష్యంగా మీ ఫీడ్ బ్యాక్ చెప్పండి మేం రాసుకుంటామని అనడం విశేషం. తనకు జరిగిన అన్యాయాన్ని ఇలా సోషల్ మీడియా ద్వారా బయటపెడుతున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. గతంలో కూడా మాల్దీవులకు భారతీయులు వెళ్లినప్పుడు ఇటువంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఇప్పుడు మారిషస్ లో కూడా ఓ భారతీయ కుటుంబానికి ఇటువంటి అనుభవం ఎదురు కావడం.. చర్చకు దారి తీస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version