Homeఎంటర్టైన్మెంట్Jani Master: నా కెరీర్ ని సర్వనాశనం చేయాలనుకున్న వారిని వదిలిపెట్టను..నిజాయితీగా పోరాడి బయటి వస్తా...

Jani Master: నా కెరీర్ ని సర్వనాశనం చేయాలనుకున్న వారిని వదిలిపెట్టను..నిజాయితీగా పోరాడి బయటి వస్తా – జానీ మాస్టర్

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని నిన్న గోవా లో పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 4 గంటలకు జానీ మాస్టర్ ని పోలీసులు తీసుకొచ్చి రాజాం నగర్ పోలీస్ స్టేషన్ సుమారు 10 గంటల వరకు విచారించారు. ఈ విచారణలో జానీ మాస్టర్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘తనపై చాలా మంది గత కొంతకాలంగా కుట్రలు చేస్తూనే ఉన్నారు. నేను వారిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేడు వాళ్ళు నాపై ఇంతటి దారుణమైన ఆరోపణలు చేయించి కేసు పెట్టించారు. కేసు పెట్టిన అమ్మాయి కూడా వాళ్ళ బలవంతం చేయడం వల్లే పెట్టింది. నేను ఆ అమ్మాయిని ఎప్పుడూ వేదించలేదు, ఆమెపై నేను అత్యాచార ప్రయత్నం చేశాను అనేది పూర్తిగా అవాస్తవం.

న్యాయంగానే పోరాడి, నిజాయితితో బయటకి వస్తాను. నన్ను ఇలా అన్యాయంగా కేసు లో ఇరికించిన వారిని, నా కెరీర్ ని సర్వనాశనం చేయాలని అనుకున్న వారిని వదిలి పెట్టను’ అని పోలీసులతో అన్నాడట. జానీ మాస్టర్ మాటలను రికార్డు చేసుకున్న పోలీసులు, ఆయన్ని ఉప్పరపల్లి కోర్టు కి తరలించారు. ఇప్పుడు కోర్టు జానీ మాస్టర్ విషయం లో ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఆసక్తి కరంగా మారింది. శ్రేష్టి వర్మ అనే యంగ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులు చేసాడని, తనని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడు అంటూ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యం లో పోలీసులు జానీ మాస్టర్ పై పోస్కో చట్టం క్రింద కేసు ని నమోదు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టి గోవా లో పట్టుకున్నారు. ‘పోస్కో’ చట్టం చాలా కఠినమైనది . జానీ మాస్టర్ తప్పు చేసాడు అనేది రుజువు అయితే ఆయనకు 10 ఏళ్ళ జైలు శిక్ష కచ్చితంగా పడుతుంది. ఒకవేళ జానీ మాస్టర్ నిజంగా అలాంటి పనులు చేసుంటే, కచ్చితంగా అతనికి శిక్ష పడాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క శ్రేష్టి వర్మ కి ఇండస్ట్రీ మొత్తం సపోర్టు గా నిల్చింది.

అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాల్లో ఆమెకు కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇస్తాను అని భరోసా ఇచ్చినట్టు కూడా వార్తలు వినిపించాయి. ఈ సంఘటన కూడా వివాదాస్పదం అయ్యింది. నిజానిజాలు తేలకుండా అల్లు అర్జున్ ఇలాంటి పనులు చేస్తే జానీ మాస్టర్ తప్పు చేసినట్టు నిర్ధారించినట్టే కదా. అతనికి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసాడు, మంచి రిలేషన్ కూడా ఉంది. అయినప్పటికీ అల్లు అర్జున్ ఇలా ఎందుకు చేసాడు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. లీగల్ గా పోరాడి, నిజాయితీగా బయటకి వస్తాను, నన్ను ఇలా ఇరికించిన వారిని వదిలిపెట్టను అంటూ జానీ మాస్టర్ వెల్లడించారు. ప్రస్తుతం జానీ మాస్టర్ ని ఉప్పరపల్లి కోర్టుకి తీసుకొచ్చారు.

 

ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ LIVE | Jani Master @ Upparpally Court - TV9

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version