https://oktelugu.com/

Thums up – Allu Arjun : మహేష్ సహా ఇంతమంది హీరోలుండగా పుష్పరాజ్ తో థమ్స్ అప్ టై అప్ వెనుక కథ

అల్లు అర్జున్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్లలో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే రెడ్ బస్ యాడ్ లో నటించిన బన్నీ మరో యాడ్ లో కనిపించాడు.

Written By:
  • Rocky
  • , Updated On : November 11, 2024 / 08:20 PM IST

    Thums up - Allu Arjun

    Follow us on

    Thums up – Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. క్రియేటివ్ డైరెక్టర్, లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది పుష్ప2. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన మరో ఘనత సాధించాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ఆయనకు నార్త్ లో మంచి బిజినెస్ ఏర్పడింది. అంతే కాకుండా ఆయనకు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. పుష్ప మేనియా నార్త్ లో మామూలుగా లేదు. దాంతో పాటు జాతీయ అవార్డును కూడా సొంత చేసుకోవడంతో మిగతా స్టార్ హీరోలను పక్కన బెట్టి కంపెనీ స్టైలిష్ స్టార్ బన్నీని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నాయి. తమ అభిమాన హీరో ఈ ఘనత సాధించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    అల్లు అర్జున్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్లలో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే రెడ్ బస్ యాడ్ లో నటించిన బన్నీ మరో యాడ్ లో కనిపించాడు. ‘థమ్స్ అప్’ ప్రకటన బన్నీకి వచ్చింది. స్టార్ హీరోలను కాదని బన్నీకి ఈ యాడ్ రావడంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు థమ్స్ అప్ యాడ్ లో కనిపించి సందడి చేశారు. ఇక ఇప్పుడు ఈ యాడ్ లో బన్నీ మెరిశారు. తమ హీరో అరుదైన ఘనత సాధించడంతో పాటు క్రేజ్ పెరిగిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ యాడ్ లో బన్నీ ఏ రేంజ్ స్టంట్స్ చేస్తాడో అని క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థమ్సప్ కు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్లుగా చేశారు. ఇప్పుడు ఇది ఐకాన్ స్టార్ చేతికి వెళ్లింది.

    కాగా, ప్రస్తుతం ఈ ఐకాన్ స్టార్ పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొంటుండగా.. త్వరలోనే షూటింగ్‌ని పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసి ప్రమోషన్స్‌ను చేపట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పుష్ప సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈ యాడ్ విడుదల కానుంది. సుకుమార్ ఐటెం సాంగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయనున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ చేయబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ‘పుష్ప 2’కి స్టార్ యాక్టర్ వాయిస్ ఓవర్ ఉంటుందని కూడా అంటున్నారు. ఈ క్రమంలో థమ్స్ అప్.. పుష్ప టీమ్ తో కలిసి యాడ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన పోస్ట్‌లను సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా షేర్ చేశారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ డైలాగ్స్ , మ్యానరిజమ్స్‌లో ఫుల్ జోష్‌తో కనిపిస్తాడని తెలుస్తోంది.

    ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. అల్లు అర్జున్ ఊరమాస్ పాత్రలో నటించాడు. ఈ చిత్రం 2021 లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్’ సిద్ధమవుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ నెల 17న చిత్ర ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.