Shirish apology : ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) సోదరుడు, శిరీష్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్(Global Star Ram Charan) పై గేమ్ చేంజర్(Game Changer Movie) చిత్రం పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో ఎలాంటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం సోషల్ మీడియా లోనే కాకుండా ఆయన మాట్లాడిన మాటలు బయట కూడా బాగా వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయితే నిర్మాతలను అసలు పట్టించుకోలేదు అంటగా అంటూ జనాలు మాట్లాడుకునే స్థాయికి వచ్చారు. రామ్ చరణ్ వ్యక్తిత్వం పై బ్లాక్ మార్క్ పడేలా చేశాయి శిరీష్ చేసిన కామెంట్స్. దీనికి దిల్ రాజు కూడా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్న సాయంత్రం శిరీష్ రామ్ చరణ్ అభిమానులకు వివరణ ఇస్తూ క్షమాపణలు తెలియజేశాడు.
ఆయన మాట్లాడుతూ ‘నేను నిన్న ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారి తీసి మెగా అభిమానులు బాధపడినట్టు నా దృష్టికి వచ్చింది. #RRR వంటి సంచలనాత్మక చిత్రం తర్వాత ‘గేమ్ చేంజర్’ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయాన్ని కేటాయించాడు. మమ్మల్ని నమ్మి ఆయన వేరే సినిమాలు కూడా ఒప్పుకోకుండా మా మీద గౌరవం చూపించాడు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం తో మాకు ఎన్నో ఏళ్ళ నుండి మంచి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి, రామ్ చరణ్ మరియు ఇతర మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము. ఒకవేళ నా మాటలు మీ మనసుల్ని గాయపర్చి ఉండుంటే దయచేసి నన్ను క్షమించండి’ అంటూ శిరీష్ లేఖని విడుదల చేసాడు. దీనిని మెగా అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేసి వైరల్ చేశారు.
కొంతమంది క్షమాపణలు స్వీకరించగా,మరికొంతమంది అభిమానులు మాత్రం ఫైర్ మీద ఉన్నారు. చెయ్యాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేసి ఇలా తేలికగా క్షమాపణలు చెప్పడం ఈమధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది, రామ్ చరణ్ మా అభిమానుల మనోభావాలను గౌరవించి భవిష్యత్తులో దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయకూడదు అంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదం రామ్ చరణ్ వరకు చేరితే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. ప్రతీ చిన్న దానికి రియాక్ట్ అయ్యే మనస్తత్వం కాదు రామ్ చరణ్ ది. ఒకవేళ ఆయనకే నచ్చకపోతే మనుషులకు దూరంగా ఉండిపోతాడు. రేపు దిల్ రాజు ని కూడా ఆయన ఇదే విధంగా దూరం పెట్టే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి వీళ్ళ బ్యానర్ నుండి రెండు సినిమాలు విడుదలైతే ఒక సినిమా పోయింది, ఒక సినిమా కవర్ చేసింది. రామ్ చరణ్ అనుమతి ఇస్తేనే సంక్రాంతికి వస్తున్నాం ని విడుదల చేసుకున్నారు. ఒకవేళ వద్దు నా సినిమాకు ఎఫెక్ట్ అవుతుంది అనుంటే దిల్ రాజు సంక్రాంతి వస్తున్నాం ని విడుదల చేసేవాడా?, లాభాలను చూసేవాడా?,వివాదం ముదరడంతో ఇప్పుడు ఈ విషయాన్ని దిల్ రాజు చెప్తున్నాడు కానీ, ఇన్ని రోజులు చెప్పలేదు.