China Political Crisis: అభివృద్ధిలో అగ్రరాజ్యానికి ధీటుగా చైనాను అభివృద్ధి చేస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. దేశాన్ని అన్నిరంగాల్లో ముందు ఉంచేందుకు శ్రమిస్తున్నారు. దీంతో ప్రస్తుతం చైనా ఆర్థికంగా ప్రపంచంలో మూడోస్థానానికి ఎగబాకింది. అయితే దేశ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చే జిన్ పింగ్.. కొన్ని రోజులు అదృశ్యమయ్యారు. ఇప్పుడు ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మే 21 నుంచి జూన్ 5 వరకూ బహిరంగంగా కనిపించకపోవడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ గైర్హాజరీ చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ)లోని అంతర్గత రాజకీయ గతిశీలతపై ఊహాగానాలకు దారితీసింది. షీ జిన్‌పింగ్ గతంలోనూ ఇలాంటి సందర్భాల్లో కొన్ని రోజులపాటు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి వార్తలు మరింత తీవ్రంగా వ్యాప్తి చెందాయి. కొన్ని నిఘా సంస్థలు దీనిని సాధారణ వ్యవహారంగా పరిగణిస్తుండగా, మరికొన్ని సంస్థలు అధ్యక్ష మార్పుకు సంకేతంగా భావిస్తున్నాయి.
Also Read: ఫోన్ కాల్ లీక్.. ప్రధానమంత్రి సస్పెండ్.. అదే మన దగ్గరైతే కేసు తేలేదే కాదు!
అధ్యక్షుడిని మార్చేస్తారా?
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గైర్హాజరీ.. అధ్యక్ష మార్పుకు సంకేతంగా చాలా మంది భావిస్తున్నారు. వాంగ్ యాంగ్ అనే సంస్కరణల వాది, టెక్నోక్రాట్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. వాంగ్ యాంగ్, సీసీపీలో ప్రముఖ నాయకుడిగా, ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతిపై దృష్టి సారిం గుర్తింపు పొందారు. అయితే, చైనా రాజకీయ వ్యవస్థలో అధినేత మార్పు అనేది అంత సులభమైన వ్యవహారం కాదు. సీసీపీ అధికార నిర్మాణంలో షీ జిన్‌పింగ్ బలమైన పట్టు కలిగి ఉన్నారు. అతని నాయకత్వం 2012 నుంచి దేశ రాజకీయ, ఆర్థిక విధానాలను గణనీయంగా ప్రభావితం చేస్తోంది.
అంత ఈజీ కాదు..
చైనా కమ్యూనిస్టు పార్టీలో అధినేతలను ఆకస్మికంగా పక్కనబెట్టడం లేదా వారి బహిరంగ ఉనికిని తగ్గించడం సులభంగా జరగదు. కానీ అసాధారణం ఏమీ కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో హూ జింటావో, జియాంగ్ జెమిన్ వంటి నాయకుల సమయంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ గైర్హాజరీలు తరచూ అంతర్గత రాజకీయ సమావేశాలు, వ్యూహాత్మక నిర్ణయాలు లేదా వ్యక్తిగత కారణాలతో ముడిపడి ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, షీ జిన్‌పింగ్ విషయంలో ఈ గైర్హాజరీ అధికార మార్పుకు సంకేతమా లేక సాధారణ విరామమా అనేది స్పష్టత లేని అంశం.
Also Read: పాకిస్తాన్ వాళ్లకు ఈ జన్మలో సిగ్గు రాదు.. తాజాగా యుకే లో ఎలాంటి దారుణాలకు పాల్పడ్డారంటే?
అంతర్జాతీయ ప్రభావం
షీ జిన్‌పింగ్ గైర్హాజరీపై ఊహాగానాలు చైనా రాజకీయాల్లో కలకలం చేపాయి. అసలు దేశంలో ఏం జరుగుతోందని ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. ప్రజల్లో మంచి పట్టు ఉన్న పింగ్ ఎటు వెళ్లాడని ఆరా తీస్తున్నారు. మరోవైపు జిన్‌పింగ్ గైర్హాజరీ అంతర్జాతీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపునున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య విధానాలు, భౌగోళిక రాజకీయ వ్యూహాలు షీ జిన్‌పింగ్ నాయకత్వంపై గణనీయంగా ఆధారపడి ఉన్నాయి. అధ్యక్ష మార్పు జరిగితే, ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, దక్షిణ చైనా సముద్ర వివాదం వంటి అంశాలపై ప్రభావం చూపవచ్చు.