Gold Card USA
Gold Card USA: అమెరికాకు వెళ్లాలని చాలా మందికి కోరిక ఉంటుంది. ఇక్కడ చదువుకోవాలని కొందరు అనుకుంటే.. ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఉండాలని కోరుకునేవారు చాలా మంది ఉన్నారు. అయితే అమెరికాలు వీసా తో కొన్నాళ్లు ఉండొచ్చు. కాన శాశ్వతంగా నివాసం పొందాలంటే మాత్రం గ్రీన్ కార్డు పొందాల్సి ఉంటుంది. ఈ కార్డు ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. కానీ కొందరు అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటూ గడిపారు. అయితే ఇటీవల అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని కొందరని తిరిగి వారి దేశాలకు పంపిన విషయం తెలిసిందే. భారత్ కు చెందిన చాలా మంది ఇలా తిరుగుపయనమయ్యారు. ఈ తరుణంలో ఇక అమెరికాకు వెళ్లే అవకాశాలు లేవని అనుకున్నారు. ఇదే సమయంలో కొందరు వ్యాపారులు సైతం అమెరాకాకు బదులు ప్రత్యామ్నాయ దేశాన్ని ఎంచుకుంటున్నారు. ఇది గమనించిన ఆ దేశ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరపైకి ‘గోల్డ్ కార్డు’ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెరికాలో పౌరసత్వం కావాలంటే 5 మిలియన్ డాలర్లు ఉంటే చాలని తెలిపారు. అయితే దీనిపై మరో అనుమానం మొదలైంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 25న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని పంపేస్తూ మరో వైపు అమెరికాకు కొందరిని ఆహ్వానించారు. అయితే వారు గోల్డ్ కార్డును కలిగి ఉండాలని అంటున్నారు. గోల్డ్ కార్డు ఉన్న వారు అమెరికాలో వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు. ఈ సమయంలో ఈ గోల్డ్ కార్డు కేవలం వ్యాపారులకేనా? ఇక్కడ చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు వర్తించదా? అన్న చర్చ ప్రారంభమైంది. దీనిపై ట్రంప్ మరుసటి రోజు క్లారిట ఇచ్చారు.
గోల్డ్ కార్డు అనేది కేవలం సంపన్నులకు మాత్రమే కాదని, విద్యార్థులకు కూడా వర్తిస్తుందని తెలిపారు. అయితే గోల్డ్ కార్డును కొన్ని కంపెనీలు కొనుగోలు చేసి వాటి ద్వారా నైపుణ్యం కలిగిన వారిని తీసుకుంటారని అన్నారు. అమెరికాకు చెందిన కొన్ని బడా కంపెనీలు నాణ్యమైన మానవ వనరుల కోసం చూస్తుందని తెలిపారు. ఇందు కోసం భారత్ చైనా, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చి హార్వర్డ్ వంటి సంస్థల్లో చేరుతారు. వీరు అత్యుత్తమ విద్యార్థులుగా మారుతారు. ఇలాంటి వారి కోసం కంపెనీలు గోల్డ్ కార్డులను కొనుగోలు చేస్తాయని తెలిపారు.
గోల్డ్ కార్డు ద్వారా అమెరికాకు వచ్చిన వారు అత్యధికంగా ధనవంతులు అవుతారు. ఈ తరుణంలో ఎక్కువగా దేశానికి పన్నులు కూడా కడుతారు. దీంతో ఇరువురికి ఉపయోగంగా ఉంటుందని ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ గోల్డ్ కార్డు ఈబీ-5 వీసాలను భర్తి చేస్తుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్ పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా మోసాలు, అక్రమాలు అరికట్టగలుగుతామని తెలిపారు.ఈ విధానం కొందరికి బాగున్నా.. చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు మాత్రం ఇది కష్టమేనని అంటున్నారు. ఎందుకంటే ఇది కేవలం హార్వర్డ్ లాంటి పెద్ద ఇనిస్ట్యూట్ ల్లో అవకాశం లభించిన విద్యార్థులకు మాత్రమే వర్తించే పథకంలా ఉందని కొందరు అంటున్నారు.