Jobs
Jobs: కొందరికి Private Jobs చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు నిత్యం రిక్రూట్ మెంట్ కోసం ఎదరుచూస్తారు. అయితే ఎప్పటికప్పుడు నిపుణులను, మ్యాన్ పవర్ ను కోరుకోవడానికి బ్యాంకులు ముందు ఉంటాయి. కాస్త నైపుణ్యం ఉన్న వారు నేటి కాలంలో Bank Jobs సులువుగా కొట్టొచ్చు. తాజాగా ఓ బ్యాంకు రిక్రూట్ మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పని చేయడానికి అసవరమైన Manpower కోసం దరఖాస్తులను కోరుతోంది. ఆ వివరాల్లోకి వెళితె..
డిగ్రీ పూర్తి చేసిన వారు బ్యాంకు జాబ్స్ కోసం ఎదురుచూసినట్లయితే వీరికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే IDBI బ్యాంక్ తాజాగా జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రకటన ప్రకారం మొత్తం 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్స్ ఖాళీలు ఉన్నాయి. ఇందులో 260 యూఆర్, ఎస్సీ 100, ఎస్టీ 54, ఈ డబ్ల్యూఎస్ 65, ఓబీసీ 171, పీ డబ్ల్యూడీ 26 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఉద్యోగాలు రావాలంటే రాత పరక్షతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ రెండు విధానాల ద్వారా ఎంపికైన వారు ఏడాది పాటు పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లోమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనే కోర్సును చదవాల్సి ఉంటుంది.
ఈ కోర్సు మొత్తంలో 6 నెలల పాటు క్లాస్ రూం ట్రైనింగ్ ఉంటుంది. మిగతా వాటిలో 2 నెలల పాటు ఇంటర్న్ షిప్, 4 నెలల పాటు ఆన్ జాబ్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా బెంగుళూరులోని మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ లో చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. ఉద్యోగంలో చేరిన మొదటి ఏడాది రూ.6.5 లక్షల ప్యాకేజిని అందిస్తారు. ఈ దరఖాస్తులు మార్చి 1 నుంచి ప్రారంభం అవుతాయి. 12 లోగా మాత్రమే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తును ఆన్ లైన్ లోనూ చేసుకోవాలి. ఐడీబీఐకి చెందిన అధికారిక వెబ్ సైట్ లో ఈ అవకాశాన్ని ఇచ్చారు. దరఖాస్తు చేసుకోవడానికి గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీని లేదా గ్రాడ్యుయేట్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే లాస్ట్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 1 నాటికి అభ్యర్థులు 20 నుంచి 25 సంవత్సరాల లోపు వారై ఉండాలి. దరఖాస్తు చేసిన వారికి పరీక్షను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కతాతో పాటు మరికొన్ని నగరాల్లో ఉంటుంది. ముందుగా ఆన్ లైన్ టెస్ట్ నిర్వహించిన ఆ తరువాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం ఆన్ లైన్ పరీక్షను ఏప్రిల్ 6న నిర్వహిస్తారు. శిక్షణకు ఎంపికైన వారికి వారికి ప్రతి నెల రూ.5,000 స్టైఫండ్ ఇస్తారు. ఇంటర్న్ షిఫ్ సమయంలో రూ.15,000 ఇస్తారు. డిగ్రీ పూర్తి చేసి జాబ్ కోసం ఎదురుచూసేవారికి ఇది మంచి అవకాశం అని కొందరు చెబుతున్నారు.