America: నిర్దోషికి పదేళ్ల జైలు శిక్ష.. చివరకు నిజం తెలిసి 419 కోట్ల పరిహారం.. అమెరికాలో ఇదో అంతులేని కథ!

పది మంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు కానీ, ఒక్క నిర్దోషికి శిక్ష పడొద్దు అని మన రాజ్యాంగం చెబుతంది. ఇదే మన దేశంలో నేరం చేసేవారికి అలుసుగా మారింది. కానీ, చాలా దేశాల్లో నేరం చేసినట్లు తెలిస్తే చాలు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 11, 2024 3:52 pm

America(2)

Follow us on

America: భారత రాజ్యాంగమే మన దేశంలో అందరికీ ఆధారం. అన్ని వ్యవస్థలకూ మూలం. దాని ప్రకారమే అందరూ నడుచుకోవాలి. ఎవరు అతిక్రమించినా శిక్షార్హులే. భారత న్యాయ వ్యవస్థ, చట్టాలు కూడా రాజ్యాంగానికి లోబడే ఉంటాయి. న్యాయమూర్తులు కూడా రాజ్యాంగం ప్రకారమే తీర్పులు ఇస్తారు. నిర్దోషులు అన్యాయంగా శిక్షించబడకూడదన్న ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌.అంబేద్కర్‌ రాజ్యాంగంలో విచారణకు నిబంధనలు విధించారు. కానీ, నేరస్తులు దీనినే ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ సాకుతోనే నేరం చేసి తప్పించుకుతిరుగుతున్నారు. అయితే గల్ఫ్‌ దేశాల్లో విచారణ పేరుతో కాలయాపన ఉండదు. నేరం చేసినట్లు తెలియగానే బహిరంగా మరణ శిక్ష విధిస్తారు. చాలా దేశాల్లో నేరాలకు కఠిన శిక్షలు ఉన్నాయి. మన దేశంలో శిక్షలు కఠినంగా లేకపోవడం కూడా నేరాల సంఖ్య పెరగడానికి ఒక కారణంగా చెబుతారు. అయితే అగ్రరాజ్యం అమెరికాలో పొరపాటున ఓ వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష, రూ. 416 కోట్ల జరిమానా విధించింది కోర్టు. చివరకు విషయం తెలిసి నిర్దోషిగా విడుదల చేయడంతోపాటు 50 మిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

హత్య చేశాడన్న అభియోగంపై..
19 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్‌ బ్రౌన్‌ అనే వ్యక్తిని 2008లో పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారిస్తూ 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, అతడితో బలవంతంగా నేరాంగీకారం చేయించారని చెబుతూ 2018లో బ్రౌన్‌ తరపున న్యాయవాదులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు. దీంతో అతడిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేస్తూ బ్రౌన్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలోనే తప్పుడు కేసులో తనను జైల్లో పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ బ్రౌన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన చికాగో ఫెడరల్‌ కోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

భారీగా పరిహారం..
తప్పుడు కేసులో బ్రౌన్‌ను అరెస్టు చేసినందుకు 10 మిలియన్‌ డాలర్లు, పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించేలా చేసినందుకు మరో 40 మిలియన్‌ డాలర్లు అతడికి పరిహారంగా చెల్లించాలని కోర్టు తాజాగా ఆదేశించింది. అంటే మొత్తంగా 50 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.419 కోట్లకు పైమాటే) పరిహారం ఇప్పించింది. కోర్టు తీర్పుపై బ్రౌన్‌ హర్షం వ్యక్తంచేశారు. ఇన్నాళ్లకు తనకు, తన కుటుంబానికి న్యాయం జరిగిందని పేర్కొన్నాడు.