https://oktelugu.com/

Israel: లెబనాన్‌ ఆక్రమణే ఇజ్రాయెల్‌ లక్ష్యమా.. మధ్య ప్రాచ్యంలో యుద్ధం అందుకేనా?

పశ్చిమాసియాలో ఉగ్రవాద సంస్థ అయిన హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభించింది. పాలస్తీనాలోని హమాస్‌ స్థావరాలను ధ్వంసం చేసింది అయితే హమాస్‌ చీఫ్‌ హత్యతో యుద్ధం ఇరాన్, లెబనాన్‌కు పాకింది. ఇజ్రాయెల్‌ ఆలోచన చూస్తుంటే లెబనాన్‌ను ఆక్రమించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 27, 2024 / 11:41 AM IST

    Israel(2)

    Follow us on

    Israel: పశ్చిమాసియా దేశమైన పాలస్తీనా, ఇజ్రాయెల్‌ మధ్య అధిపత్య పోరాటం ఏళ్లుగా సాగుతోంది. పాలస్తీనాను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్‌ తరచూ సైనిక చర్యలకు పాల్పడుతోంది. మరోవైపు పాలస్తీనా ఇజ్రాయెల్‌కు తలొగ్గడం లేదు. ఈ క్రమంలోనే పాలస్తీనాలో హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ ఏర్పడింది. ఇజ్రాయెల్‌ నుంచి పాలస్తీనాకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా ఇది పోరాడుతోంది. ఏడాది క్రితం హమాస్‌.. ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసింది. ఆదేశ పౌరులను కిడ్నాప్‌ చేసింది. దీంతో ఆగ్రహించిన ఇజ్రాయెల్‌ తమ దేశ పౌరులను విడిపించడమే లక్ష్యంగా సైనిక చర్య చేపట్టింది. ఈ క్రమంలో పాలస్తీనాలోని హమాస్‌ స్థావరాలపై దాడుల చేసింది. విధ్వంసం సృష్టించింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేల మంది చనిపోయారు. అయితే బందీలను విడిపించిన ఇజ్రాయెల్‌.. హమాస్‌ అంతమే లక్ష్యంగా దాడులు కొనసాగించింది. ఈక్రమంలో ఇరాన్‌లో ఉన్న హమాస్‌ చీఫ్‌ను రహస్య ఏజెంట్‌ ద్వారా ముట్టుపెట్టింది. దీంతో తమ దేశంలో ఉన్న హమాస్‌ చీఫ్‌ను హత్య చేయడంపై ఇరాన్‌ మండిపడింది. దీనికి ప్రతీకారం తప్పదని ప్రకటించింది. మరోవైపు హమాస్‌ కూడా ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈతరుణంలో హమాస్‌కు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మద్దతు ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్‌ ఇప్పుడు దాడులను లెబనాన్‌పై కొనసాగిస్తోంది. మొన్నటి వరకు హమాస్‌ అంతమే లక్ష్యమని ప్రకటించిన ఇజ్రాయెల్‌.. ఇప్పుడు హెజ్‌బొల్లాను అంతం చేయడమే లక్ష్యమంటోంది. మెరుపు దాడులతో విరుచుకుపడుతోంది. దీనికి ప్రతిగా హెజ్‌బొల్లా కూడా రాకెట్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేస్తోంది. లెబనాన్‌పై వైమానిక, క్షిపిణి దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ వాటిని మరింత తీ్ర‘వం చేసింది. భూతల దాడులకూ సిద్ధమవుతోంది.

    ఇజ్రాయెల్‌ ఉన్మాద చర్యలు..
    హెజ్‌బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్‌ పేజర్లు పేల్చడం, వాకీటాకీలు పెల్చడం ద్వారా హెజ్‌బొల్లాను మరింత రెచ్చగొట్టింది. హెజ్‌బొల్లాకు ఇజ్రాయెల్‌పై ఆగ్రహం ఉన్నా.. అ దేవం దాడి చేసే వరకు ఎలాంటి చర్యలకు దిగలేదు. కానీ, వరుస దాడులతో ఇజ్రాయెల్‌ దాడులను తిప్పి కొట్టేందుకు శక్తివంతమైన ఖాదర్‌–1 క్షిపణితో తొలిసారి ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌అవీవ్‌ నగరంపై దాడిచేసింది. ఇది ఖండాంతర క్షిపిణి కాదు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్‌ ఉలిక్కిపడింది. పది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు హెజ్‌బొల్లా క్షిపిణి దాడిని తిప్పికొట్టినట్లు నెతన్యాహూ ప్రకటించారు. కానీ, 20 లక్షల మంది ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై దాడులను మరింత ఉధ్రృతం చేసింది.

