https://oktelugu.com/

Today Horoscope In Telugu: ఈ రాశుల వారు జాగ్రత్త.. ఆ పనులు పూర్తి చేయడానికి కష్టపడతారు…

ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు నెరవేరుతాయి. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : February 28, 2025 / 08:03 AM IST
    Horoscope Today

    Horoscope Today

    Follow us on

    Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశరాసులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉందనే ఉంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండలు ఉన్నాయి. మరికొన్ని రాశుల వారు కొన్ని పనులను కష్టంగా పూర్తి చేస్తారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు నెరవేరుతాయి. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఒకప్పుడు చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. లక్ష్యాలను పూర్తి చేయడంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో హాయిగా ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తుంది. వ్యాపారులకు కొన్ని ఆటంకాల ఎదురవుతాయి. అయినా మనోధైర్యంతో ముందుకు వెళ్లాలి. ఇష్టమైన వారితోనే గడిపేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. అయితే కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు తీసేవారు జాగ్రత్తగా ఉండాలి.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులు చేపట్టాబోయిన పనులు కష్టంగా పూర్తవుతాయి. అయితే శత్రువుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం అంతంత మాత్రం గానే ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. పెండింగ్ బకాయిలను వసూలు చేసుకోవాలి. లేకుంటే ఇబ్బందులకు గురవుతారు.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వ్యాపారాలు చేసే కొన్ని పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగిపోతాయి. కుటుంబ సభ్యులకు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ఓ విషయంలో వాగ్వాదం ఏర్పడుతుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకొని వాతావరణాన్ని ప్రశాంతం చేయాలి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. పదోన్నది పొందేందుకు మార్గం ఏర్పడుతుంది.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే అంతకుముందే పెద్దల సలహా తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. భాగస్వాముల సహకారంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులను పెడతారు.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి. గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేయడం వల్ల ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఉద్యోగులు ప్రాజెక్టును పూర్తి చేయడంతో పదోన్నతులు పొందుతారు. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. బ్యాంకు రుణం పొందాలనుకునే వారికి ఈరోజు అనుకూల సమయం.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ప్రారంభించిన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అయితే వీటికి ఆటంకాలు ఎదురైనప్పటికీ ముందుకు సాగుతారు. పెద్దల సహకారంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల అండతో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఎదురైన లక్ష్యాలను పూర్తి చేస్తారు. అయితే కొన్ని పనుల్లో సంయమనం పాటించడం మంచిది. అధికారులతో వాగ్వాదం ఏర్పడి ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఉద్యోగాలు చేసేవారు తోటి వారితో సంయమను పాటించాలి. అధికారుల నుంచి కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలోనే ఓపికగా ముందుకు సాగాలి. కొందరు తమ పనులకు ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో వ్యాపారులు లాభాలు పొందుతారు.

    ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారులకు బంధువుల సహాయం ఉంటుంది. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు అన్ని కలిసి వస్తాయి. ఇష్టదైవాన్ని పూజించడం వల్ల మరింత సంతోషంగా ఉంటారు.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కొన్ని పనులు కష్టంగా పూర్తి చేస్తారు. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల మరింత సులభంగా పూర్తి చేసుకోవచ్చు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనాలపై ప్రయాణాలు చేయడం మానుకోవాలి.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణ ఉండడంతో చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారంతో ధన లాభం పొందుతారు. గతంలో చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు కెరీర్ కోసం కీలక పరీక్షలు రాస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ప్రవర్తనలో మార్పు ఉంటుంది. దీంతో ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ వాతావరణంలో కాస్త గంధం లోనంగా మారుతుంది. అయితే ఈ సమయంలో కాస్త ఓపికతో వ్యవహరించాలి. ఉద్యోగులు అధికారులతో సంయమనం పాటించాలి. లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.