Japanese live longer: ప్రపంచంలో అత్యధికంగా వృద్ధులు కలిగిన దేశం జపాన్ గా పేర్కొంటారు. ఇక్కడ ఉన్న వారంతా ఆరోగ్యంగా ఉంటూ ఎక్కువ కాలం జీవిస్తారు. ప్రస్తుత కాలంలో మనుషులు 60 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. కొందరు 40 తరువాత అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ జపాన్ లో మాత్రం వృద్ధులు సైతం ఆరోగ్యంగ కనిపిస్తూ ఉంటారు. అందుకు వారు పాటిస్తున్న ఆరోగ్య విధానాలే అని చెప్పవచ్చు. ప్రతిరోజూ ఒక క్రమ పద్ధతిలో వారు ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉంటారు. అందుకే వారి ఆయుష్షు పెరుగుతుంది. ఇంతకీ జపానీయులు ఎలాంటి ఆహారం తీసుకుంటారు? ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేస్తారు?
జపాన్ లో వృద్ధులు సైతం ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాన కారణం వారు తీసుకునే ఆహరమే. వీరు ఎక్కువగా ఉడకబెట్టిన ఆహారాన్ని తీసుకుంటారు. వీరు కూరగాయలను సైతం ఉడకబెట్టిన తరువాతే కర్రీగా చేసుకుంటారు. ఇక్కడి వారు ఎక్కువగా కూరగాయలు మాత్రమే తీసుకుంటారు. అవి ప్రోటీన్లు ఎక్కువగా ఉండేవాటికే ప్రాధాన్యత ఇస్తారు. ఇక మాంసాహారం తీసుకోవాలనుకునేవారు సీ ఫుడ్ కు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. సముద్రంలో దొరికే చేపల నుంచి ఇతర జలచరాలను తింటూ ఉంటారు. ఇవి ఎక్కువగా ఫ్యాట్ ను తీసుకురాలేవు. అలాగే వీటిలో కార్బో హైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల శరీరానకి మేలు చేస్తాయి.
జపనీయులు ఆరోగ్యంపై ఎక్కువగా కేర్ తీసుకుంటారు. దాదాపు ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరిగా చేస్తారు. ప్రతిరోజూ ధ్యానం చేసిన తరువాతే మిగతా పనులను ప్రారంభిస్తారు. సాయంత్రం పడుకునే సమయంలోనూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఎక్కువగా శారీరకంగా శ్రమ ఉండేలా చూసుకుంటారు. అంటే చిన్న చిన్న పనుల కోసం నడవడం, పరుగెత్తడం వంటివి చేస్తారు. ఇక ఆరోగ్యానికి స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు.
ఆరోగ్య సూత్రాల్లో భాగంగా జపనీయులు ఎక్కువగా ప్రశాంతంగా ఉండేలా చూస్తారు. అంటే ప్రకృతిలో ఎక్కువగా ఉండడం, పార్కెల్లో సమయాన్ని వెచ్చించడం వంటివి చేస్తారు. అలాగే ఆరోగ్యకరమైన అలవాట్లు మాత్రమే చేసుకుంటారు. ఎటువంటి వ్యసనాల బారిన పడకుండా ఆరోగ్యకరమైన అలవాట్లు మాత్రమే చేసుకుంటారు. రెగ్యులర్ గా హెల్త్ చెకప్ లు చేసుకుంటూ ఎప్పటికప్పుడు అవసరమైన ఆరోగ్య కర పద్ధతులు పాటిస్తారు.
ఇక వీరు ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాన కారణం.. రిలేషన్ షిప్ మెయింటేన్ చేయడం. జపనీయులు ఎక్కువగా కుటుంబంతో ఉండడానికి ఇష్టపడుతారు. వారం పాటు ఎంత పని ఉన్నా … ఒకరోజు మాత్రం కుటుం సభ్యులతో గడపాలని నిబంధన పెట్టుకుంటారు. దీంతో ఒక్కరోజైనా ఉల్లాసంగా ఉంటారు. ఇలా ఉండడం వల్ల వారిలో ఉన్న ఒత్తిడి, ఇతర బాధలు మాయమైపోతాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు చాలా సార్లు కుటుంబ సభ్యులను కలుసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు దూరమవుతారని వారి ఆలోచన. ఈ విధంగా ప్రత్యేక పద్ధతులను పాటించడం వల్ల జపనీయులు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. ముఖ్యంగా వీరు డబ్బు కంటే ఎక్కువ హ్యుమన్ లైఫ్ పై ఫోకస్ చేయడం వల్ల వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది.