కరోనా వైరస్ నియంత్రణ దిశగా అమెరికాలోని మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ రూపొందిందిన కోవిడ్ టీకాకు అమెరికా అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు ఆ దేశ ఆహార, ఔషధ నిర్వహణ విభాగం ప్రకటన జారీ చేసింది. అమెరికాలో ఇప్పటికే కరోనా కారణంగా ఐదు లక్షలకు పైగా మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో టీకా పంపిణీ మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి సమయంలోనే జాన్సన్ అండ్ జాన్సన్ టీకాను అనుమతి లభించడం విశేషం.
Also Read: కరోనా టీకా అమ్మకాలు షురూ..రేటు ఫిక్స్ చేసిన కేంద్రం.. ఖరీదు ఎంతంటే?
కరోనా నుంచి జె అండ్ జే టీకా సమర్థవంతమైన రక్షణ కల్పిస్తోంది. మూడు వేర్వేరు ఖండాల్లో ప్రయోగించి ఫలితాలను అధ్యయనం చేసిన తరువాతే.. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లోనూ ఈ టీకా 85శాతం రక్షణ కల్పిస్తుందని తేలింది. మార్పులు కరోనా వైరస్ లలో దక్షిణాఫ్రికా రకంపై కూడా దీని ప్రభావం ఆశాజనకంగా ఉంది.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. వచ్చే నెల 1 నుంచి వాళ్లకు కరోనా వ్యాక్సిన్..?
కరోనా వైరస్ నిరోధానికి ఇతర టీకాలు రెండు డోసులు తీసుకోవాల్సి ఉంది. కానీ కేవలం ఒకేఒక్క డోసుతో ఈ టీకా ఆ స్థాయిలో పనిచేయడం విశేషమని.. ఎఫ్ ఢీఏ పేర్కొంది. ఈ సందర్భంగా అమెరికా అంటువ్యాధుల విభాగం నిపుణుడు ఆంటోని ఫౌచీ మాట్లాడుతూ.. అధిక రక్షణ సామర్థ్యం కలిగిన టీకాలనే మేం వాడుకలోకి తెస్తున్నామని అంటున్నారు.
మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్
ఈ టీకా సోమవారం నాటికి అమెరికాలోని పలు రాష్ట్రాల్లో సరఫరా కానున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా అమెరికాలో మార్చి చివరినాటికి 2 కోట్ల డోసులను ఉత్తత్తి చేయాలని జే అండ్ జే సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ ఇప్పటికే యూరప్లోనూ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకుంది. ఈ ఏడాది చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల డోసుల ఉత్పత్తే లక్ష్యంగా పెట్టకుంది. ఈ టీకా తొలిసారిగా గురువారం నాడు బహ్రెయిన్లో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందింది. అమెరికాలో ఇప్పటికే ఫైజర్.. బయో ఎన్ టెక్ మోడెర్నా టీకాలు వినియోగిస్తున్న విషయం తెలిసిందే..