Homeఅంతర్జాతీయంIran War Strategy: తల తెగినా తలొగ్గలేదు.. ఇరాన్‌ యుద్ధ వ్యూహం ప్రపంచానికే ఆదర్శం!

Iran War Strategy: తల తెగినా తలొగ్గలేదు.. ఇరాన్‌ యుద్ధ వ్యూహం ప్రపంచానికే ఆదర్శం!

Iran War Strategy: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు అణ్వాయుధాలు తయారు చేస్తుందని యుద్దం ప్రారంభించాడు. కానీ దీనివెనుక లక్ష్యం రేజీమ్‌ చేంజ్‌. అయితే ఈ యుద్ధంలో ఇరాన్‌ అనుసరిస్తున్న వ్యూహం.. దశాబ్దాలుగా రూపొందించుకున్న నాయకత్వ లక్ష్యణాలు.. అగ్రరాజ్యానికే ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. 24 రోజులైనా.. సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని చంపేసినా.. ఇరాన్‌ అగ్రరాజ్యానికి తలవంచడం లేదు. మొజాయిక్‌ డిఫెన్స్‌ రహస్యం.. జనరల్‌ మహమ్మద్‌ జాఫరీ రూపొందించిన ’మొజాయిక్‌ […]

Iran War Strategy: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు అణ్వాయుధాలు తయారు చేస్తుందని యుద్దం ప్రారంభించాడు. కానీ దీనివెనుక లక్ష్యం రేజీమ్‌ చేంజ్‌. అయితే ఈ యుద్ధంలో ఇరాన్‌ అనుసరిస్తున్న వ్యూహం.. దశాబ్దాలుగా రూపొందించుకున్న నాయకత్వ లక్ష్యణాలు.. అగ్రరాజ్యానికే ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. 24 రోజులైనా.. సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని చంపేసినా.. ఇరాన్‌ అగ్రరాజ్యానికి తలవంచడం లేదు.

మొజాయిక్‌ డిఫెన్స్‌ రహస్యం..
జనరల్‌ మహమ్మద్‌ జాఫరీ రూపొందించిన ’మొజాయిక్‌ డిఫెన్స్‌’ వ్యవస్థ ఇరాన్‌ సైన్యాన్ని 31 ప్రావిన్షలుగా విభజించి, ప్రతీ యూనిట్‌కు స్వతంత్ర డ్రోన్లు, క్షిపణులు, కమాండర్లను ఇచ్చింది. ఈ ప్రావిన్షులు కేంద్ర ఆదేశాలు లేకుండా యుద్ధం చేయగలవు, ఒక భాగం దెబ్బతిన్నా మిగతావి స్వతంత్రంగా పనిచేస్తాయి.

డెకాపిటేషన్‌ వ్యూహం వైఫల్యం
ఫిబ్రవరి 28 దాడుల్లో అమెరికా–ఇజ్రాయెల్‌ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, మొజాయిక్‌ వ్యవస్థ వల్ల సైన్యం కుప్పకూలలేదు. సద్దాం, గడ్డాఫీల పతనం తర్వాత దేశాలు ముక్కలైన అనుభవాల నేపథ్యంలో ఇరాన్‌ ఈ రక్షణాన్ని రూపొందించుకుంది. ఫలితంగా, నాయకత్వ శూన్యత యుద్ధాన్ని ఆపలేదు, ప్రతీకార దాడులను మరింత పెంచింది.

పైర్రిక్‌ విక్టరీ పరిణామాలు
పైర్రస్‌ రాజు రోమన్లతో గెలిచినప్పటికీ సైన్యాన్ని కోల్పోయి బర్బాదైనట్టు, ఇక్కడ అమెరికా–ఇజ్రాయెల్‌ ’గెలిచిన’ దాడి సర్వస్వం కోల్పోయేలా మారింది. ఇరాన్‌ ప్రతీకారంగా గల్ఫ్‌ దేశాలు, అమెరికా స్థావరాలపై క్షిపణులు వర్షించడం యుద్ధాన్ని విస్తరించింది. ఈ వ్యూహం శత్రువును అంతులేని ఆటలో చిక్కించి, ఆర్థిక–సైనిక భారాన్ని పెంచుతుంది.

యుద్ధంలో తల నరికితే కూడా మొండెం పోరాడుతుంటే, శత్రువు ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలి అనేది సవాలు. ఇరాన్‌ వ్యవస్థ పని చేసే ’నిశ్శబ్ద’ బలాన్ని చూపిస్తూ, ఆధునిక యుద్ధాల్లో విడిగా పనిచేసే యూనిట్లు కీలకమవుతాయని సూచిస్తుంది. ఇలాంటి రణనీతి ప్రపంచ దేశాలకు పాఠం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper