https://oktelugu.com/

Luxury Clubs: ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన క్లబ్‌లు.. చూస్తే కళ్లు చెదిరిపోతాయి

విలాసవంతమైన క్లబ్‌లకు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఈ ప్రపంచంలో ఎన్నో విలాసవంతమైన క్లబ్‌లు ఉన్నాయి. మరి ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత విలాసవంతమైన క్లబ్‌‌లు ఏవో చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : November 14, 2024 10:25 pm
luxury club

luxury clubluxury club

Follow us on

Luxury Clubs: ఈ ప్రపంచంలో ఎన్నో విలాసవంతమైన భవనాలు, పట్టణాలు, ఇళ్లు వంటివి ఉన్నాయి. లైఫ్‌లో ఒక్కసారి అయిన వీటిని చూడాలని అనుకుంటారు. అయితే చాలా మందికి ఎంజాయ్‌ చేయడమంటే చాలా ఇష్టం. దీనికోసం ఎక్కువగా క్లబ్‌లకు వెళ్తుంటారు. ముఖ్యంగా విలాసవంతమైన క్లబ్‌లకు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఈ ప్రపంచంలో ఎన్నో విలాసవంతమైన క్లబ్‌లు ఉన్నాయి. మరి ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత విలాసవంతమైన క్లబ్‌‌లు ఏవో చూద్దాం.

ఎల్లోస్టోన్ క్లబ్, మోంటానా, అమెరికా
అమెరికాలోని రాకీ పర్వతాల్లో ఎల్లోస్టోన్ క్లబ్ ఉంది. ఇది మొత్తం 15,200 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో ఒక రోజు స్టే చేయాలన్నా కూడా చాలా ఖర్చు చేయాలి. ఏ సీజన్‌లో అయిన కూడా క్లబ్‌కి వెళ్తే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ క్లబ్‌ను 2001లో ప్రారంభించారు. అయితే ఈ క్లబ్‌లో ఏడాదికి ఒకసారి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తారట.

లండన్‌లోని అపోలోస్ మ్యూజ్
లండన్‌లో మేఫెయిర్‌లోని అపోలోస్ మ్యూజ్ క్లబ్ ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన క్లబ్‌లో ఒకటి. ఈ క్లబ్‌ను పాలరాతి గోడలు, శిల్పాలు, విగ్రహాలతో తయారు చేశారు. ఇందులో దాదాపుగా 500 సభ్యులు ఉండే విధంగా ఈ క్లబ్‌ను నిర్మించారు.

యాచ్ క్లబ్ డి మొనాకో
ఈ క్లబ్‌ను 1953లో ప్రిన్స్ రైనర్ 3 స్థాపించారు. యాచ్ క్లబ్ డి మొనాకో అనేది ప్రిన్సిపాలిటీ సముద్ర చరిత్రను ప్రతిబింబించే ఒక క్లబ్. ఇందులో లైబ్రరీ, కొలను, వ్యాయామశాల వంటివి ఉన్నాయి. అలాగే ఇందులో లగ్జరీ క్యాబిన్‌లు, వెల్‌నెస్ సేవలు, ప్రత్యేకమైన ఈవెంట్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ క్లబ్‌లో సభ్యత్వం పొందాలంటే ఇద్దరు స్పాన్సర్‌లతో పాటు చక్రవర్తి ప్రిన్స్ ఆల్బర్ట్ 2 నుంచి కూడా ఆమోదం ఉండాలి. ఈ క్లబ్ ప్రపంచంలోని అతిపెద్ద సూపర్‌ యాచ్‌లలో ఒకటి.

దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్‌లోని క్యాపిటల్ క్లబ్
ఈ క్యాపిటల్ క్లబ్‌ దుబాయ్ నగరంలోనే పెద్దది. ఇక్కడికి ఎక్కువగా పెద్ద వ్యాపారులు వస్తుంటారు. అయితే ఈ క్లబ్‌లో రెస్టారెంట్లు, సిగార్ రూమ్, వెల్‌నెస్ సెంటర్, ఆర్ట్ గ్యాలరీ, రూఫ్‌టాప్ బార్, రౌండ్-ది-క్లాక్ వంటి విలాసవంతమైన గదులు ఉన్నాయి. అయితే ఇందులో సభ్యత్వం పొందాలంటే ప్రత్యేక కమిటీచ ఆమోదించాలి. అలాగే కొంత వరకు డబ్బులు కూడా చెల్లించాలి. కేవలం వ్యాపారులు మాత్రమే కాకుండా ఉన్నత స్థాయి వ్యాపార, ఆర్థిక, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా వెళ్తుంటారు.

డ్రాక్యులా క్లబ్ స్విట్జర్లాండ్
స్వీట్జర్లాండ్‌లోని డ్రాక్యులా క్లబ్‌ని 1974లో ఆర్ట్ కలెక్టర్ గుంటర్ సాచ్స్ స్థాపించారు. ఈ క్లబ్‌కి స్విస్ బ్యాంకర్లు, సెలబ్రిటీలు, ప్రముఖలు వంటి వారు వస్తుంటారు. అయితే ఈ క్లబ్‌లో పురుషులకు, మహిళలకు కొన్ని డ్రసింగ్ కోడ్‌లు ఉంటాయి. అలాగే ఇక్కడ మొబైల్ ఫోన్లు నిషేధం.

జీరో బాండ్ న్యూయార్క్
ఈ జీరో బాండ్ క్లబ్ దాదాపు 20,000 వేల చదరపు అడుగుల ప్రైమ్ మాన్‌హట్టన్ రియల్ ఎస్టేట్‌లో ఉంది. ఈ క్లబ్‌కి పెద్ద సెలబ్రిటీలు వస్తుంటారు. ఇందులో చాలా విలువైన కళాకృతులు కూడా ఉన్నాయి.