Germany : భారతీయ యువతకు ఆ దేశం రెడ్ కార్పెట్.. భారీగా జీతంతో ఉద్యోగాలు.. తక్కువ ధరకే వసతులు..

సొంతవారికి ఉద్యోగాలు దొరకడం లేదంటూ విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో కొందరు భారతీయులు ఆయా దేశాల నుంచి తిరిగి ఇండియాకు చేరుకుంటున్నారు. కానీ ఇలాంటి సమయంలో ఓ దేశం రా.. రమ్మని అంటోంది. ముఖ్యంగా భారతీయ యువతను ఆకర్షించేందుకు పలు పథకాలను ప్రవేశపెడుతోంది. ఇంతకీ ఆ దేశం ఏదో తెలుసా?

Written By: Srinivas, Updated On : October 21, 2024 11:50 am

Germany

Follow us on

Germany : చదువుకు తగిన ఉద్యోగం ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో పనిచేయడం వల్ల డబ్బు బాగా సంపాదించాలని భావిస్తారు. భారతీయ నైపుణ్యతకు విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంది. అందుకే చాల దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో భారీతీయులే కీలకంగా ఉంటున్నారు. అమెరికాలోని రాజకీయాల్లో సైతం ఇండియన్స్ పాగా వేశారంటే మనవాళ్ల సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మధ్య కొన్ని దేశాలు వలసవాదులను కట్టడి చేస్తుంది. తాజాగా కెనడాలో ఈ పరిస్తితి మరీ తీవ్రమైంది. సొంతవారికి ఉద్యోగాలు దొరకడం లేదంటూ విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో కొందరు భారతీయులు ఆయా దేశాల నుంచి తిరిగి ఇండియాకు చేరుకుంటున్నారు. కానీ ఇలాంటి సమయంలో ఓ దేశం రా.. రమ్మని అంటోంది. ముఖ్యంగా భారతీయ యువతను ఆకర్షించేందుకు పలు పథకాలను ప్రవేశపెడుతోంది. ఇంతకీ ఆ దేశం ఏదో తెలుసా?

యూరప్ దేశమైన జర్మనీ విదేశాల నుంచి యువతను ఆకర్షిస్తోంది. ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు భారీగా కార్మికులను ఆహ్వానిస్తోంది. ఆదేశంలో వృద్ధాప్యవాదులు ఎక్కువగా పెరిగిపోవడంతో పాటు యువత తక్కువైంది. దీంతో కొన్ని సంస్థల్లో పనులు చేయడానికి కార్మికులు దొరకడం లేదు. దీంతో విదేశాల నంచి వచ్చే వారికి రెడ్ కార్పెట్ వేస్తోంది. ఇందులో భాగంగా ఇక్కడి కార్మిక శాఖ మంత్రి హ్యుబెర్టస్ హీల్ తో పాటో మరికొంత మంది ప్రభుత్త ప్రతినిధులు భారతదేశానికి వచ్చి కార్మికులను ఆహ్వానించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

హెల్త్ కేర్, ఇంజనీరియంగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేయాలని అనుకునే ఇండియన్ యువత నుంచి జర్మనీ దరఖాస్తులు కోరుతోంది. ఆయా రంగాల్లో జర్మనీల్లో నిపుణులు కొరత తీవ్రంగా ఉంది. మంచి నైపుణ్యం ఉంటే ఇక్కడ రాణించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇక్కడ పనిచేసే భారతీయ ఉద్యోగులకు సరాసరి నెలకు 5,400 యూరోలు చెల్లించే అవకాశం ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.4,94,037.

అయితే జీతానికి తగిన ఖర్చులు ఉంటాయని కొందరు అనుకుంటారు. కానీ మిగతా దేశాలతో పోలిస్తే జర్మనీలో ఎక్స్ పెండేచర్ తక్కువ. ఇక్కడ యూనివర్సిటీల్లో ఉండేందుకు నెలకు 200 నుంచి350 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా గది అద్దె తీసుకున్నా 350 నుంచి 400 వరకు ఖర్చు అవుతుంది. అపార్ట్ మెంట్లలో ఉండాలనుకునేవారు 800 నుంచి 1400 చెల్లించవచ్చు. వీటితో పాటు జర్మనీలో ఆహార ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి. సాధారణంగా ఆహార ఖర్చు 200 నుంచి 300 వరకు ఉంటుంది. ఇతర ఖర్చులు మొత్తం 100 వరకు అవుతాయి.

మొత్తంగా 2,000 వరకు ఖర్చులు తీసేసినా మిగతా డబ్బును సేవ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికా, కెనడా వంటి ప్రాంతాలతో పాటు మరికొన్ని చోట్ల ఐటీ రంగానికి గడ్డు పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో జర్మనీ దేశం సాదరంగా ఆహ్వానించడంపై ఆసక్తి చర్చ సాగుతోంది. అయితే జర్మనీ వెళ్లేందుకు ఈజీ వీసా సదుపాయం కూడా కల్పించడానికి డిజిటల్ వీసాను అందుబాటులోకి తేనున్నారు. అలాగే కార్మికులకు కల్చరల్ ఇంటిగ్రేషన్ వంటి వాటితో ఆకర్షిస్తుంది.