https://oktelugu.com/

Australia : చదువు మానేసి ఆస్ట్రేలియాలో చాయ్ దుకాణం పెట్టాడు.. ఏడాదికి రూ.5.2 కోట్లు సంపాదిస్తున్నాడు

చాయ్.. పేరుకు ఇది రెండు అక్షరాలు మాత్రమే.. కానీ దీనికి తయారుచేసిన వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు. మన దేశాన్ని పాలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకప్పుడు చాయ్ తయారు చేసిన వ్యక్తే. గుజరాత్ రైల్వేస్టేషన్ లో చాయ్ అమ్మిన వ్యక్తే.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 11, 2024 7:47 pm
    Tea Business In Australia

    Tea Business In Australia

    Follow us on

    Australia :  చాయ్ వ్యాపారం మనదేశంలో వేలకోట్లకు ఎదిగింది. ఇప్పుడు కార్పొరేట్ రూపును సంతరించుకుంది. పెద్ద పెద్ద కంపెనీలు చాయ్ తయారీ రంగంలోకి అడుగుపెట్టాయి. రకరకాల పేర్లతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రకరకాల చాయ్ లను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. శిరోభారాన్ని మాత్రమే కాదు, నాలుకకు కొత్త రుచులను అందిస్తున్నాయి.. మామూలు చాయ్ నుంచి మొదలుపెడితే మ్యాంగో చాయ్ వరకు రుచి చూపిస్తున్నాయి. వినియోదారులు కూడా కొత్త కొత్త రుచులను కోరుకుంటున్న నేపథ్యంలో..చాయ్ వ్యాపారం అంతకంతకు విస్తరిస్తోంది. చాయ్ వ్యాపారంలో ఐఐటీ గ్రాడ్యుయేట్లు కూడా ఎంటర్ అవుతున్నారంటే దీని వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడిదారులు కూడా ఇందులో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాయ్ చుట్టూ వేలకోట్ల వ్యాపారం జరుగుతోంది. టాటా నుంచి మొదలుపెడితే బ్రూక్ బాండ్ వరకు ఎన్నో కంపెనీలు వ్యాపారాలు సాగిస్తున్నాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలలో తేయాకు తోటలు సాగవుతున్నాయి. ఇవి దేశ అవసరాలు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాయి.

    సెలబ్రిటీలుగా మారుతున్నారు..

    చాయ్ తయారుచేసిన వ్యక్తులు సెలబ్రిటీలుగా మారుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధానానికి శ్రీకారం చుట్టగా.. దానిని మిగతావారు కొనసాగిస్తున్నారు. తాజాగా డాలి అనే చాయ్ తయారు చేసే వ్యక్తి సెలబ్రిటీ అయిపోయాడు. ఆయన టీ తయారు చేసే విధానం విచిత్రంగా ఉంటుంది. ఇటీవల ముకేశ్ అంబానీ కుమారుడు వివాహానికి బిల్ గేట్స్ హాజరయ్యారు. దానికంటే ముందు డాలి అనే చాయ్ మాస్టర్ ను కలిశారు. అతనితో కలిసి చాయ్ తాగారు. అతడు చాయ్ తయారుచేసిన విధానానికి ఫిదా అయ్యారు. డాలి సెలబ్రిటీ కావడంతో సోషల్ మీడియాలో మీమ్స్ సందడి చేస్తున్నాయి. “పేరుపొందిన విద్యాసంస్థల్లో చదవడం కాదు.. సెంటర్లో చాయ్ బండి పెట్టుకుంటే చాలు.. జీవితం సెటిల్ అవుతుంది. సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంటే చాలు.. సెలబ్రిటీ హోదా వస్తుందని” నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    ఇక మన దేశానికి చెందిన ఓ వ్యక్తి ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడ ఉద్యోగం చేయకుండా చాయ్ దుకాణం పెట్టాడు. అతడు చాయ్ తయారు చేసే విధానం అందరికీ నచ్చింది. అతడు తయారు చేసే అల్లం చాయ్ కి అక్కడ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అతడికి విపరీతమైన గిరాకీ ఉంది. దీంతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయాడు. ఏడాదికి 5.2 కోట్లు సంపాదిస్తున్నాడు. దీంతో అతడు ఒకసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యాడు. అతనిపై నెటిజన్లు మీమ్స్ రూపొందిస్తూ షేక్ చేస్తున్నారు.