Lashkar E Taiba Saifullah Kasuri : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం 26 మంది పర్యాటకులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కక ఎ తోయిబా అనుబంద రెసిస్టెన్స్ ఫోర్స్ ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేసట్టింది. ఇందులో తొమ్మిది ఉగ్రస్థావరాలను భారత్ ధ్వసం చేసింది. లష్కర్ ఎ తోయిబాకు చెందిన వంద మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. భారత్ చితక్కొట్టినా ఆ సంస్థకు బుద్ధిరాలేదు. తాజాగా లష్కర్ ఎ తోయిబా ప్రధాన నాయకత్వంలో రెండో స్థానంలో ఉన్న సైఫుల్లా కసూరి ఇటీవల బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు, భారత్‌పై మళ్లీ ఉగ్రవాద ఒత్తిడి పెరిగే సూచనలుగా కనిపిస్తున్నాయి. ఆయన అభియోగాల ప్రకారం, భారత్ ఉద్దేశపూర్వకంగా నీటి ప్రవాహం పెంచి పాకిస్థాన్‌లో వరద నష్టాన్ని కలిగిస్తోందని ఆరోపించారు.
‘నీటి ఉగ్రవాదం‘ ఆరోపణ..
సింధూ జలాలు రెండు దేశాల మధ్య సున్నితమైన అంశం. దీన్ని ‘వాటర్ టెర్రరిజమ్‘గా వర్ణించడం పాకిస్థాన్‌లో ప్రజాభిప్రాయాన్ని భారత వ్యతిరేక దిశగా మలచే ప్రయత్నం చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సిందూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్‌లో అయితే కరువు లేదంటే వరదలు ముంచెత్తుతున్నాయి.
పహల్గామ్ తరహా దాడులకు ప్లాన్..
ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ దాడి విస్తృత భద్రతా చర్చలకు కారణమైంది. అదే తరహా దాడులు చేస్తామని సైఫుల్లా కసూచి ప్రకటించారు. ఈ సంఘటనను మళ్లీ ప్రస్తావించి, ‘మరొక పాఠం‘ అనే పదజాలం ఉపయోగించడం, ఉగ్రవాద శ్రేణుల మానసిక యుద్ధానికి భాగం. సైఫుల్లా తన ప్రసంగంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను నేరుగా ఉద్దేశించడం, ఉగ్రవాద ముప్పు కేవలం నాన్–స్టేట్ యాక్టర్ల నుంచి కాకుండా, రాష్ట్రీయ మద్దతుతో నడుస్తుందనే అనుమానాలను బలపరుస్తోంది.
భారత్‌కు వ్యూహాత్మక పాఠాలు..
సైఫుల్లా హెచ్చరికల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. భూభాగం, జల వనరులు, సరిహద్దు రహదారులపై భద్రతా మానిటరింగ్ చేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్తాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచేలా వ్యూహాలు రచిస్తోంది. సిందూ జల ఒప్పందం రద్దును కొనసాగించడం వంటి అంశాలను పునరాలోచిస్తోంది.
సైఫులా వ్యాఖ్యలతో, భారత్‌లోని భద్రతా యంత్రాంగం సరిహద్దు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాక, పహల్గామ్ వంటి పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ప్రణాళికలను పునర్వ్యవస్థీకరించే అవసరం ఉంటుంది.