Arjith Shankar: మన సౌత్ ఇండియా గర్వపడే దర్శకులలో ఒకరు శంకర్(Shankar Shanmugham). రీసెంట్ గా ఆయన రెండు ఫ్లాప్స్ ఇచ్చాడు కదా అని, గతంలో ఆయన సాధించిన విజయాలను అంత తేలికగా మరచిపోలేము. ప్రముఖ తమిళ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay) తండ్రి చంద్ర శేఖర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శంకర్, 1993 వ సంవత్సరం లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరో గా తెరకెక్కిన ‘జెంటిల్ మ్యాన్’ చిత్రం ద్వారా డైరెక్టర్ గా మారాడు. సమాజం లో విద్యావ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను చూపిస్తూ, శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. హిందీ లో మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని రీమేక్ చేసాడు. ‘జెంటిల్ మ్యాన్” తర్వాత శంకర్ ‘ప్రేమికుడు’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘బాయ్స్’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’, ‘2 పాయింట్ O’ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకొని ఇండియా లోనే నెంబర్ 1 డైరెక్టర్ గా కొనసాగాడు.
అయితే ఈ చిత్రాల తర్వాత ఆయన రీసెంట్ గా తీసిన ‘ఇండియన్ 2’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు ఎంత పెద్ద ఫ్లాప్స్ గా నిల్చాయో మన అందరికీ తెలిసిందే. కమల్ హాసన్, రామ్ చరణ్(Global Star Ramcharan) అభిమానులు ఈ సినిమా ఫలితాలను జీవితంలో మర్చిపోలేరు. అంత పెద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం శంకర్ ‘ఇండియన్ 3’ చిత్రం చేస్తున్నాడు. ఒక ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ చేయడం అనేది చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంట. ఇదంతా పక్కన పెడితే శంకర్ కూతురు అదితి శంకర్(Adhiti Shankar) హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. తెలుగు లో ఈమె బెల్లంకొండ సురేష్ హీరో గా నటించిన ‘భైరవం’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

శంకర్ కి కూతురుతో పాటు అరిజిత్(Arijith Shankar) అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఈయనకు హీరో అవ్వాలని ఉంది, అదే విధంగా దర్శకుడు కూడా అవ్వాలని ఉందట. హీరో అయ్యేందుకు ముందు ఒక సినిమాకి దర్శకత్వం వహించాలి అనే పట్టుదలతో ఉన్నాడట. ప్రస్తుతం AR మురగదాస్, శివ కార్తికేయన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మదరాసి'(Madarasi Movie) అనే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని నేర్చుకొని, ఆ తర్వాత ఒక సినిమాకి దర్శకత్వం వహించే రేంజ్ కి వెళ్లాలని అరిజిత్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడున్న స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అరిజిత్ లుక్స్ ఉన్నాయి. శంకర్ అభిమానులు అరిజిత్ ని హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఎక్కువగా కోరుకుంటున్నారు. మరి ఆయన ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడో చూడాలి.