https://oktelugu.com/

Bigg Boss Telugu 8: డోర్లు తెరిచి బయటకి వెళ్ళిపోమంటూ కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్..వైరల్ అవుతున్న వీడియో!

ప్రేరణ, యష్మీ తమ శక్తికి మించి గేమ్ ఆడి, తమ సత్తా చాటే ప్రయత్నం చేయగా, వాళ్ళని ఆపేందుకు అభయ్ చాలా ప్రయత్నం చేసాడు. ఈ వీకెండ్ నాగార్జున చేతిలో ఆయనకీ బాధిత పూజ చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన బిగ్ బాస్ ని కూడా చాలా ఘోరంగా తిడుతాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 20, 2024 / 03:13 PM IST

    Bigg Boss Telugu 8(29)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తమకి ఉన్న హద్దులను మర్చిపోతున్నారు. మొదటి రెండు వారాలు మామూలుగానే టాస్కులు ఆడినప్పటికీ, ఈ వారం మాత్రం టాస్కులు ఒక్కొక్కరు మానవ మృగాలు లాగా ఆడారు. ముఖ్యంగా నిఖిల్ క్లాన్ కి చెందిన సభ్యులు, అభయ్ క్లాన్ లో ఉన్నవారిని విసిరి అవతల వేస్తూ ఆడడం అందరినీ షాక్ కి గురి చేసింది. ముఖ్యంగా మణికంఠ ని ఎన్నిసార్లు విసిరికొట్టారో మన కళ్లారా చూసాము. గేమ్ లో అంత నిమగ్నమై ఆడారు. కంటెస్టెంట్స్ అందరూ ఈ రేంజ్ లో ఆడుతుంటే, అభయ్ మాత్రం రేలంగి మావయ్య పాత్ర పోషించాడు. ఒక క్లాన్ కి చీఫ్ గా వ్యవహరిస్తూ, ఆ క్లాన్ సబ్యులకు ప్రతీ విషయం లో అండగా నిలవాల్సింది పోయి, ఎంతసేపు టాస్కు ని ఆపే ప్రయత్నం చేసారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇతని తీరుని చూస్తే ఎలాంటివాడికైనా కోపం రాక తప్పదు.

    ప్రేరణ, యష్మీ తమ శక్తికి మించి గేమ్ ఆడి, తమ సత్తా చాటే ప్రయత్నం చేయగా, వాళ్ళని ఆపేందుకు అభయ్ చాలా ప్రయత్నం చేసాడు. ఈ వీకెండ్ నాగార్జున చేతిలో ఆయనకీ బాధిత పూజ చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన బిగ్ బాస్ ని కూడా చాలా ఘోరంగా తిడుతాడు. అయితే కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమో లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు. డోర్లు ఓపెన్ చేసి బయటకి వెళ్లిపోండి అన్నాడు. అసలు ఆ ప్రోమో మొత్తంలో ఏముందో ఒకసారి చూద్దాం. నిన్న, మొన్న జరిగిన టాస్కులలో నిఖిల్ చాలా వయొలెంట్ గా ఆడిన సంగతి అందరికీ తెలిసిందే. నాగ మణికంఠ ని విసిరి అవతల వేసాడు. రెండవ రోజు కూడా మణికంఠ ని అలాగే అనేక సందర్భాలలో విసిరాడు. దీనికి మణికంఠ బాధపడుతూ నిఖిల్ తో మాట్లాడుతూ ఉంటాడు.

    మధ్యలో నిఖిల్ ‘ఎందుకు అలా అరుస్తున్నావు..నేను ఎలా మాట్లాడుతున్నాను, నువ్వు ఎలా మాట్లాడుతున్నావ్’ అని అంటాడు. అప్పుడు మణికంఠ ‘నాకు చాలా కోపం వస్తుంది. ఏమి చేయమంటావ్. నిన్న, మొన్న నువ్వు నీలాగా లేవు, గేమ్ లో మునిగిపోయి దారుణంగా ప్రవర్తించావ్’ అని అంటాడు. అప్పుడు నిఖిల్ బాధపడడం చూసి అతనిని ప్రేమగా కౌగలించుకుంటాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సీజన్ లో క్లాన్స్ అనేవి అతి ముఖ్యమైన భాగం..ఇది బిగ్ బాస్ ఇల్లు, ఇక్కడ కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. మీలో ఎవరికైనా నేను బిగ్ బాస్ కంటే ఎక్కువ అనిపిస్తే ఇప్పుడే వెళ్లిపోవచ్చు’ అంటూ డోర్లు తీస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది నేటి ఎపిసోడ్ లో చూడాలి. బిగ్ బాస్ అంత సీరియస్ అవ్వడానికి కారణం అభయ్ నోటి దూల వల్లేనా, లేకపోతే హౌస్ లో ఇంకా ఏమైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.