US Urges G7: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. ఈసారి భారత్‌ను టార్గెట్ చేశారు. ఆయనను చూసుకుని ఆయన మంత్రులు: ఎగిరెగిరి పడుతున్నారు. భారత్‌పై విమర్శలు చేస్తున్నారు. ఇక ట్రంప్ సుంకాల పేరుతో వేధిస్తున్నారు. జీ7 దేశాలు కూడా సుంకాలు విధించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించారు. జీ7 దేశాలు కూడా సుంకాలు విధిస్తే ప్రపంచ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయి. దీంతో ట్రంప్ పిలుపును ఆ దేశాలు పట్టించుకోవడం లేదు. ఇక తాజాగా ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న దేశంగా భారత్ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, అమెరికా నుంచి కనీస మొక్కజొన్న పొత్తులు కూడా కొనుగోలు చేయడం లేదని ఆయన అక్కసు వెల్లగక్కాడు. భారతదేశం తన సుంకాలను తగ్గించుకోకపోతే, అమెరికాతో వాణిజ్యం విషయంలో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఈ అక్కసు, హెచ్చరిక చూస్తుంటే ’అమెరికా ఫస్ట్’ విధానానికి అనుగుణంగా ఒక రాజకీయ సంకేతంగా కనిపిస్తోంది. సుంకాల కారణంగా భారత్, కెనడా, బ్రెజిల్ వంటి దేశాలతో అమెరికా సంబంధాలు దెబ్బతింటున్నాయా అనే ప్రశ్నకు సమాధానంగా లుట్నిక్ ఇచ్చిన సమాధానం.. భారతదేశాన్ని ’ఒక వైధవ్య భాగస్వామి’గా చిత్రీకరిస్తున్నాయి. అయితే భారత ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రశ్నిస్తూ, అమెరికా మార్కెట్‌పై ఆధారపడాలి అన్నట్లుగా లుట్నిక్ వ్యాఖ్యలు ఉన్నాయి.
వాణిజ్య అసమతుల్యత..
అమెరికా–భారత వాణిజ్య సంబంధాలు ఎప్పటి నుంచో అసమతుల్యంగా ఉన్నాయి. భారతదేశం అమెరికా మార్కెట్‌లో పెద్ద మొత్తంలో ఎగుమతులు (ముఖ్యంగా ఐటీ, ఔషధాలు, టెక్స్‌టైల్స్) చేస్తున్నప్పటికీ, అమెరికా ఉత్పత్తులపై భారతదేశం విధించిన భారీ సుంకాలు (కార్యంగా 50% వరకు) పరిమితం చేస్తున్నాయి. లుట్నిక్ ప్రస్తావించిన మొక్కజొన్న (కార్న్) ఉదాహరణ ఇక్కడ కీలకం. భారతదేశం తన స్వయం సమృద్ధి కార్యక్రమాలు (ఉదా: ఆహార భద్రత) కోసం స్థానిక రైతులను ప్రోత్సహించడానికి ఈ సుంకాలు విధిస్తోంది, కానీ అమెరికా దృష్టిలో ఇది ’అన్యాయమైన ప్రతిబంధం’గా మారింది. ట్రంప్ 25% అదనపు సుంకాలు భారత ఎగుమతులపై విధించారు. ముఖ్యంగా రష్యన్ ఆయిన్ ఆయిల్ కొనుగోలు కారణంగా మరో 25 శాతం సుంకాలు విధించారు. అయితే ఇది కేవలం వాణిజ్యం కాదు, భౌగోళిక రాజకీయాలతో ముడిపడి ఉంది. భారతదేశం అమెరికా మార్కెట్‌ను కోల్పోతే జీడీపీకి 1–2% దెబ్బ తగులుతుంది, కానీ స్థానిక పరిశ్రమలను కాపాడటానికి సుంకాలు అవసరమే. లుట్నిక్ మాటలు భారతదేశాన్ని క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది.
సారీ చెప్పి డీల్..
లుట్నిక్ భారతదేశం 1–2 నెలల్లో అమెరికాతో చర్చలకు వస్తుందని, ’సారీ చెప్పి డీల్ చేసుకుంటుంది’ అని అంచనా వేశారు. ఇది కెనడాతో జరిగిన వాణిజ్య యుద్ధానికి పోలి చూపిస్తున్నారు, అక్కడ కెనడా చివరికి ఒప్పందానికి ఒప్పుకుంది. అయితే, భారతదేశం రష్యన్ ఆయిల్ కొనుగోలు ఆపకపోతే లేదా బ్రిక్స్ నుంచి బయటçకు రాకపోతే 50% సుంకాలు విధించవచ్చని హెచ్చరించారు. అయితే ఈ ఒత్తిడి భారతదేశానికి రెండు మార్గాలు చూపిస్తోంది – ఒకటి, అమెరికాతో బలమైన ఒప్పందం (ఇది ఆర్థిక ప్రయోజనాలు ఇస్తుంది, ముఖ్యంగా టెక్ మరియు డిఫెన్స్ రంగాల్లో), రెండు, డైవర్సిఫికేషన్ (చైనా, యూరోప్‌తో మరిన్ని ఒప్పందాలు). ట్రంప్–మోదీ సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ, ఈ వివాదం రాజకీయంగా ప్రభావితం చేయవచ్చు. చివరికి, అమెరికా యొక్క విధానం భారతదేశాన్ని ఒత్తిడి చేస్తుంది, అయితే భారత్ తన ఆర్థిక వ్యూహాన్ని మార్చకుండా సమతుల్యత్వం కాపాడుకోవాలి.