Kota Srinivasa Rao Latest Photo: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో SVR లాంటి నటుడు కోటా శ్రీనివాస రావు(Kota Srinivasa Rao). కామెడీ, సెంటిమెంట్, విలనిజం ఇలా ఏ యాంగిల్ లో అయినా తన అద్భుతమైన నటనని కనబరుస్తూ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిల్చిపోయాడు. ఆయన వేయని వేషం అంటూ ఏది మిగిలి లేదు. అలాంటి విలక్షణ నటుడు ఈమధ్య కాలం లో సినిమాల్లో కనిపించడం లేదు. దీనిపై సోషల్ మీడియా లో అనేక రకాల కథనాలు వస్తున్నాయి. ఈమధ్య కాలం లోనే సీనియర్ హీరోలే క్యారక్టర్ ఆర్టిస్ట్స్, విలన్స్ గా మారిపోతున్నారు. దీంతో కోటా శ్రీనివాస రావు లాంటి క్యారక్టర్ ఆర్టిస్టులకు అవకాశాలు తగ్గిపోయాయి అని అంటుంటారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఎంత మంది హీరోలు క్యారక్టర్ ఆర్టిస్ట్స్ గా మారినా కోటా శ్రీనివాస రావు ని రీ ప్లేస్ చేయడం సాధ్యమయ్యే విషయమేనా?.
కాకపోతే కోటా శ్రీనివాస రావు ఈమధ్య కాలం లో సినిమాల్లో కనిపించడం లేదు అనేది మాత్రం వాస్తవం. అందుకు కారణం ఆయన ఆరోగ్యం పూర్తి స్థాయిలో సహకరించకపోవడం వల్లే. చాలా కాలం తర్వాత ప్రముఖ కమెడియన్/నిర్మాత బండ్ల గణేష్ నేడు కోటా శ్రీనివాస రావు ని ఇంటికి వెళ్లి కలిసాడు. అక్కడ ఈ లెజండరీ నటుడుని చూసి బండ్ల గణేష్ కూడా షాక్ కి గురి అయ్యాడు. బక్క చిక్కిపోయిన శరీరం తో, కాళ్లకు కట్టు కట్టుకొని చాలా దయనీయమైన పరిస్థితి లో కనిపించాడు. బహుశా కోటా శ్రీనివాస రావు కి షుగర్ ఉంది అనుకుంటా. అందుకే ఆయన కాళ్ళ వేళ్లను కట్ చేసినట్టు గా అనిపించింది. తమ అభిమాన నటుడుని ఈ స్థితిలో చూసి తెలుగు ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటున్నారు. కోటా శ్రీనివాస రావు గారంటే ఆయన చలాకీ తనంతో కూడిన నటన,అద్భుతమైన డైలాగ్ డెలివరీ,ఛలోక్తులు వంటివి గుర్తుకు వస్తాయి.
కానీ ఇప్పుడు వెండితెర మీదకు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి ఒకప్పటి లాగా చలాకీతనం తో నటించే ఓపిక, శక్తి కోటా శ్రీనివాస రావు కి లేదు. అందుకే సినిమాలకు ఆయన చాలా కాలం నుండి దూరంగా ఉంటున్నాడు. ఇది ఆయన చేసుకున్న దురదృష్టం కాదు, ప్రేక్షకులు చేసుకున్న దురదృష్టం. కోటా శ్రీనివాస రావు వెండితెర మీద కనిపించకపోతే ఆ లోటు స్పష్టంగా తెలుస్తుంది. నాలుగేళ్ల క్రితం వరకు కోటా కాస్త యాక్టీవ్ గా ఉండేవాడు. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతోంది, సినిమా అవకాశాలు ఉంటే ఇవ్వండి అని స్వయంగా ఆయనే అడిగి మరీ పాత్రలు చేసేవాడట. అలా పవన్ కళ్యాణ్ కి అప్పట్లో ఫోన్ చేసి అడిగితే ఆయన ‘హరి హర వీరమల్లు’ చిత్రం లో అవకాశం ఇప్పించాడు. ఎల్లుండి విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వచ్చే నెలకు వాయిదా పడింది.