Flight Offers: విమాన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు రద్దీ తక్కువగా ఉండే సమయంలో ఎయిర్ లైన్స్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ ఆఫర్లలో ఎక్కువగా రాయితీలే ఉంటాయి. గతంలో అనేకసార్లు ఆఫర్లు ఇచ్చాయి. క్రికెట్, ఫుట్‌బాల్ ప్రంపచ కప్‌లు జరుగుతున్న సమయంలో, ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలోనూ ఆఫర్లు ఇస్తుంటాయి. గత కొంత కాలంగా ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో.. చాలా ఎయిర్‌లైన్స్ ఇలా స్పెషల్ సేల్స్ లాంఛ్ చేస్తున్నాయి. ఇండిగో, విస్తారా, స్టార్ ఎయిర్, ఆకాశ వంటి చాలా సంస్థలు కూడా ఇలాగే తక్కువ ధరల్లో విమాన ప్రయాణాలు తీసుకొచ్చాయి. తాజాగా భారత విమానయాన సంస్థ ప్రకటించిన ఆఫర్ మాత్రం అదిరిపోయింది. కేవలం బస్ చార్జీతోనే విమానంలో ప్రయాణం చేయవచ్చు టాటా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లాష్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో విక్రయించే ఎక్స్‌ప్రెస్ లైట్ సర్వీసుల టికెట్ల ప్రారంభ ధర కేవలం రూ.932గా ఉంది. ఈ నెల 16 వరకు సేల్ అందుబాటులో ఉంటుందది. ఈలోపు బుక్ చేసుకున్నవారు 2025 మార్చి 31 వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఎక్స్‌ప్రెస్ వాల్యూ సర్వీసుల బుకింగ్స్‌కూ వర్తిస్తుందని, టికెట్ ధర రూ.1,088 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది.
మరో ఐదు రోజులే గడువు..
ఎక్స్‌ప్రెస్ ఫ్లాష్ సేల్ ఆఫర్‌కు ఇంకా ఐదు రోజులే గడువు ఉంది. ఈ ఎయిర్‌లైన్స్ అవార్డ్ విన్నింగ్ వెబ్‌సైట్ ఎయిరిండియాఎక్స్‌ప్రెస్.కామ్, మొబైల్ యాప్స్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకునే వారికి.. ఎలాంటి కన్వీనియన్స్ రుసుము కూడా ఉండదని స్పష్టం చేసింది. అంటే రిజిస్టర్డ్ యూజర్లకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని గుర్తుంచుకోవాలి. రూ. 932 కే విమాన ప్రయాణం అంటే గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇక పరిమిత కాలపు ఆఫర్ కాబట్టి.. విమానం ఎక్కాలనే ఆశ, కోరిక ఉన్నవారు దీనిని వినియోగించుకోవచ్చు. ఢిల్లీ– గ్వాలియర్, కొచ్చి– బెంగళూరు, బెంగళూరు– చెన్నై వంటి మార్గాల్లో ఈ స్పెషల్ ఫేర్స్ వర్తిస్తాయి.
– వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే వారికి.. చెకిన్ బ్యాగేజీ ధరలు కూడా ప్రత్యేకంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక్కడ ఫ్రీగా 3 కిలోల వరకు కేబిన్ లగేజీని అదనంగా ఉచితంగానే బుక్ చేసుకునేందుకు వీలుంటుంది. చెకిన్ బ్యాగేజీపై దేశీయ రూట్లలో 15 కిలోలకు రూ.1000, ఇంటర్నేషనల్ రూట్లలో అయితే 20 కిలోలకు రూ. 1300 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
– లాయల్టీ మెంబర్స్‌కు ఫుడ్ సహా డ్రింక్స్‌పై స్పెషల్ డిస్కౌంట్లు ఉంటాయి. ఇక్కడ రాయితీ లభిస్తుందని చెప్పొచ్చు. స్టూడెంట్స్, డాక్టర్లు, నర్సులు, సీనియర్ సిటిజన్లు, సాయుధ దళాలు సహా వీరిపై ఆధారపడిన వారు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఛార్జీలపై కంపెనీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది.
పండుగ రద్దీపై దృష్టి..
పండగ సీజన్‌లో ఇంకా బిజీగా ఉండే పలు మార్గాల్లో విమాన టికెట్ ధరలపై కన్నేసి ఉంచినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పండగ సీజన్లో చాలా మంది సొంతూళ్లకు పయనం అయ్యేందుకు విమానాల కోసం చూస్తుంటారన్నారు. అప్పుడు.. ఇదే అదునుగా ధరలు ఆకాశన్నంటుతాయి.
బిజినెస్ కాస్ల్‌కు గుడ్‌బై..
టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ వచ్చే సంవత్సరం నుంచి తమ విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి విమానాల సంఖ్యను 100కు పెంచుకోనుంది.