Iran Plans Attack On USA: ఇరాన్, అమెరికా–ఇజ్రాఎల్ వార్ 13వ రోజుకు చేరింది. యుద్ధం మొదలైన మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా మట్టుబెట్టింది. దీంతో యుద్ధం నాలుగైదు రోజులు జరుగుతుందని అంతా భావించారు. కానీ, అసలు యుద్ధం మరుసటి రోజు నుంచే మొదలైంది. అమెరికా అనుకూల దేశాలను ఇరాన్ టార్గెట్ చేసింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై వైమానికి దాడులతో విరుచుకుపడుతోంది. రాయబార కార్యాలయాలను టార్గెట్ చేసింది. ఆయిల్ కంపెనీలు, వాటర్ ప్లాంట్లు లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ అమెరికాపై నేరుగా దాడికి ప్లాన్ చేసినట్లు తెలిసింది. కాలిఫోర్నియాపై డ్రోన్ దాడికి ప్లాన్ రూపొందించినట్లు ఎఫ్‌బీఐ గుర్తించింది.
Also Read: గూగుల్ డేటా సెంటర్‌పై జగన్ కి ఎందుకంత కడుపుమంట?
ఎఫ్‌బీఐ అలర్ట్..
అమెరికా యుద్ధం ప్రారంభించిన రోజే ఇరాన్ కూడా అమెరికాలోని కాలిఫోర్నియాపై దాడి ప్లాన్ అమలు చేయాలని భావించింది. గగన తలం నుంచి డ్రోన్లతో విరుచుకుపేలా వ్యూహం రూపొందించింది. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ పసిగట్టింది. తాజా బులిటెన్‌లో దీనిని ధ్రువీకరించింది. ఓక్లాండ్ పోలీసు ఫెడరల్ భాగస్వాములతో సంప్రదించి విజిలెన్స్ పెంచారు. మరోవైపు ఖమేనీ మరణంతో ఈ వ్యూహం అమలు ఆపివేసినట్లు తెలుస్తోంది.
ఇరాన్ సామర్థ్య విశ్లేషణ
ఇరాన్ యుద్ధ నౌకలు ధ్వంసమైనా, షహీద్–136 వంటి లో రేంజ్ డ్రోన్లు (1000–2500 కి.మీ.) అంతరిక్ష దూరం(12000+ కి.మీ.) చేరుకోలేవని నిపుణులు అంచనా.ప్రొక్సీలు లేదా స్థానిక సెల్ల ద్వారా దాడి అసాధ్యం కాకపోయినా, అమెరికా రాడార్, ఇంటర్‌సెప్టర్ వ్యవస్థలు బలోపేతం చేయబడ్డాయి. ఇది ఇంటెల్ ఆధారిత హైపోథెటికల్ ఆకాంక్ష కంటే ఎక్కువగా లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈ అలర్ట్‌తో వెస్ట్ కోస్ట్ పోలీసు డిపార్ట్మెంట్లు అలర్ట్‌లో ఉన్నాయి, టెర్రరిస్టు దాడులపైనా అప్రమత్తంగా ఉన్నాయి. రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నిపుణులు స్థానిక ముందస్తు చర్యలు సూచించారు.