Leaked Call Controversy: అప్పట్లో పెగసస్.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్.. పేర్లు మాత్రమే వేరు. జరిగిన వివాదం ఒకటే. రాద్ధాంతం కూడా ఒకటే.. నాడు అధికారంలో ఉన్నవారు టెలిగ్రాఫ్ చట్టం ప్రకారమే తాము చేసామని చెబుతుంటే.. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు దానిని తప్పు అని చెబుతున్నారు. దానిని నిరూపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ దేశం నుంచి తీసుకొచ్చిన నిఘా సాఫ్ట్ వేర్ ప్రస్తావన కాలగర్భంలో కలిసిపోతే.. తెలంగాణలో దొంగ చాటుగా వివిధ వ్యక్తుల ఫోన్ కాల్స్ విన్న కేసు మాత్రం సంచలనం సృష్టిస్తోంది. మొదట్లో పదులకొద్దీ ఫోన్ కాల్స్ విన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ సంఖ్య వేలకు చేరుకుంది. రేపో మాపో అంతకుమించి అనే సంఖ్యకు చేరుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఇంతకీ ఈ కేసులో దోషి ఎవరు? ప్రభుత్వం ఎప్పుడు నిర్ధారిస్తుంది? వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటుంది? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
Also Read: అణు బాంబులున్న ఉత్తర కొరియాలో ఇంతటి అద్భుతమా? వచ్చే నెలలో ఓపెన్..ఇంతకీ కిమ్ జోంగ్ ఉన్ ఏం చేశాడంటే?
జస్ట్ ఒక ఫోన్ కాల్ లీక్ వల్ల ఒక ప్రధానమంత్రి సస్పెన్షన్ వేటు ఎదుర్కొన్నారు. అంతేకాదు ఆ దేశ ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఆ ప్రధానమంత్రి థాయిలాండ్ దేశానికి చెందిన పేతొంగ్ టార్న్ షిన వత్ర. థాయిలాండ్ దేశానికి చాలా రోజులుగా షిన వత్ర ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల ఆమె కంబోడియా దేశానికి చెందిన ఓ నాయకుడితో ఫోన్ సంభాషణ జరిపారు. అయితే ఆ కాల్ కాస్త లీక్ అయింది. దీంతో అక్కడి న్యాయస్థానం దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తులో ఆమె నేరం చేశారని రుజువైంది. ఆమె కంబోడియా నాయకుడితో జరిపిన సంభాషణలో థాయిలాండ్ దేశానికి చెందిన సైనిక కమాండర్ ను ప్రత్యర్థి అని సంబోధించారు. ఆ పదం ఆమె పదవి పోవడానికి కారణమైంది. మరో దేశ నాయకుడితో.. ఇలా సంబోధించడాన్ని అక్కడి కోర్టు తప్పు పట్టింది. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మొట్టికాయలు వేసింది. భవిష్యత్తు కాలంలో ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని సూచించింది. జరిగిన నేరానికి బాధ్యురాలిని చేస్తూ తక్షణమే పదవి నుంచి సస్పెండ్ చేస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
థాయిలాండ్ దేశ ప్రధానమంత్రి సస్పెన్షన్ నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి..” మన దేశానికి చెందిన ప్రతిపక్ష నాయకుడు విదేశాలకు వెళ్లి దేశ ప్రధానిని విమర్శిస్తాడు. దేశంలో ఎన్నికల విధానం సరిగా లేదని ఆరోపిస్తాడు. ఎన్నికల సంఘం ప్రధానమంత్రి తో కుమ్మక్కైందని మండిపడుతుంటాడు. ఎన్నికల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని వ్యాఖ్యానిస్తుంటాడు. అటువంటి వ్యక్తిపై మనదేశంలో ఎటువంటి చర్యలు ఉండవు. కానీ మనకంటే చిన్నదైన థాయిలాండ్ దేశంలో మాత్రం నేరం జరిగితే వెంటనే చర్యలు ఉంటాయి. నోరు జారినా సరే వెంటనే వ్యవస్థలు రంగంలోకి వస్తాయి. దారి తప్పిన నాయకులను సరిచేస్తాయి. మనదేశంలో కూడా అలా ఉంటే బాగుండేది. అప్పుడు వ్యవస్థల మీద ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం కలిగేదని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read: భార్య విడాకులు ఇచ్చిందని కోపం.. ఏకంగా రైలుకు నిప్పంటించాడు.. వైరల్ వీడియో
థాయిలాండ్ దేశంలో న్యాయ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంటుంది. మిగతా వ్యవస్థ విఫలమైనప్పుడు న్యాయ వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. వెంటనే కీలకమైన తీర్పులను వెల్లడిస్తుంది. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా కఠిన చర్యలకు సిఫారసు చేస్తుంది. అందువల్లే ఆ దేశంలో ఇప్పటికీ వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయి. ఒక ప్రధానమంత్రి తప్పుడు మాట మాట్లాడినందుకే సస్పెన్షన్ చేసిందంటే అక్కడ న్యాయవ్యవస్థ ఎంత సమర్థవంతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
#Thailand's prime minister visits border area amid ongoing #dispute with #Cambodia pic.twitter.com/6yKjUrWbiI
— ShanghaiEyeofficial (@ShanghaiEye) June 27, 2025