ఇది ట్రైలరే: ముందు ముందు తీవ్ర పరిణామాలు ఉంటాయి..!

భారత సుసంపన్నుల్లో ముఖేశ్ అంబానీది నెంబర్ వన్ స్థానం. ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెన్ ధనవంతుల్లో ఆయన ఒకరిగా నిలిచారు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించగల వ్యక్తిగా పేరున్న ఆయన ఎంతో ఓర్పుగా ఉంటారు. ఆయన చేసే ప్రతీ వ్యాపారంలో విజయకేతనం ఎగురవేస్తూ ముందుకు వెళ్తున్నారు. రిలయన్స్ పెట్రోల్, టెలికాం రంగంలో సక్సెస్ గా దూసుకెళ్లడంతో పాటు సామాన్యులకు అందుబాటులోకి మొబైల్ సర్వీసులను తీసుకొచ్చారు. అయితే ఆయన ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కారు. తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న […]

Written By: NARESH, Updated On : February 28, 2021 1:43 pm
Follow us on

భారత సుసంపన్నుల్లో ముఖేశ్ అంబానీది నెంబర్ వన్ స్థానం. ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెన్ ధనవంతుల్లో ఆయన ఒకరిగా నిలిచారు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించగల వ్యక్తిగా పేరున్న ఆయన ఎంతో ఓర్పుగా ఉంటారు. ఆయన చేసే ప్రతీ వ్యాపారంలో విజయకేతనం ఎగురవేస్తూ ముందుకు వెళ్తున్నారు. రిలయన్స్ పెట్రోల్, టెలికాం రంగంలో సక్సెస్ గా దూసుకెళ్లడంతో పాటు సామాన్యులకు అందుబాటులోకి మొబైల్ సర్వీసులను తీసుకొచ్చారు. అయితే ఆయన ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కారు. తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న విషయం ఓ సంఘటనతో బహిర్గతమైంది. అసలేం జరిగిందంటే..?

భారతదేశంలో ఆర్థిక సంపన్నుడైన ముఖేష్ అంబానీ ముంబయ్ లోని ఇల్లు అంటిలియా ముందు కొందరు పేలుడు పదార్థాలు ఉంచారు. ఓ స్కార్పియో కారులో 20 జిలిటెన్ స్టిక్స్ను ఉంచిన వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలతో పాటు కొన్ని కార్ల నంబర్ ప్లేట్లు ఉన్నాయి. ఈ కార్ల నెంబర్లు అంబానీ భద్రత సిబ్బందికి చెందినవిగా పోలీసులు గుర్తించారు.

జైషుల్ అనే హిందూ ఉగ్రవాద సంస్థ ఇది తమ పనేనని ప్రకటించుకుంది. బిట్ కాయిన్ రూపంలో తమకు అడిగినంతా డబ్బు చెల్లించాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. ఓ టెలిగ్రామ్ మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అలాగే అందులో ముఖేష్ తో పాటు ఆయన భార్య నీతూ అంబానీని కూడా హెచ్చరిస్తూ ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఆ ఉగ్రవాద సంస్థ ఇది ట్రైలరేనని, మేం అడిగిన డబ్బు చెల్లించకపోతే ముందుముందు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. అంతేకాకుండా కొన్ని రోజుల కిందట ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర పేలుడుకు కూడా తామే బాధ్యులమంటూ ప్రకటించుకుంది. మీకు చేతనైతే మమ్మల్ని ఆపండంటూ అక్కడుంచిన లేఖలో ఆ సంస్థ తెలిపింది.