https://oktelugu.com/

Unwanted hair: షేవింగ్ లేదా వాక్సింగ్ రెండింటిలో ఏది బెటర్ ఆప్షన్?

కొందరు చర్మంపై ఉండే హెయిర్‌ను రిమూవ్ చేయడానికి వాక్సింగ్ ఉపయోగిస్తారు. మరికొందరు షేవింగ్ ఉపయోగిస్తారు. అయితే హెయిర్ రిమూవ్ చేయడానికి రెండింటిలో అసలు ఏది బెటర్ ఆప్షన్. వాక్సింగ్ చేయడం వల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదా? లేకపోతే షేవింగ్ వల్ల ఇబ్బంది ఉండదా? అనే విషయాలు తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 15, 2024 / 04:25 AM IST

    Unwanted hair

    Follow us on

    Unwanted hair: చాలా మంది చర్మం చాలా క్లియర్‌గా ఉండాలని కోరుకుంటారు. దీనికోసం ఎప్పటి కప్పుడూ చర్మంపై ఉండే జుట్టును రిమూవ్ చేస్తారు. అయితే కొందరు చర్మంపై ఉండే హెయిర్‌ను రిమూవ్ చేయడానికి వాక్సింగ్ ఉపయోగిస్తారు. మరికొందరు షేవింగ్ ఉపయోగిస్తారు. అయితే హెయిర్ రిమూవ్ చేయడానికి రెండింటిలో అసలు ఏది బెటర్ ఆప్షన్. వాక్సింగ్ చేయడం వల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదా? లేకపోతే షేవింగ్ వల్ల ఇబ్బంది ఉండదా? అనే విషయాలు తెలుసుకుందాం.

     

    హెయిర్‌ను రిమూవ్ చేయానికి ఎక్కువ శాతం మంది ఉపయోగించేది షేవింగ్. దీంతో హెయిర్‌ను రిమూవ్ చేస్తే ఈజీగానే రిమూవ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు చర్మంపై నొప్పి పుడుతుంది. నెమ్మదిగా షేవ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కాస్త గట్టిగా రిమూవ్ చేయడం వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. దీనివల్ల చర్మ సమస్యలు కొన్నిసార్లు వచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు షేవింగ్ చేసేటప్పుడు చర్మంపై ఉండే స్కిన్ కూడా పాడవుతుంది. అయితే శరీరంలోని సున్నిత భాగాలు షేవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే కొన్నిసార్లు దురద, చికాకు వంటివి కూడా ఏర్పడతాయి. షేవింగ్ చేయడం వల్ల వెంట్రుకల రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో చర్మంపై దద్దుర్లు వంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. షేవింగ్ చేసిన తర్వాత హెయిర్ మళ్లీ ఎక్కువగా వస్తుంది. ఇలా తీసిన ప్రతీసారి జుట్టు వస్తూనే ఉంటుంది. అయితే ఇలా ఎక్కువ సార్లు షేవింగ్ చేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

     

    వాక్సింగ్ ద్వారా కూడా కొందరు జుట్టును తీసివేస్తారు. అయితే వాక్సింగ్‌తో బలంగా ఒక్కసారి జుట్టును రిమూవ్ చేయడం వల్ల ఆ ప్రదేశంలో చర్మం నొప్పిగా ఉంటుంది. దీనివల్ల కొన్ని రోజులు ఆ ప్రదేశంలో పెయిన్ ఉంటుంది. అయితే వాక్సింగ్ ఖర్చు కాస్త ఎక్కువగా ఉంటుంది. వాక్సింగ్, షేవింగ్ రెండు పద్ధతులు కూడా బెటర్. ఖర్చు, మీ ఓపిక బట్టి రెండింటిలో ఏది చేసుకోవడం అనేది మీ ఇష్టం. అయితే ఈ రెండు పద్ధతులును ఉపయోగించిన తర్వాత వెంటనే కొన్ని రోజులకు మళ్లీ హెయిర్ వచ్చేస్తుంది. కానీ లేజర్ పద్ధతిని ఉపయోగిస్తే మళ్లీ హెయిర్ రాదు. ఇది ప్రస్తుతం ఎక్కువ మంది చేయించుకుంటున్నారు. దీనివల్ల పూర్తిగా హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. మళ్లీ హెయిర్ వచ్చే అవకాశం ఉండదని నిపుణులు అంటున్నారు. అయితే ఈ లేజర్ పద్ధతి కాస్త ఖర్చుతో కూడుకున్నది. ఒక ఆరు నుంచి ఏడు సెషన్స్‌లో హెయిర్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు అంటున్నారు. కాకపోతే ఖర్చు మాత్రం కొద్దిగా ఎక్కువగానే అవుతుంది. తక్కువ ఖర్చులో అనుకుంటే వాక్సింగ్ లేదా షేవింగ్ బెటర్. ఖర్చు అయిన పర్లేదు అంటే లేజర్ చికిత్స బెటర్.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.