US Presidential Elections: అధ్యక్ష రేసులో ఆమెదే పైచేయి.. డిబేట్‌ తర్వాత అనూహ్యంగా పెరిగిన ఆదరణ..

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. నవంబర్‌ 5న ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం మరింత పెంచారు. గెలుపు కోసం శ్రమిస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 20, 2024 3:16 pm

US Presidential Elections

Follow us on

US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనూహ్యంగా అధ్యక్ష ఎన్నికల రేసులోకి వచ్చారు ఉపాధ్యక్షురాలు. అధ్యక్షుడు బైడెన్‌నే డమోక్రటిక్‌ పార్టీ మొదట తమ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆయన రేసునుంచి స్వయంగా తప్పుకున్నారు. దీంతో ఉపాధ్యక్షురాలు, భారత, ఆఫ్రికన్‌ సంతతికి చెందిన కమలా హారిస్‌ రేసులోకి వచ్చారు. దీంతో ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి చాలా సంతోషపడ్డారు. కమలాను ఓడించడం చాలా ఈజీ అని ప్రకటించారు. కానీ, మారుతున్న పరిణాలు ట్రంప్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. తన గెలుపు నల్లేరుపై నడకే అనుకున్న మాజీ అధ్యక్షుడు ఇప్పుడు రేసులో వెనుకబడుతున్నారు.

డిబేట్‌ తర్వాత కమలా దూకుడు..
కమలా హారిస్‌ వర్సెస్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య సెప్టెంబర్‌ 10న తొలి డిబేట్‌ జరిగింది. ఈ డిబేట్‌లోనూ కమలా మాజీ అధ్యక్షుడిపై స్పష్టమైన ఆధికత్య కనబర్చింది. దీంతో డెమోక్రటిక్‌ పార్టీకి భారీగా విరాళాలు వచ్చాయి. ఇక ట్రంప్‌కు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్, మెటా సీఈవో జూకర్‌బర్గ్‌తోపాటు చాలా మంది మద్దతు ఇస్తున్నారు. అయినా.. అధ్యక్ష రేసులో ఆయన పుంజుకోలేకపోతున్నారు. దీంతో తాజాగా హత్యాయత్నం ప్రచారం మొదలు పెట్టారని తెలుస్తోంది. గతంలో పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్‌ తృటిలో తప్పించుకున్నాడు. దీంతో అమెరికన్లు అధ్యక్షుడిగా ట్రంప్‌కు ఓటు వేసేందుకు మొగ్గు చూపారు. అయితే కమలా హారిస్‌ వచ్చాక.. మళ్లీ ట్రంప్‌ ఓటింగ్‌ శాతం పడిపోయింది. డిబేట్‌ తర్వాత మరింత పడిపోయింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ మరోమారు హత్యాయత్నం డ్రామా ఆడారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డిబేట్‌ తర్వాత ఓటింగ్‌ ఇలా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌పై డెమొక్రాట్‌ అభ్యర్థి కమలా హారిస్‌ ఆధిక్యంలో ఉన్నారు. సెప్టెంబర్‌ 11–19 మధ్య జరిగిన రాయిటర్స్‌/ఇప్సోస్‌ పోల్‌లో కమలా హారిస్, ట్రంప్‌ మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. కమలాకు 47 శాతం ఓట్లు వస్తే.. ట్రంప్‌కు 42 శాతం మాత్రమే వచ్చాయి. గతేడాది జో బైడెన్‌కు 40 శాతం మంది మద్దతు ఇచ్చారు. ఏడాది తర్వాత డెమొక్రటిక్‌ పార్టీకి మద్దతు 47 శాతానికి పెరిగింది. డిబేట్‌ తర్వాత కమలా ట్రంప్‌పై 1.4 శాతం ఆధిక్యానిక కనబర్చారు. సెప్టెంబర్‌ 19 నాటికి మర 2 శాతం ఓట్లు పెరిగాయి. దీంతో ప్రస్తుతం కమలా 49.23 శాతం ఓట్లతో దూసుకుపోతున్నారు.

– పోలింగ్‌ అగ్రిగేటర్‌ ఫైవ్‌ థర్టీఎయిట్‌ ప్రకారం, డెమొక్రాట్‌ అభ్యర్థి ఇప్పుడు దాదాపు మూడు శాతం పాయింట్లతో ముందున్నారు. సిల్వర్‌ బులెటిన్‌లో హారిస్‌ ఇప్పుడు ట్రంప్‌పై మూడు పాయింట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.