YS Jagna Meet Guntur Mirchi Formers
YS Jagan Mohan Reddy : వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన నేపథ్యంలో.. మంగళవారం విజయవాడలో ఆయనను జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అధైర్యపడవద్దని.. పార్టీ అండగా ఉంటుందని ఆయనకు సూచించారు. ఆ తర్వాత బుధవారం జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించారు. గుంటూరు మిర్చి యార్డులో రైతులను కలిశారు. ఇటీవల కాలంలో మిర్చి దారుణంగా పడిపోయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు మిర్చి పంటకు అధికంగా ధర ఉండేదని.. ఇప్పుడు క్వింటాకు 13వేలకు పడిపోయిందని.. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనకు.. కుంభమేళాలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కి టైం ఉంటుంది కానీ.. రైతులను పరామర్శించడానికి టైం లేదా అని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని.. గిట్టుబాటు ధర కల్పించాలని జగన్ డిమాండ్ చేశారు.
అభిమానులను వారించి
జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు వచ్చిన నేపథ్యంలో.. ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా వచ్చారు. రైతులను పరామర్శించడానికి జగన్ వెళుతున్న నేపథ్యంలో ఆయనను చుట్టుముట్టారు. కనీసం ఊపిరి కూడా తీసుకోవడానికి ఇబ్బంది పడేలా చేశారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి స్వయంగా కల్పించుకొని.. అభిమానులను వారించారు. రైతులను పరామర్శించడానికి వెళ్లాలని.. ఇలా అడ్డంపడితే అది సాధ్యం కాదని సూచించడంతో.. అభిమానులు ఆయనకు దూరంగా జరిగారు. ఆ తర్వాత మిర్చి యార్డ్ లో రైతులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.. ధర ఎంతొస్తోంది? ప్రభుత్వపరంగా ఏమైనా ప్రయోజనం అందుతోందా? పెట్టుబడికి ఎంత ఖర్చయింది? దిగుబడి ఎంత వచ్చింది? అనే విషయాలను జగన్మోహన్ రెడ్డి రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అయితే మెజారిటీ రైతులు తమకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సౌకర్యం అందడం లేదని.. పెట్టుబడి భారీగా అయిందని.. గిట్టుబాటు ధర లభించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మిర్చికి భారీగా ధర ఉండేదని.. ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పూర్తిగా పడిపోయిందని జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.. జగన్మోహన్ రెడ్డిని అభిమానుల చుట్టుముట్టినప్పుడు.. ఆయనవారించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నాయి. ” జగన్మోహన్ రెడ్డికి విశేషమైన అభిమాన గణము ఉంది.. దానిని నిరూపించే సంఘటనలు అనేకం జరిగాయి. ఇప్పుడు గుంటూరులో జరిగింది కూడా అదే. ఇప్పటికైనా కూటమినేతలు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. రైతుల కష్టాలను తీర్చడానికి పని చేయాలని” వైసీపీ నేతలు అంటున్నారు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ బుధవారం గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారు.. ఈ సందర్భంగా అభిమానులు ఆయనను చుట్టుముట్టారు.. దీంతో ఆయనే స్వయంగా సర్ది చెప్పాల్సి వచ్చింది. #YSJaganMohanReddy #Gunturmirchiyard#AndhraPradesh #mirchifarmers pic.twitter.com/k7ZjFp8Pq2
— Anabothula Bhaskar (@AnabothulaB) February 19, 2025