    హెజ్‌బొల్లాకు ఇరాన్‌ సహకారం..
    ఇజ్రాయెల్‌ భీకర దాడుల నేపథ్యంలో.. ఇప్పుటి వరకు 300 కిలోమీటర్ల క్షిపుణులతోనే దాడిచేసిన హెజ్‌బొల్లా ఇప్పుడు భారీ మొత్తంలో క్షిపుణులను, పేలుడు పదార్థాలను మోసుకెళ్లే ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇరాన్‌ సహకారం అందిస్తున్నట్లు సమాచారం అదే జరిగితే ఇజ్రాయెల్‌లోని గాజా, వెస్ట్‌ బాంక్‌ ప్రాంతాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. మరోవైపు మద్యధరా, ఎర్ర సముద్రాల్లో అమెరికా, బ్రిటన్‌ ఇజ్రాయెల్‌కు రక్షణగా నిలుస్తున్నాయి. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాలకు చిక్కకూడదన్నదే ఇరాన్‌ లక్ష్యం. ఇజ్రాయెల్‌ దురాక్షమణ నుంచి విముక్తి క ఓసమే పాలస్తీనాలోని హమాస్, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ప్రయత్నిస్తున్నాయి. దీనిని గుర్తించకుండా ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యాలు మద్దతు ఇస్తున్నాయి.

    హైతీ దాడులు..
    ఇజ్రాయెల్‌ దాడులకు నిరసనగా ఎమెన్‌లోని హైతీ సాయుధులు మధ్యధరా–ఎర్ర సముద్రంలో ఓడలపై దాడుల చేస్తున్నారు. దీంతో సూయిజ్‌ కాలువ ద్వారా అరేబియా సముద్రంలోకి ప్రవేశించే నౌకలకు ఆటంకం కలుగుతోంది. అయినా ఇజ్రాయెల్‌ మాత్రం యుద్ధం ఆపడం లేదు. వరుస పరిణామాలను గమనించిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ యుద్ధ విరామానికి చర్యలు చేపట్టాయి. 21 రోజులపాటు యుద్ధం ఆపేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి చేస్తున్నాయి. కానీ నెతన్యాహూ మాత్రం యుద్ధం ఆపడం తమ చేతుల్లో లేదని ప్రకటించారు. మరోవైపు లెబనాన్‌లోకి చొచ్చుకుపోయేందుకు ఇజ్రాయెల్‌ భూతల దాడులకు సిద్ధమవుతోంది.

    ఆయుధాల కోసమేనా..
    అయితే యుద్ధ విరామం వెనుక ఆయా దేశాలు దురాలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లెబనాన్‌ను పూర్తిగా ఆక్రమించుకోవడమే లక్ష్యంగా విరామం తర్వాత యుద్ధం చేయాలని భావిస్తున్నాయి. ఇందుకు అవసరమైన ఆయుధాలు సమకూర్చుకునేందుకు యుద్ధ విరామం కోసం ప్రనయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో గాజా మారణకాండకు ఏడాది అవుతుంది. కొద్ది రోజుల్లోనే హమాస్‌ను మట్టుపెడతామన్న ఇజ్రాయెల్‌కు ఇది సాధ్యం కాలేదు. ఇప్పుడు హెజ్‌బొల్లాను లొంగదీసుకుంటామంటోంది. లెబనాన్‌ను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ, ఈ చర్యలు కూడా ఫలించవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇరాన్‌ నేరుగా యుద్ధంలోకి దిగితే ఇజ్రాయెల్‌కు ఇబ్బందులు తప్పవన్నప్రప్రాయం వ్యక్తమవుతోంది.