spot_img
Homeబిజినెస్Gold, Silver Rate Today: బంగారం, వెండి.. ఇక మనం జన్మలో కొనలేం

Gold, Silver Rate Today: బంగారం, వెండి.. ఇక మనం జన్మలో కొనలేం

Gold, Silver Rate Today: ప్రపంచంలో ప్రస్తతం ఏం నడుస్తోంది అంటే.. బంగారం, వెండి ధరల పెరుగుదల నడుస్తోందని చెబుతున్నారు. ఏడాది క్రితం మొదలైన ఈ పెరుగుదల ప్రయాణం.. ఇంకా కొనసాగుతోంది. అప్పుడప్పుడు చిన్నచిన్న బ్రేక్‌లు పడుతున్నా.. పెరుగుదల మాత్రం ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు గొల్డ్, సిల్వర్‌ నిల్వలు పెంచుకుంటున్నాయి. దీంతోపాటు యుద్ధ భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాల బ్యాంకులు గోల్డ్, సిల్వర్‌ నిల్వలు పెంచుకుంటున్నాయి. దీంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి.

ధరల పెరుగుదల ఇలా..
తాజాగా బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో24 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాములకు రూ.2,070 పెరిగి రూ.1,61,350కు చేరింది. దీంతో ఇక సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం, వెండి కొనే పరిస్థితి లేదు. 22 క్యారెట్‌ పసిడి 10 గ్రాముల ధర రూ.1,900 పెరిగి రూ.1,47,900గా నిలిచింది. కేజీ వెండి ధర కూడా రూ.10 వేలు పెరిగింది. దీంతో రూ.3 లక్షలకు చేరింది. ఈ హెచ్చుతగ్గులు మార్కెట్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ధరల పెరుగుదలకు కారణాలు..
అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ బలహీనత, భౌగోళిక ఉద్రిక్తతలు, పన్నుల పెరుగుదలకు ప్రధాన కారణాలు. భారతదేశంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ కారణంగా బంగారానికి డిమాండ్‌ పెరిగింది. దీంతో ధరలు మరింత పెరిగాయి. దీనికి ఇన్ఫ్లేషన్, కరెన్సీ బలహీనతలు కూడా తోడయ్యాయి.

ఈ ధరలు బంగారం, వెండిని సామాన్యులకు దూరం చేస్తున్నాయి. పెట్టుబడిదారులు లాభాలు పొందుతున్నారు. కొత్తగా కొనుగోళ్లు నిలిపి, ధరలు స్థిరపడనంతవరకు ఎదురుచూడటం మంచిది. మార్కెట్‌ ట్రెండ్‌లను ట్రాక్‌ చేసి, వైవిధ్య పెట్టుబడులు పెట్టడితే ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version