Sleeping : నిద్రలో పదేపదే ఎడమవైపుకే తిరిగి పడుకుంటున్నారా? ఇంతకీ ఏ వైపు పడుకోవాలి?

ఆకలికి రుచి నిద్రకు చోటు తెలియదట. ఇక ఏ వయసు వారైనా 7 గంటల నుంచి 9 గంటల వరకు కచ్చితంగా నిద్రపోవాల్సిందే. అప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండటం సాధ్యం అవుతుంది. మంచి నిద్ర శరీరానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి ముఖ్యమే.

Written By: Swathi Chilukuri, Updated On : October 21, 2024 8:39 pm

Sleeping

Follow us on

Sleeping :  అలిసిపోతే సొమ్మసిల్లి నిద్రపోవడం కామన్. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిండా నిద్ర అవసరం. నిద్ర ఎంత అవసరమో ఏ వైపు తిరిగి పడుకుంటామో కూడా అంతే ముఖ్యం. ఇక డాక్టర్లు మాత్రం ఎడమవైపు తిరిగిపడుకోవాలి అంటున్నారు. మరి దీనికి కారణాలు ఏంటి? ఎందుకు ఇలా చెబుతున్నారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకలికి రుచి నిద్రకు చోటు తెలియదట. ఇక ఏ వయసు వారైనా 7 గంటల నుంచి 9 గంటల వరకు కచ్చితంగా నిద్రపోవాల్సిందే. అప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండటం సాధ్యం అవుతుంది. మంచి నిద్ర శరీరానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి ముఖ్యమే.

గాఢనిద్రలో ఉంటే ఏ వైపు చేయి వెళుతుంది. కాలు ఎక్కడ పెడతాం. ఇలాంటివేవీ అసలు అర్థం కాదు. కానీ నిద్రించే విధానం శారీరక ఆరోగ్యానికి పెంచడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం నిద్రపోతున్నా సరే కొన్ని అవయవాలు మాత్రం పనిచేస్తుంటాయి. అయితే వీటికి అనుకూలమైన ఎడమ వైపు పడుకోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. ఎడమ వైపుకు పడుకుంటే అనేక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చట. ఎందుకంటే ఎడమ వైపు నిద్రపోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు అవుతుంది. ఆహారాన్ని గ్రహించే ప్రేగుల కదలిక కూడా మెరుగుపడుతుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు బయటకు వెళ్తాయి.

ఎడమ వైపుకు నిద్రించడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోకుండా ఆపుతుంది. తద్వారా తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆహారంలోని వ్యర్థాలన్నీ పేగుల సిస్టమ్ ద్వారా బయటకు వెళ్తాయి. శరీరంలో కాలేయం, మూత్రపిండాలలోనే వ్యర్థాలు, టాక్సిన్స్ ఎక్కువగా పేరుకుపోతాయి. అయితే ఎడమ వైపుకు నిద్రిస్తే ఈ అవయవాలలో పేరుకుపోయిన వ్యర్థాలు, టాక్సిన్స్ ఉదయాన్నే బయటకు వెళ్తాయి.

ఎడమ వైపుకు నిద్రపోవడం వల్ల కడుపు, క్లోమం సహజంగా కలుస్తాయి. ఇది ఆహారం సజావుగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఈ వైపు పడుకుంటే యాసిడిటీని కలిగించే కడుపులోని ఆమ్లం ఆహార గొట్టం ద్వారా పైకి రాదు. తద్వారా గుండెల్లో మంట కూడా రాదు. కాలేయం, పిత్తాశయం సహజంగా కలుస్తాయి. జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. సో ఆహారం జీర్ణం అవడానికి, అసౌకర్యాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

ఎడమవైపు పడుకుంటే కడుపులో రిలీజ్ అయ్యే యాసిడ్స్ కొవ్వును సులభంగా కరిగిస్తాయి. దీనివల్ల శరీరంలో, కాలేయంలో కొవ్వు పేరుకోదు. నిద్రలో గురక పెడతారా? మీరు ఎడమ వైపుకు తిరిగి పడుకుంటే శ్వాస మార్గాలు తెరిచి ఉంటాయి. దీంతో గురక కూడా రాదు. ఈ వైపు పడుకోవడం వల్ల రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఎడమవైపు నిద్ర అంటున్నాయి అధ్యయనాలు. వెన్నెముకపై ఒత్తిడి పెద్దగా ఉండదు. దీనివల్ల వెన్నునొప్పి తగ్గుతుంది. గర్భిణులు (20 వారాల తర్వాత), ఆస్తమా, శ్వాస ఇబ్బందులు ఉన్నవారు, తీవ్రమైన వెన్నెముక సమస్య ఉన్నవారు ఎడమవైపుకు నిద్రపోకూడదు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..