Homeఅంతర్జాతీయంGautam Adani: మోడీకి అసలు పరీక్ష పెట్టిన ట్రంప్‌.. అదానీని అప్పగిస్తాడా?

Gautam Adani: మోడీకి అసలు పరీక్ష పెట్టిన ట్రంప్‌.. అదానీని అప్పగిస్తాడా?

Gautam Adani: భారత దేశీయ దిగ్గజ వ్యాపారి గౌతమ్‌ అదానీ. దేశంతోపాటు విదేశాల్లోనూ ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి. 2014 తర్వాత నుంచే ఈ గుజారత్‌(Gujarath) వ్యాపారి వెలుగులోకి వచ్చారు. వ్యాపార సామ్రాజ్యం విస్తరించారు. ఒక దశలో ప్రంపంచ కుబేరుల టాప్‌ 10 జాబితాలో చేరారు. ఈ తరుణంలో అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌(Hinden barg) సంస్థ అదానీ కంపెనీలోని లోపాలను బయటపెట్టింది. ఆయన తన కంపెనీ షేర్లను పెంచుకోవడానికి సంపదను ఎక్కువగా చూపుతున్నారని ఆరోపించింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. భారత స్టాక్‌ మార్కెట్‌లో అదానీకి చెందిన కోట్ల సంపద ఆవిరైంది. భారీగా నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో సుప్రీం కోర్టు నియమించిన కమిటీ విచారణ జరిపి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

బైడెన్‌ సర్కార్‌ అభియోగాలు..
ఆరు నెలల క్రితం బైడెన్‌(Biden) సర్కార్‌ కూడా గౌతమ్‌ అదానీతోపాటు ఆయన సోదరుడి కుమారుడు సాగర్‌ అదానీ లంచం తీసుకున్నట్లు అభియోగాలు మోపింది. ఈమేరకు కేసు నమోదు చేసింది. అది దేశీయంగా వ్యాపార, రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్చంజ్‌ కమిషన్‌(యూఎస్‌ ఎస్‌ఈసీ) సమన్లు జారీ చేసింది. సౌర విద్యుత్‌ కాంట్రాక్టులను పొందడానికి రూ.2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై వివరాణ ఇవ్వాలని కోరింది. ఇదే సమయంలో విచారణకు సహకరించాలని ట్రంప్‌(Trump) సర్కార్‌ భారత్‌ను కోరింది. ఈమేరకు హోంశాకతో సంప్రదింపులు జరిపినట్లు యూఎస్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరూ అమెరికాలో లేరని, భారత్‌లో ఉన్నట్లు తెలిసిందని పేర్కొంది. అయితే అమెరికా ఆరోపణలను అదానీ గ్రూప్‌ గతంలోనే ఖండించింది. అయినా దీనిపై న్యూయార్క్‌ డిస్ట్రిక్‌ కోర్టులో విచారణ జరుగుతోంది.

మోదీకి పరీక్ష..
తాజా పరిణామాలో మోదీ(Modi)కి ఓ పరీక్షే. ఇటీవలే అమెరికా వెళ్లొచ్చిన మోదీ అక్కడ దాక్కున్నవారిని అప్పగించాలని ట్రంప్‌ను కోరారు. భారత్‌లో నేరాలు చేసి.. అమెరికా(America)లో ఉంటున్నారని తెలిపారు. దీనిపై ట్రంప్‌ కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అప్పగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా న్యూయార్క్‌(Newyark) జిల్లా కోర్టు గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీ విచారణకు సహకరించాలని కోరింది. పరోక్షంగా ఇద్దరినీ తమకు అప్పగించాలని పేర్కొంది. మరి మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

కేసు ఏంటి?
భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్‌ డాలర్లు అంటే రూ.2,200 కోట్లు లాంచాలు ఇచ్చేందుకు గౌతమ్‌ అదానీ సిద్ధమయ్యారని న్యూయార్క్‌ కోర్టులో కేసు నమోదైంది. లాభదాయకమైన సోలార్‌ పవర్‌(Solar power) సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు లంచాలు ఇవ్వజూపారని అభియోగం మోసింది. ఈమేరకు అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీ, అజూర్‌ పవర్‌ గ్లోబల్‌ ఎగ్జిక్యూటివ్‌ సిరిల్‌ కాబనేస్‌లపై అభియోగాలు మోపింది. అదానీ గ్రీన్‌ సంస్థపై మోపిన ఆరోపణలు సంస్థమొత్తం వ్యాపారంలో 10 శాతమే అని పేర్కొంది. అయితే.. స్టాక్‌ ఎక్సేంజ్‌లో నమోదైన 11 కంపెనీల అదానీ గ్రూపు సంస్థలు ఏ ఒక్కటి కూడా తప్పు చేయలేదని గ్రూపు సీఎఫ్‌వో జుగేసిందర్‌రాబీసింగ్‌ స్పష్టం చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version